Telangana: భళా..! ఆవుకు శ్రీమంతం.. ముత్తయిదువులతో శుభకార్యం

Telangana: భళా..! ఆవుకు శ్రీమంతం.. ముత్తయిదువులతో శుభకార్యం
Cow Seemantham

 అది ఆవే కావొచ్చు.. కానీ ఇంట్లో ఆడకూతురికి మాదిరిగానే శ్రీమంతం చేశారు. అందరినీ పిలిచారు. ఘనంగా కార్యక్రమం చేశారు. అక్షింతలు వేసి దీవించారు.

Ram Naramaneni

|

Aug 16, 2021 | 8:47 PM

అది ఆవే కావొచ్చు.. కానీ ఇంట్లో ఆడకూతురికి మాదిరిగానే శ్రీమంతం చేశారు. అందరినీ పిలిచారు. ఘనంగా కార్యక్రమం చేశారు. అక్షింతలు వేసి దీవించారు. భారతీయ సంస్కృతిలో ఆవులు, ఎద్దులకు విశిష్ట స్థానం ఉంది. మూగజీవాల పట్ల తమకున్న ప్రేమను చాటుకుంటారు. తమ ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న గోవుకి శ్రీమంతం చేసింది నిర్మల్ జిల్లా పల్సి గ్రామానికి చెందిన రాములుస్వామి అనే రైతు కుటుంబం. గోమాతకు ఘనంగా శ్రీమంతం నిర్వహించారు ఇంటి సభ్యులు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల అతిథులను సైతం అహ్వనించారు.

ఆవుకు అంగరంగ వైభవంగా శ్రీమంతం కార్యక్రమాన్ని జరిపారు. పండ్లు, పూలు, కొత్త బట్టలు సమర్పించి పూజలు చేశారు. వచ్చినవారు అక్షింతలు వేసి దీవించారు. రాముల స్వామి కుటుంబ సభ్యులు పిండి వంటలు తయారుచేశారు. వచ్చినవారికి వండించారు. ఆవులను కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నామన్నారు ఇంటి యజమాని రాములుస్వామి. వాటిని ఎంతో ప్రేమను పెంచుకున్నామని చెప్పారు. ఆవుకు మొదటి కాన్పు కావడంతో హిందూ సంప్రదాయం ప్రకారం.. కార్యక్రమం నిర్వహించిన తీరు స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది. ఆవుకు ప్రేమతో ఈ శ్రీమంతం కార్యక్రమం చేయడం పట్ల రాములు స్వామిని అభినందించారు స్థానికులు. జంతు ప్రేమికులు ఐతే.. ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఆవుకి శ్రీమంతం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

Also Read:రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతం.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్

ఏపీకి నేడు, రేపు భారీ వర్షసూచన.. వారికి విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ అలెర్ట్

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu