ఫస్ట్ నైట్ తర్వాత స్నానం చేస్తూ నవవధువు హఠాన్మరణం.. కారణం ఏంటో తెలిసి అంతా షాక్..

మీరట్‌లో గ్యాస్ గీజర్ లీక్ కావడంతో ఊపిరాడక నవవధువు మృతి చెందింది. గ్యాస్ గీజర్ ఎలా ఉపయోగించలి..? గ్యాస్ గీజర్ అమర్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? సురక్షితంగా అనుసరించాల్సిన చిట్కాలను ఇక్కడ మనం తెలుసుకుందాం..

ఫస్ట్ నైట్ తర్వాత స్నానం చేస్తూ నవవధువు హఠాన్మరణం.. కారణం ఏంటో తెలిసి అంతా షాక్..
Gas Geyser
Follow us

|

Updated on: Jan 30, 2023 | 12:45 PM

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటనలో నవ వధువు మృతి చెందింది. పెళ్లి జరిగిన మరునాడే ఈ ఘటన జరిగింది. ఆ నవ వధువు స్నానం చేసేందుకు తన అత్తమామల ఇంట్లోని బాత్‌రూమ్‌కి వెళ్లింది. చాలా సేపు అక్కడే ఉంది. ఎంతకూ బాత్‌రూమ్ నుంచి రాకపోవడంతో కుటుంబ  సభ్యులు డోర్లు పగల గొట్టి చూడటంతో అసలు విషయం తెలిసింది.

బాత్‌రూమ్‌లోని ఓ మూలలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించారు. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

నవ వధువు మృతికి కారణం ఇదే..

నవ వధువు మ‌ృతిరి కారణాలను వైద్యులు విశ్లేషించారు. ఇందులో.. గ్యాస్ గీజర్‌లు కార్బన్ మోనాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఇది పీల్చిన కొద్ది నిమిషాల్లోనే మృత్యువొడిలోకి జారుకుంటారు. ఈ గ్యాస్ చాలా ప్రమాదకరమైనది. ఈ గ్యాస్ పీల్చిన మరుక్షణమే మైకంలోకి జారుకుంటారు. ఆ తర్వాత అపస్మారక స్థితిని వెళ్లిపోతారు. అయితే వెంటనే గుర్తించి వైద్యులకు చూపిస్తే ప్రాణాలు రక్షించే అవకాశం ఉంది.

గ్యాస్ గీజర్లను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు ఏంటి?

గ్యాస్ గీజర్ల వాడకం మూర్ఛ వ్యాధికి దోహదపడిందని గతంలో చెప్పేవారు. అయితే, గ్యాస్ గీజర్‌ని ఉపయోగిస్తున్నవారు తప్పకుండా వారు వినియోగిస్తున్న బాత్‌రూమ్‌లో బాగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవలి. మంచి గాలి వచ్చే బాత్‌రూమ్‌లో మాత్రమే స్నానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే, కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ, చాలా సందర్భాలలో కొన్ని నెలలపాటు ఉపయోగించే యాంటీ-సీజర్ మందులతో చికిత్స చేయవచ్చు. ఐదు నిమిషాలకు పైగా గ్యాస్‌ను పీల్చడం వల్ల తలతిరగవచ్చు. ఇది ఎక్కువసేపు ఉంటే ముందుగా స్పృహ కోల్పోవచ్చు.. ఆ తర్వాత ఊపిరాడక చనిపోవచ్చు.

గ్యాస్ గీజర్‌ను సురక్షితంగా ఎలా ఉపయోగించాలి?

గ్యాస్ గీజర్‌ను సురక్షితంగా ఉపయోగించడానికి వైద్యులు ఈ క్రింది చిట్కాలు..

  • గీజర్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ఏవైనా లీక్‌లు ఉంటే వెంటనే సరిచేయాలి.
  • గీజర్ ఉన్న బాత్‌రూమ్‌లో తప్పకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవలి. గీజర్ పని చేస్తున్నప్పుడు దాన్ని ఆన్ చేయండి.
  • లీక్ ఉంటే ఉపయోగించవద్దు
  • బాత్రూంలో కనీసం ఒక కిటికీ ఉండేలా చూసుకోండి
  • మీకు ఊపిరాడినట్లు అనిపించినా లేదా ఒక్క సెకను కూడా దగ్గడం ప్రారంభిస్తే.. వెంటనే కాస్త స్వచ్ఛమైన గాలిని పొందడానికి బయటకు వెళ్లండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్