AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russell’s Viper: ఒకేసారి డజన్ల కొద్దీ పిల్లల్ని కనే పాము ఇది..

తెలుగు రాష్ట్రాల్లో “రక్త పింజర”గా పిలిచే రస్సెల్స్ వైపర్.. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన విషపాముల్లో ఒకటి. పొలాలు, గడ్డి పొదలు, రాళ్ల ప్రాంతాల్లో సంచరించే ఈ పాము.. ఒక్క కాటుతోనే ప్రాణాపాయం కలిగించే శక్తి కలిగి ఉంటుంది. గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలను కనడం, పుట్టిన పిల్లల్లో కూడా విషం ఉండటం దీని అత్యంత ఆశ్చర్యకరమైన ప్రత్యేకత.

Russell’s Viper: ఒకేసారి డజన్ల కొద్దీ పిల్లల్ని కనే పాము ఇది..
Russell's Viper
Ram Naramaneni
|

Updated on: May 27, 2026 | 3:36 PM

Share

భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటి రస్సెల్స్ వైపర్. తెలుగు రాష్ట్రాల్లో దీనిని చాలాచోట్ల రక్త పింజర అని పిలుస్తారు. గ్రామాలు, పొలాలు, రాళ్ల ప్రాంతాలు, గడ్డి పొదల్లో ఎక్కువగా కనిపించే ఈ పాము.. ఒక్క కాటుతోనే ప్రాణాపాయం కలిగించే శక్తి కలిగి ఉంటుంది. రస్సెల్స్ వైపర్ విషం రక్తంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాటు వేస్తే రక్తం గడ్డకట్టే విధానం దెబ్బతింటుంది. అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చికిత్స ఆలస్యం అయితే ప్రాణాపాయం పెరుగుతుంది. అందుకే దీనిని భారతదేశంలో టాప్ 4 విషపాముల్లో ఒకటిగా గుర్తిస్తారు. ఈ పామును గుర్తించడం కొంచెం సులభమే. శరీరంపై పెద్ద పెద్ద గోధుమ రంగు వలయాల మచ్చలు ఉంటాయి. తల త్రిభుజాకారంలో ఉంటుంది. శరీరం లావుగా, బలంగా కనిపిస్తుంది. ప్రమాదం అనిపిస్తే గట్టిగా “ష్..ష్..” అంటూ శబ్దం చేస్తుంది. రక్త పింజర ఎక్కువగా రాత్రివేళల్లో వేటాడుతుంది. ఎలుకలు, చిన్న పక్షులు, బల్లులు ఇవి ప్రధాన ఆహారం. అందుకే పొలాల దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది. రైతులు, కూలీలు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సిన పాము ఇదే. ఈ పాము చాలా వేగంగా దాడి చేస్తుంది. కొన్నిసార్లు మనిషి స్పందించేలోపే కాటు వేసేస్తుంది. దాని దాడి వేగం కారణంగా పాము నిపుణులు కూడా దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు.

కాటు వేస్తే.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. పామును చంపడానికి ప్రయత్నించకూడదు. గాయంపై కోయడం, విషం పీల్చడం చేయకూడదు. బిగిగా తాడు కట్టకూడదు. బాధితుడిని ప్రశాంతంగా ఉంచాలి. యాంటీ వెనం చికిత్స ఎంత త్వరగా అందితే అంత మంచిది. ఎలుకలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు రస్సెల్స్ వైపర్ ఆకర్షితమవుతుంది. గోదాములు, పంట పొలాలు, ఎండిపోయిన గడ్డి కుప్పలు దగ్గర ఎక్కువ సంచరిస్తూ ఉ:టాయి. ఇది ప్రమాదకరమైన పామే అయినా.. వ్యవసాయానికి హాని చేసే ఎలుకల సంఖ్యను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే అడవి జీవ సంరక్షణలో దీనికీ ప్రత్యేక స్థానం ఉంది.

రక్త పింజర చాలా ప్రమాదకరమైన పాము. కానీ ఇది మనుషులపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయదు. భయపడినప్పుడు లేదా ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే కాటు వేస్తుంది. అందుకే గ్రామాలు, పొలాలు, అడవి ప్రాంతాల్లో నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటైన రక్త పింజర గురించి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ పాము గుడ్లు పెట్టదు. నేరుగా పిల్లలను కంటుంది. ఒకేసారి 20 నుంచి 60 వరకు పిల్లలు పుడతాయని పాము నిపుణులు చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పుట్టిన చిన్న పాముల్లో కూడా విషం ఉంటుంది. అందుకే చిన్న రస్సెల్స్ వైపర్ కూడా ప్రమాదకరంగానే భావిస్తారు.

గుడ్లను కాపాడేందుకు నెలన్నర పాటు గూడు నుంచి కదలదు.. అరుదైన సర్పం.. 

Follow Us