Rare Yellow Penguin: ఫోటోగ్రాఫర్‌కు ప్రకృతి అందించిన అరుదైన లాటరీ..! నెట్టింట్లో రింగులు కొడుతున్న ఎల్లో పెంగ్విన్..
ఈ వింతైన బుజ్జి పెంగ్విన్ సౌత్ జార్జియాలో కనిపించింది. దీన్ని వైవ్స్ ఆడమ్స్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. ఇక్కడి బీచ్‌లో 1.2లక్షల పెంగ్విన్లు ఉండగా.. ఇదొక్కటే ఇలా పసుపు రంగులో మెరిసిపోతూ..
Rare Yellow Penguin: పెంగ్విన్ పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది.. మంచు కొండలు.. అక్కడ గుప్పులు గుపులుగా ఉండే కొన్ని పక్షలు. పొట్టి కాళ్లతో, నలుపు తెలుపు రంగుతో నీళ్లలో ఈదుతూ ఉండే పక్షి మన కళ్ల ముందు కదలాడుతుంది. అయితే వీటిలో ఇప్పటి వరకూ లేని విధంగా కలర్‌ఫుల్‌గా ఉన్న ఓ పెంగ్విన్ కెమెరా కంటికి చిక్కింది.
ఈ వింతైన బుజ్జి పెంగ్విన్ సౌత్ జార్జియాలో కనిపించింది. దీన్ని వైవ్స్ ఆడమ్స్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. ఇక్కడి బీచ్‌లో 1.2లక్షల పెంగ్విన్లు ఉండగా.. ఇదొక్కటే ఇలా పసుపు రంగులో మెరిసిపోతూ కనిపించిందట. అచ్చం బంగారు వర్ణంలో అన్నింటిలో ప్రత్యేకంగా కనిపించిందట.. అది చూసిన ఫోటో గ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫోటోగ్రాఫర్ వైవ్స్ ఆడమ్ శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన జీవి యొక్క చిత్రాలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. ఆడమ్స్ అందమైన జీవిని గుర్తించిన తరువాత తాను ప్రకృతి లాటరీని గెలుచుకున్నానని సంబరపడిపోయాడు.
వైవ్స్ ఆడమ్స్ తన ఖాతాలో ఇలా రాసుకున్నాడు. ‘‘ నేను ప్రకృతి అందించే లాటరీని గెలుచుకున్నా.. అందమైన కింగ్ పెంగ్విన్‌ను చూడటం నా అదృష్టం! దక్షిణ-జార్జియా ద్వీపంలోని మారుమూల బీచ్‌లో దిగిన తర్వాత మా రబ్బరు పడవలను అన్ప్యాక్ చేరుకున్నాయి. ఈ లూసిస్టిక్ కింగ్ పెంగ్విన్ నేరుగా మా వైపుకు నడుచుకుంటూ వచ్చింది. నేను ఎంత అదృష్టవంతుడిని! అని ఆ కలర్‌ఫుల్ పెంగ్విన్ గురించి ఇలా ముగించాడు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి
Kamal Haasan Meets Rajinikanth: తలైవాతో ముగిసిన కమల్‌హాసన్ సమావేశం.. ఆ అంశంపైనే ప్రధాన చర్చ..