Plastic Pollution: పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు.. కూల్ డ్రింక్స్ నుంచే అధికం.. అదుపు కోసం చర్యలు మొదలు పెట్టిన ప్రభుత్వాలు
UK ప్రభుత్వం వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి అనేక చట్టాలను ప్రవేశపెట్టింది. అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. వీటిలో ఏప్రిల్ 2022లో ప్రవేశపెట్టబడిన ప్లాస్టిక్ పన్ను ప్రతిపాదన కూడా ఉంది.
Plastic Pollution: పర్యావరణానికి వ్యర్ధాలు పెద్ద సమస్యగా మారింది. మహాసముద్రాలు, నదుల నుండి.. చిన్న చెరువుల సహా చెత్తా చెదారంతో నిండిపోతున్నాయి. దీంతో పర్యావరణానికి భారీ నష్టం కలుగుతుంది. వ్యర్థాల ఉత్పత్తి, వ్యాప్తికి అనేక కారణాలున్నాయి. ఈ వ్యర్ధాలను ఎదుర్కోవడానికి ప్రకృతి ప్రేమికులు, ప్రభుత్వాలు అనేక తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు దక్కలేదు. విస్తృతంగా వ్యర్థాలు పర్యావరణంలో కలిసిపోతున్నాయి. వ్యర్థాలు చాలా రకాలుగా ఉన్నాయి. వీటిని గుర్తించడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో ఏ రకమైన వ్యర్థాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి .. ఏవి తక్కువ నష్టాన్ని కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా కష్టం. వ్యర్థాలను గుర్తించేందుకు వివిధ స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వేస్ట్ రికార్డ్ కీపింగ్ యాప్ కమ్యూనిటీ ఇంటరెస్ట్ కంపెనీ ‘ప్లానెట్ పెట్రోల్’ ప్రజల కోసం ఒక యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా వ్యర్థాలను రికార్డ్ చేసి.. అనంతరం ఆ వ్యర్ధాలను నాశనం చేయవచ్చు. 2020 సంవత్సరంలో UKలో 43,187 వ్యర్థ పదార్థాలను సేకరించి, ఆపై ఈ యాప్ ద్వారా వ్యర్థాల స్థానం, కంటెంట్, రకం మొదలైనవాటిని పరిశోధించామని పరిశోధకులు చెప్పారు. ఈ పరిశోధన గురించి పూర్తి సమాచారం ఇటీవల ‘జనరల్ ఆఫ్ హాజార్డస్ మెటీరియల్స్’లో ప్రచురించబడింది.
ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువ చెత్తలో 63.1 శాతం ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. అనంతరం లోహాలు (14.3 శాతం) ఆపై మిశ్రమాలు 11.6 శాతంగా ఉన్నాయి. పానీయాల సీసాలు, టోపీలు, స్ట్రాస్ సహా ఇతర పదార్థాలు 33.6 శాతం ఉన్నాయి. ఇక మెటల్ డబ్బాలు సర్వసాధారణం.
శాస్త్రవేత్తలు వ్యర్ధాలలో 16,751 బ్రాండ్ల వస్తువులను గుర్తించారు. వాటిలో 50 శాతం కేవలం పది బ్రాండ్లకు చెందినవి. ఈ 50 శాతంలో అత్యధికంగా 11.9 శాతం మెటీరియల్ కోకాకోలా కంపెనీకి చెందినవిగా కనుగొంది. రెండవ స్థానంలో ‘Enheuser-Busch InBev’ (7.6 శాతం), పెప్సికో (6.9 శాతం) నుండి ఉన్నాయి. ఇవి శీతల పానీయాల కంపెనీలో మొదటి టాప్ త్రీ బ్రాండ్లు.
పరిష్కారానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటే.. ఈ దశాబ్దంలో UK ప్రభుత్వం వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి అనేక చట్టాలను ప్రవేశపెట్టింది. అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. వీటిలో ఏప్రిల్ 2022లో ప్రవేశపెట్టబడిన ప్లాస్టిక్ పన్ను ప్రతిపాదన కూడా ఉంది. ఈ పన్ను కింద ప్లాస్టిక్‌లో వస్తువులను ప్యాకింగ్ చేస్తే దానికి పన్ను విధించబడుతుంది. దీంతో పాటు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది.
ఈ దశాబ్దంలో.. తమ పరిశోధనలో గుర్తించబడిన టాప్ 10 కంపెనీలు తమ వస్తువుల ప్యాకేజింగ్‌లో ఉపయోగించే పదార్థాలను మార్చడానికి కూడా ఒక ప్రణాళికపై పని చేస్తాయని యూకే ప్రభుత్వం పేర్కొంది.
రీసైక్లింగ్ ఆధారిత పరిష్కారాలు ఈ కార్పొరేట్, శాసన విధానాలపై విశ్లేషణ ఈ కంపెనీలు రీసైక్లింగ్ ఆధారిత పరిష్కారాలను ఇష్టపడతాయని నిర్ధారించింది. అయినప్పటికీ, వ్యర్థాలను ఎలా తగ్గించాలి.. ఈ పదార్థాలను తిరిగి ఉపయోగించేందుకు ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలనే విషయంపై తక్కువ శ్రద్ధ ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
కంపెనీల ప్రస్తుత విధానం ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించడంలో తక్కువ శ్రద్ధను ప్రతిబింబిస్తుందని తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం పలు కంపెనీ యజమానులు తమ ఉత్పత్తులను ప్రజలకు విక్రయించడం గురించి ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థాలను, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..