Viral News: దెయ్యం భయంతో వణికిపోతున్న ఆ గ్రామప్రజలు.. రాత్రిళ్లు వింత శబ్దాలు..
ఆ ఊరు పేరు చెబితేనే భయంతో వణికిపోతున్నారు. మెక్సికోలోని కోకోయేక్ అనే పట్టణంలో దెయ్యం తిరుగుతుందనే ప్రచారం మొదలైంది. ఆ ప్రాంతం పేరు చెబితేనే తెగ భయపడిపోతున్నారు అక్కడి ప్రజలు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.
దెయ్యాలు, ఆత్మల గురించి చిన్నప్పుడు ప్రతి ఒక్కరు వినే ఉంటారు. రాత్రిళ్లు దెయ్యాలు ఎక్కువగా తిరుగుతాయని.. మనుషుల ఆకారంలోనే ఉంటాయని పెద్దలు చెబుతుండేవారు. అల్లరి పిల్లలను కంట్రోల్ చేయడానికి దెయ్యాలు, ఆత్మల కథలను ఎక్కువగా చెప్పేవారు. ఇప్పటికీ పలు చోట్ల దెయ్యాలకు సంబంధించిన అలికిడి ఉందని వింటుంటాం. దెయ్యాలు, ఆత్మలు ఇప్పటికీ ఉన్నాయని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అంటుంటారు. అయితే ఈ ఆత్మల కథలు కేవలం మన దేశంలోనే కాదు..విదేశాల్లోనూ ఉన్నాయి. దెయ్యాలు మాత్రమే కాదు.. వాటికి ప్రత్యేకంగా ఊర్లే ఉన్నాయట. రాత్రివేళల్లో ఆ గ్రామాల్లో వింత శబ్దాలు వినిపిస్తాయని చెబుతున్నారు. రాత్రి మాత్రమే కాదు.. పగలు కూడా ఆ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు సాహసించరు. ఆ ఊరు పేరు చెబితేనే భయంతో వణికిపోతున్నారు. మెక్సికోలోని కోకోయేక్ అనే పట్టణంలో దెయ్యం తిరుగుతుందనే ప్రచారం మొదలైంది. ఆ ప్రాంతం పేరు చెబితేనే తెగ భయపడిపోతున్నారు అక్కడి ప్రజలు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.
మెక్సికోలోని కోకోయోక్ పట్టణంలో దెయ్యం తిరుగుతుందనే ప్రచారం మొదలైంది. రాత్రి పది తర్వాత ఆ ప్రాంతంలో వింత శబ్దాలు వస్తున్నాయని..అక్కడి వీధుల్లో ఆత్మలు తిరుగుతున్నాయని ప్రచారం కొనసాగుతుంది. దీంతో రాత్రి వేళల్లో బయటకు రావడంతో వణికిపోతున్నారు. ఈ పట్టణంలో ఎక్కువగా నహువా తెగకు చెందిన ప్రజలు ఉంటుంటారు. వారికి అతీంద్రియ శక్తులపైన, క్షుద్రప్రయోగాలపైన నమ్మకాలు ఎక్కువ. గత కొద్దిరోజులుగా రాత్రి వేళల్లో ఎక్కువగా వింత శబ్దాలు వినిపిస్తున్నాయని.. అక్కడి వీధుల్లో ఆత్మలు తిరుగుతున్నాయని ప్రచారం ఎక్కువ కావడంతో.. అక్కడి ప్రజలు తమ ఇళ్ల తలుపులకు శిలువ గుర్తులు కూడా వేయించుకున్నారట. అయినప్పటికీ ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. శిలువలు ప్రధానంగా బ్యూనస్ ఎయిర్స్ స్ట్రీట్‌లోని ఇళ్లపై కనిపించాయి. మెక్సికోలో కేవలం ఈ ఒక్క పట్టణం మాత్రమే కాదు.. చాలా నగరాల్లో ఈ దెయ్యం భయం ఉంది. శాన్ లూయిస్ పోటోసిలో ఉన్న ఓ చిన్న పట్టణం ఒకప్పుడు ప్రజలు, వెండి, బంగారు గనులతో నిండి ఉండేది. ఇప్పుడు నిర్మాణుష్యంగా మారింది.