AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: 170 రూపాయలకే గ్యాస్ సిలిండర్.. ఇవాళ అర్థరాత్రి వరకే ఛాన్స్.. పూర్తి వివరాలు మీకోసం..

Gas Cylinder Bumper Offer: దేశంలో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్‌..

Gas Cylinder: 170 రూపాయలకే గ్యాస్ సిలిండర్.. ఇవాళ అర్థరాత్రి వరకే ఛాన్స్.. పూర్తి వివరాలు మీకోసం..
Gas Cylinder
Shiva Prajapati
|

Updated on: Mar 31, 2021 | 1:32 PM

Share

Gas Cylinder Bumper Offer: దేశంలో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్‌ ధరూ. రూ.870(హైదరాబాద్‌లో) వరకు చేరుకుంది. ఈ ధరల నుంచి కస్టమర్లకు ఉపశమనం కలిగించేలా, తమవైపు ఆకర్షించేలా పలు ఆన్‌లైన్ యాప్స్ రకరకాల ఆఫర్లను, క్యాష్‌బ్యాక్ ప్రైజ్‌లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్స్ యాప్ పేటీఎం కూడా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రూ. 700 వరకు క్యాష్ బ్యాక్ అందుకునే అవకాశం కల్పించింది. అంటే.. మీరు గ్యాస్ సిలిండర్‌ను కేవలం 170 రూపాయలకు మాత్రమే పొందుతారనమాట. అయితే, ఈ ఆఫర్ ఇవాళ ఒక్క రోజు(మార్చి 31వ తేదీ.. అర్థరాత్రి 12 గంటల వరకు) మాత్రమే ఉంటుంది.

మీరు కూడా గ్యాస్‌పై క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పొందాలంటే ఇలా చేయండి.. ఈ ఆఫర్‌ను పొందడానికి ముందుగా మీరు మీ మొబైల్ ఫోన్‌లో పేటీఎం యాప్‌ ఉండాలి. ఒకవేళ లేనట్లయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా పేటీఎమ్లో ‘బుక్ ఏ సిలిండర్’ను ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్, ఇండేన్ గ్యాస్ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీరు ఏ కంపెనీ కస్టమర్ అయితే, ఆ గ్యాస్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత బుకింగ్ ప్రాసెస్‌ను కంప్లీట్ చేయాలి. వివరాలు నమోదు చేసిన తరువాత మీ గ్యాస్ బుకింగ్ కన్‌ఫర్మ్ అవుతుంది. అయితే, మీది మొదటి బుకింగ్ అయినట్లయితే రూ. 700 ల క్యాష్ బ్యాక్ ఆఫర్ మీకు లభిస్తుంది.

ఈ రాత్రి 12 వరకే ఛాన్స్.. పేటీఎం ఇస్తున్న ఈ ఆఫర్.. ఇవాళ రాత్రే ముగియనుంది. అంటే మార్చి 31, 2021 అర్థరాత్రి 12 గంటల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందన్నమాట. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను వినియోగదారులు ఒక్కసారి మాత్రమే పొందగలుగుతారు. కాగా, క్యాష్ బ్యాక్ క్లెయిమ్ చేయడానికి ముందుగా మీరు గ్యాస్ సిలిండర్‌కు అయ్యే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత మీకు స్క్రాచ్ కార్డు లభిస్తుంది. దాన్ని స్క్రాచ్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ స్క్రాచ్ కార్డును ఏడు రోజుల్లోగా ఓపెన్ చేయాలి. లేదంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ పని అయిపోయినట్లే.

భారీగా పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎల్‌పిజి సిలిండర్ల ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ .819 గా ఉంది. కోల్‌కతాలో రూ. 845, ముంబైలో రూ.819, చెన్నైలో రూ.835, బెంగళూరు రూ. 822, హైదరాబాద్ రూ .871.50 చొప్పున ధరలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో ఎల్‌పిజి ధరను మూడు రెట్లు పెంచారు. ఫిబ్రవరి 4వ తేదీన రూ.25, ఫిబ్రవరి 15వ తేదీన రూ.50, ఫిబ్రవరి 25వ తేదీన రూ.25 పెంచగా.. మార్చి 1వ తేదీన మళ్లీ రూ. 25 చొప్పున పెంచారు.

Also read:

బరువు తగ్గాలనుకునేవారు ఏ రైస్ తింటే మంచిదో తెలుసా ? వైట్, బ్రౌన్ రైస్‍కు పోటీగా క్వినోవా.. ఇంతకీ ఏది బెటరంటే..

Sensational Complaint: క్రైమ్ హిస్టరీ.. మిస్టరీ.. ఒక్కరిద్దరిని కాదు.. ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకున్నాడు

మీ విజయానికి అడ్డుగా వచ్చేవి కేవలం మీ లోపాలు మాత్రమే.. వాటిని గుర్తించడంలో ఆలస్యం చేయకూడదు… చాణక్యుడు..