రేషన్‌కు ఓటీపీ కష్టాలు, ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్న పేదలు, ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనతో ఉరుకుపరుగులు

రేషన్‌కు ఓటీపీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటీపీ కోసం కార్డు దారులు ఆధార్ కేంద్రాకు క్యూ కడుతున్నారు. రేషన్ కావాలంటే ఓటీపీ చెప్పాల్సిందేనంటూ.. ప్రభుత్వం కొత్త ..

రేషన్‌కు ఓటీపీ కష్టాలు, ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్న పేదలు, ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనతో ఉరుకుపరుగులు
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 04, 2021 | 5:04 AM

రేషన్‌కు ఓటీపీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటీపీ కోసం కార్డు దారులు ఆధార్ కేంద్రాకు క్యూ కడుతున్నారు. రేషన్ కావాలంటే ఓటీపీ చెప్పాల్సిందేనంటూ.. ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టడంతో. కార్డు దారులు మీ సేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఒకే సారి కేంద్రాలకు భారీగా జనం చేరుకోవడంతో.. ఒక్కొ కేంద్రంలో రోజుకు 50మందికి టోకెన్లు ఇచ్చి.. నిర్వహాకులు చేతులెత్తేస్తు్న్నారు. దీంతో రేషన్ పంపిణీ ప్రహసనంలా మారింది. నెలనెలా రేషన్ కంటే ఫోన్ రీచార్జ్ చేసుకునేందుకే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త విధానంపై మండి పడుతున్నారు. పేదల ఆకలి తిప్పలు తీర్చే రేషన్‌ బియ్యం పొందేందుకు కడుపుమాడ్చుకొని నిరీక్షించాల్సిన పరిస్ధితి నెలకొంది.

ఓటీపీ ద్వారా బియ్యాన్ని సరఫరా చేయాలని డీలర్లకు ఆదేశాలు అందడంతో.. అదే విధానంలో పంపిణి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని రేషన్ కార్డు దారుల్లో సుమారు లక్షా 20 వేల మంది కార్డు దారుల ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ కాలేదు. ఆధార్ తీసుకునే సమయంలో చాలా మందికి ఫోన్లు లేవు. ప్రస్తుతం అధికారులు హడావుడిగా ఆధార్ కు ఫోన్ నెంబర్లు లింక్ చేసుకోవాలని సూచిస్తుండంతో.. కార్డు దారులు ఆధార్ కేంద్రాలు- మీ సేవా కేంద్రాకు క్యూ కడుతున్నారు. ఓటీపీ వస్తేనే రేషన్ ఇస్తామని డీలర్లు చెబుతుండటంతో.. జనం పరేషన్ అవుతున్నారు. చాలామంది ఒంటరి వృద్ధులకు ఫోన్లు లేవు. అలాంటి వారికి ఐరిస్ ద్వార పంపిణి చేయాలని భావిస్తున్నా.. చాలా మంది దగ్గర ఐరిస్ యంత్రాలు సరిగా పనిచేయక నిరుపేదలు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. ఫలితంగా ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ తప్పని సరి చేశారు. పేదల ఆకలి తిప్పలు తీర్చే రేషన్ బియ్యం పొందేందుకు.. కూలీలు వదులుకుని పడిగాపులు కాస్తున్నారు. కూలీ వదులుకుని కడుపు మాడ్చుకుని నిరీక్షించినా.. రేషన్ వచ్చే పరిస్ధితి లేదని బాధితులు వాపోతున్నారు. పాత పద్దతిలో బియ్యం ఇవ్వాలని కోరుతున్నారు.

సందట్లో సడేమియాలా పేదల అవసరాన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేసేందుకు ఆధార్ కేంద్రాల నిర్వహాకులు అందినకాడికి దండుకుంటున్నారు. వాస్తవంగా ఒక్కొ నెంబర్ లింక్ కోసం 50 రూపాయలు తీసుకోవాల్సి ఉండగా.. 200 వరకు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రేషన్‌ సరకులు తీసుకోవడానికి కుటుంబసభ్యుల్లో ఒక్కరి ఆధార్‌కార్డుకు ఫోన్ నంబరు లింకై ఉంటే సరిపోతుంది. అదే నంబరు తీసుకుని రేషన్‌ దుకాణానికి వెళ్లి బియ్యం తీసుకోవచ్ఛు ఈ విషయం తెలియక చాలామంది రేషన్‌కార్డులో ఎంతమంది పేర్లు ఉంటే అందరూ కలిసి ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి క్యూ కడుతున్నారు. రేషన్ కార్డు దార్డులు మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు తరలివస్తున్నారు. ఒక్కొ కేంద్రంలో రోజుకు 60 కి మంచి అనుసంధానం కావడం లేదు. ఈ లెక్కన ప్రక్రియ పూర్తికావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందో అంతు చిక్కడం లేదు. బియ్యం కోసం అనేక అవస్ధలు పడాల్సి వస్తోందని కేంద్రాల సంఖ్య పెంచాలని కార్డు దారులు కోరుతున్నారు. రేషన్ కార్డు దారుల ఓటీపీ కష్టాలు తీర్చేందుకు అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

రామమందిర నిర్మాణానికి భరత్‌పూర్‌ బంధ్‌ బరేత అడవుల్లో పింక్‌ స్టోన్‌ మైనింగ్‌ చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

ఒక మహిళ రూ. 10 వేలతో వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ ఉంది. ఆమె మరెవరోకాదు, నీతా అడప్పా. ఒక బ్రాండ్

ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..