రామమందిర నిర్మాణానికి భరత్‌పూర్‌ బంధ్‌ బరేత అడవుల్లో పింక్‌ స్టోన్‌ మైనింగ్‌ చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

అయోధ్య రామమందిరానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా రామభక్తులు తమ ఉడతాభక్తిని చాటుకుంటున్నారు. చంద్రుడికో నూలుపోగు అన్నట్లు

రామమందిర నిర్మాణానికి భరత్‌పూర్‌ బంధ్‌ బరేత అడవుల్లో పింక్‌ స్టోన్‌ మైనింగ్‌ చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌
Follow us

|

Updated on: Feb 04, 2021 | 4:44 AM

అయోధ్య రామమందిరానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా రామభక్తులు తమ ఉడతాభక్తిని చాటుకుంటున్నారు. చంద్రుడికో నూలుపోగు అన్నట్లు ఎవరికి తోచినంత వారు రామాలయానికి విరాళమిస్తున్నారు. ప్రస్తుతం కంచి పీఠం నుంచి ఆరుకోట్ల రూపాయల విరాళం రామమందిర నిర్మాణానికి అందింది. కంచి పీఠానికి సంబంధించిన భక్తులు అంతా కలిసి ఈ విరాళాన్ని అందించిన సంగతి తెలిసిందే. కంచి కామకోటి పీఠంలో జరిగిన ఓ కార్యక్రమంలో 6 కోట్ల రూపాయల చెక్కును తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌కు అందజేశారు. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్రానికి విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. కంచికామకోటి పీఠం శంకరాచార్యులైన.. శంకర విజయేంద్ర సరస్వతి, ఉడుపులోని పెజావర్‌ మఠానికి చెందిన విశ్వప్రసన్న తీర్థ, పుణెలోని మహర్షి వేదవ్యాస ప్రతిష్టకు చెందిన మహారాజ్‌ గోవింద్‌ దేవ్‌ గిరిరాజ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదిలాఉంటే, రామమందిర నిర్మాణానికి కావలసిన గులాబీ నాపరాయి కోసం రాజస్థాన్‌ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. భరత్‌పూర్‌లో ఉన్న బంధ్‌ బరేత అడవుల్లో ఉన్న పింక్‌ స్టోన్‌ను మైనింగ్‌ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో మందిర నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న పింక్‌ శాండ్‌స్టోన్‌కు దేశవ్యాప్త డిమాండ్‌ ఉంది. ఎక్కడ మందిర నిర్మాణాలు ఉన్నా.. ఇక్కడ నాపరాయిని తీసుకెళ్తుంటారు. అయితే ఇటీవల జీవావరణ సమస్యలు రావడంతో.. మైనింగ్‌ ఆపేశారు. ఇప్పుడు రామమందిర నిర్మాణం కోసం మళ్లీ ప్రారంభించనున్నారు.

ఎక్కడికెళ్లాలన్నా భయం, కొమురంభీం ఆసిఫాబాద్‌తో పాటు, కరీంనగర్‌ జిల్లాలోనూ పంజా విసురుతున్న రక్తం రుచిమరిగిన పులులు

ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం రాజ్యమేలుతోంది: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలుగుదేశం ఎంపీల ఫిర్యాదు

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!