Farmers Protest: రైతు ఉద్యమం ఎఫెక్ట్.. కీలక ప్రకటన చేసిన ఢిల్లీ పోలీసులు.. వారి ఆచూకీ చెప్పిన వారికి రూ. లక్ష రివార్డ్..

Farmers Protest: భారత గణతంత్రి దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించి..

Farmers Protest: రైతు ఉద్యమం ఎఫెక్ట్.. కీలక ప్రకటన చేసిన ఢిల్లీ పోలీసులు.. వారి ఆచూకీ చెప్పిన వారికి రూ. లక్ష రివార్డ్..
Follow us

|

Updated on: Feb 04, 2021 | 4:41 AM

Farmers Protest: భారత గణతంత్రి దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. జనవరి 26వ తేదీన రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడానికి పంజాబ్ సింగర్ దీప్‌ సిద్ధూను బాధ్యుడిగా చేశారు ఢిల్లీ పోలీసులు. ఆ మేరకు దీప్ సిద్ధూ ఆచూకీ కోసం ప్రకటన విడుదల చేశారు. దీప్ సిద్ధూ ఆచూకీ చెప్పిన వారికి లక్షల రూపాయల బహుమతి ఇస్తామని పోలీసులు తమ ప్రకటలో తెలిపారు. ఇక ఎర్రకోటపై జెండాలు ఎగురవేసిన సిద్ధూ, గురుజ్యోత్ సింగ్, జుగరాజ్ సింగ్, గుర్జన్ సింగ్‌ల ఆచూకీ చెప్పిన వారికి రూ. లక్ష చొప్పున రివార్డు ఇస్తామని ప్రకటించారు. వీరితో పాటు.. జజ్బీర్ సింగ్, సుఖ్‌దేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్, బూటాసింగ్ ల ఆచూకి తెలిపిన వారికి రూ. 50 చొప్పున బహుమతి ఇస్తామని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జనవరి 26వ తేదీన రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీ అదుపుతప్పడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రైతులు ఎర్రకోటను ముట్టడించారు. ఆ సందర్భంగా పలువురు రైతులు ఎర్రకోటపై జాతీయ జెండాకు బదులుగా ఇతర జెండాలను ఎగురవేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వీడియో ఫుటేజీల ఆధారంగా హింసకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. అయితే, జనవరి 26న హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడానికి మూలకారణం సింగర్ దీప్ సిద్ధూ అని పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అతని ఆచూకీ చెప్పిన వారికి బహుమతి ఇస్తామంటూ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

Also read:

రాజ్యాంగ విధి, ధర్మాన్ని అనుసరిస్తున్నాను : ఎస్వీ యూనివర్సిటీలో మీడియాతో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

ఎక్కడికెళ్లాలన్నా భయం, కొమురంభీం ఆసిఫాబాద్‌తో పాటు, కరీంనగర్‌ జిల్లాలోనూ పంజా విసురుతున్న రక్తం రుచిమరిగిన పులులు

కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
హర హర మహాదేవ.. అమర్‌నాథ్ యాత్రకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. !
హర హర మహాదేవ.. అమర్‌నాథ్ యాత్రకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. !
డేరింగ్‌గా డార్లింగ్‌ హీరోయిన్లు.. ఏంచేస్తున్నారంటే.?
డేరింగ్‌గా డార్లింగ్‌ హీరోయిన్లు.. ఏంచేస్తున్నారంటే.?