ఒక మహిళ రూ. 10 వేలతో వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ ఉంది. ఆమె మరెవరోకాదు, నీతా అడప్పా. ఒక బ్రాండ్

ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, వ్యాపారంలోకి దిగి ఉన్నత శిఖరాలకు చేరాడు.. ఇలాంటి కథలు భారతదేశంలో చాలా ఉన్నాయి. వాస్తవానికి, ఇలాంటి..

ఒక మహిళ రూ. 10 వేలతో వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ ఉంది. ఆమె మరెవరోకాదు, నీతా అడప్పా. ఒక బ్రాండ్
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 04, 2021 | 2:35 AM

ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, వ్యాపారంలోకి దిగి ఉన్నత శిఖరాలకు చేరాడు.. ఇలాంటి కథలు భారతదేశంలో చాలా ఉన్నాయి. వాస్తవానికి, ఇలాంటి ఆలోచన చేయడమే అత్యంత కీలకమైనది, చాలా ముఖ్యమైనది. మీ వ్యాపార ఆలోచన సామాన్యమైనదే అయినా, ఆచరణ చాలా భిన్నంగా, ప్రజలను ప్రభావితం చేసేదిగా ఉండటమే ఇక్కడ ఇంపార్టెంట్. అలా అయితేనే విజయం మీకు మోకరిల్లుతుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే బెంగళూరు నివాసి అయిన నీతా అడప్పా.

నీతా అడప్పా తన ఉన్నత ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యాపారం చేయాలన్న ఆలోచన చేశారు. అనుకున్నదే తడవుగా ప్రణాళికాయుతంగా ముందుకు సాగారు. కేవలం పది అంటే పదివేల రూపాయలతో వ్యాపారం ప్రారంభించిన నీతా అడప్పా ఇవాళ కోట్ల టర్నోవర్ తో వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. నీతా ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువతి. ఆమె ఫాదర్ ఒక మూలికా ఉత్పత్తి తయారీ సంస్థలో సేల్స్ మేనేజర్. నీతా ముంబైలోని ఒక కళాశాల నుండి ఫార్మసీలో మాస్టర్స్ చేసింది.

ఆ తరువాత ఆమెకు మరింత చదువుకోవడానికి, లేదా విదేశాలకు వెళ్లడానికి, ఇంకా ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆమె మూడవ ఐచ్చికాన్ని ఎంచుకున్నారు. ఉద్యోగం చేయడం ప్రారంభించారు. అయితే, ఆ ఉద్యోగం ఆమెకున్న విజన్ ముందు వెలవెలబోయింది. 6 నెలల్లోనే ఉద్యోగానికి వీడ్కోలు చెప్పేసింది. అంతే, సొంత వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని రంగంలోకి దిగిపోయింది. ఇది 1995 నాటి సంగతి.

అప్పటి సామాజిక పరిస్థితుల్లో ఒక స్త్రీ వదిలి వ్యాపారం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఇవన్నీ లెక్కచేయక, నీతా అడప్పా విభిన్నమైన వ్యూహంతో పనిచేసింది. సరికొత్త ఎత్తులతో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని గాఢంగా నిర్ణయించుకుని ‘ప్రకృతి హెర్బల్స్’ అనే సంస్థను ప్రారంభించింది. ఆమె కాలేజ్ జూనియర్ అనిషా దేశాయ్ ఈ పనిలో ఆమెకు మద్దతు ఇచ్చింది. జుట్టు సంరక్షణ, చర్మ సౌందర్యానికి సంబంధించిన ఉత్పత్తులపై సుదీర్ఘ పరిశోధనల తరువాత వారిద్దరూ 10 వేల రూపాయలు పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు.

అప్పటికే, జుట్టు, చర్మ సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నీతా తన వ్యాపారాన్ని ఒక వినూత్నమైన పద్ధతితో ముందుకు తీసుకువెళ్లింది. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తుల తయారీ ప్రారంభించింది. ఈ క్రమంలో తనకున్న ఆర్థిక పరిమితులకు లోబడి మొదట హోటల్స్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది. బెంగళూరులోని ఒక చిన్న హోటల్ నుండి ఆర్డర్లు పొందడం ప్రారంభించింది. ఇలా మొదలైన ఆమె జర్నీ, ప్రస్తుతం అనేక ఫైవ్ స్టార్ హోటళ్లకు తన ఉత్పత్తులు విక్రయిస్తోంది.

ఇక, హోటల్ రంగంలో స్థిరమైన విజయాన్ని సాధించిన తర్వాత, ఆమె, 2011 లో రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఫేస్ స్క్రబ్స్, హెయిర్ మాస్క్, హెయిర్ ఆయిల్, షాంపూలు, కండీషనర్ ఉత్పత్తులను అమ్మడం కూడా ప్రారంభించారు. ఇవి రూ .180 నుండి 300 రూపాయల వరకు వివిధ ధరలలో లభిస్తాయి. ఆమె తన ఉత్పత్తుల్ని వెబ్‌సైట్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ పోర్టల్స్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఇప్పుడు ఆమె వ్యాపారం ఈ స్థాయికి చేరడానికి నీతా అడప్పా ధృఢ సంకల్పం, కృషి, విభిన్నమైన ఆలోచనలే. అందుకే అప్పటి 10 వేల రూపాయల పెట్టుబడితో మొదలై ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది… ఇదీ.. నీతా అడప్పా సక్సెస్ స్టోరీ.

యావత్ దేశానికే ఆదర్శప్రాయం: బాలికలలో విద్యను ప్రోత్సహించడం, బాల్య వివాహాల వంటి రుగ్మతలపై పోరాడటానికి పరుగులు

కరోనా మహమ్మారి ఫుణ్యమాని ఫైజర్ పంటపండుతోంది. ఈ ఏడాది కోవిడ్ వ్యాక్సిన్ అమ్మకం ద్వారా వచ్చే ధనరాశులెన్నో తెలుసా?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!