AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mosquitoes Bite: మనుషులను ఎక్కువగా ఆడ దోమలే కుడుతాయట.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

దోమల వల్ల వచ్చే తీవ్రమైన వ్యాధి అంటే మలేరియా దీని గురించి ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ప్రభుత్వాలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన తరచుగా పడుతుంటారు. ముఖ్యంగా దోమల వల్ల వచ్చే చికన్‌గన్యా, డెంగ్యూ, మలేరియా..

Mosquitoes Bite: మనుషులను ఎక్కువగా ఆడ దోమలే కుడుతాయట.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Mosquitoes Bite
Subhash Goud
|

Updated on: Apr 30, 2023 | 4:01 PM

Share

దోమల వల్ల వచ్చే తీవ్రమైన వ్యాధి అంటే మలేరియా దీని గురించి ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ప్రభుత్వాలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన తరచుగా పడుతుంటారు. ముఖ్యంగా దోమల వల్ల వచ్చే చికన్‌గన్యా, డెంగ్యూ, మలేరియా, జ్వరాలు వంటి వ్యాధుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రత్యేకించి పిల్లలు, శిశువులు ఎక్కువగా వ్యాధి బారిన పడుతున్నారు. ఎందుకంటే వారు బయట ఆడుకుంటారు. అంతేకాదు చిన్నారులు తమంతట తాముగా దోమల కాటు నుంచి తమని తాము రక్షించుకోలేరు. అందువల్ల.. వర్షాకాలంలో పిల్లల కోసం ఆట స్థలాన్ని ఎన్నుకునేటప్పుడు లేదా ఇండోర్ కేర్ తీసుకునేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.  అయితే ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. సరైన సమయంలో చికిత్స ప్రారంభించినట్లయితే, రోగి రెండు నుంచి ఐదు రోజులలో కోలుకుంటారు. భయంకరమైన జంతువు, పాముల కంటే దోమ చాలా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. దోమలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

  1. మూడు వేల రకాల దోమలు ఉన్నాయి. ఇవి ఇతర జీవుల కంటే ఎక్కువ వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. ఆడ దోమ ఒకేసారి 300 గుడ్లు పెడుతుంది. మగ దోమలు 10 రోజులు, ఆడ దోమలు ఎనిమిది వారాలు మాత్రమే జీవిస్తాయి.
  2. దోమలకు ఆరు కాళ్లు, నోటిలో 47 పళ్లు ఉంటాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇవి ఎక్కువగా ‘ఓ’ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని కాటు వేస్తాయి.
  3. మీరు బీర్‌ను ఇష్టపడితే, దోమలు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. దోమలు మీ శరీరం నుంచి ఒక సమయంలో 0.001 నుంచి 0.1 ml రక్తాన్ని పీల్చుకోగలవు.
  4. దోమల జ్ఞాపకశక్తి చాలా పదునైనదని కూడా పరిశోధనలో తేలింది. మీరు దోమను చంపడానికి ప్రయత్నిస్తే, అది రాబోయే 24 గంటల వరకు మీ చుట్టూ తిరగదు.
  5. ఇవి కూడా చదవండి
  6. మనుషులను మగ దోమలు కుట్టవు. ఆడ దోమలు కుడుతాయి. ఎందుకంటే దాని గుడ్ల అభివృద్ధికి ఆడ దోమకు ప్రోటీన్ అవసరం. ఇది మానవ రక్తం నుంచి పొందుతుంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి