Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Offer: ఈ ఒక్క కండీషన్‌కు ఒప్పుకుంటే చాలు కోట్ల ఆస్తికి వారసుడయ్యే ఛాన్స్.. మీరేమైనా ట్రై చేస్తారా?

కోట్ల రూపాయల ఆస్తి.. భారీ భవంతి.. ఆమె ఒక్కరే ఉండేవారు.. ఆమెకు వారసులెవరూ లేరు.. తోడుగా పిల్లిని, దాని పిల్లలను పెంచుకునేది. కానీ, ఇప్పుడు వృద్ధాప్యంతో ఆమె ఈ భూలోకాన్ని వీడింది. దాంతో ఆమె ఆస్తికి ఇప్పుడు వారసులు కావాల్సి ఉంది. అయితే, ఆమె ఆస్తి పొందాలంటే ఒక కండీషన్ ఉంది.

Super Offer: ఈ ఒక్క కండీషన్‌కు ఒప్పుకుంటే చాలు కోట్ల ఆస్తికి వారసుడయ్యే ఛాన్స్.. మీరేమైనా ట్రై చేస్తారా?
House
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 23, 2023 | 12:09 PM

కోట్ల రూపాయల ఆస్తి.. భారీ భవంతి.. ఆమె ఒక్కరే ఉండేవారు.. ఆమెకు వారసులెవరూ లేరు.. తోడుగా పిల్లిని, దాని పిల్లలను పెంచుకునేది. కానీ, ఇప్పుడు వృద్ధాప్యంతో ఆమె ఈ భూలోకాన్ని వీడింది. దాంతో ఆమె ఆస్తికి ఇప్పుడు వారసులు కావాల్సి ఉంది. అయితే, ఆమె ఆస్తి పొందాలంటే ఒక కండీషన్ ఉంది. ఆస్తిని పొందేవారు ఆ కండీషన్‌ను తప్పనిసరిగా నెరవేర్చాలి. అలా అయితేనే, వారు ఆ ఆస్తిని పొందుతారు. ఈ మేరకు ఆమె వీలునామా కూడా రాసింది. మరి ఆ షరతు ఏంటి? ఈ ఆస్తి ఎక్కడుంది? వివరాలు మీకోసం..

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నాన్సీ సాయర్ ఇటీవల చనిపోయారు. అయితే, ఆమెకంటూ ఎవరూ లేదు. ఆస్తి బాగానే ఉన్నప్పటికీ.. వారసులు మాత్రం లేరు. 2.5 మిలియన్ డాలర్ల విలువ చేసే భవనం. అంటే మన కరెన్సీలో రూ. 20 కోట్లు. కోట్ల రూపాయల విలువ చేసే ఇతర ఆస్తి ఉండిపోయింది. అయితే, ఈ ఆస్తి అంతా ఎవరికీ దక్కని పరిస్థితి నెలకొంది.

విచిత్ర రీతిలో వీలునామా..

నాన్సీ మరణం తరువాత అక్కడి ప్రభుత్వం ఇంటి వారసుల కోసం వెతికింది. ఆ క్రమంలో ఆమె మరణానికి ముందు రాసిపెట్టుకున్న వీలునామా వారికి లభించింది. ఈ ఆస్తిని ఎవరు తీసుకుంటారో వారు తన ఏడు పర్షియన్ పిల్లులను జాగ్రత్తగా చూసుకోవాలని వీలునామా రాసింది. క్లియోపాత్రా, గోల్డ్ ఫింగర్, లియో, మిడ్‌నైట్, నెపోలియన్, స్నోబాల్, స్క్వీకీ అనే పర్షియన్ పిల్లులను వాటీ జీవితాంతం విశాలమైన టంపా నివాసంలో ఉంచాలని వీలునామాలో మహిళ కోరింది. తాను ఒకవేళ చనిపోతే.. అవి చాలా ఇబ్బందులకు గురవుతాయని, అందుకే తన తదనంతరం ఆస్తిని దక్కించుకున్న వారు ఈ పిల్లుల బాగోగులు చూసుకోవాలని కోరింది.

ఇవి కూడా చదవండి

ఈ ఆస్తికి సంబంధించిన సమస్య ఏంటంటే.. ఇంట్లో పిల్లి ఉన్నంత కాలం ఎవరూ దానిని కొనని పరిస్థితి వచ్చింది. ఈ అంశంపై నాన్సీ స్నేహితురాలు యానా ఆల్బన్ మాట్లాడుతూ.. నాన్సీ తన పిల్లులను పరిమితికి మించి ప్రేమించిందని తెలిపింది. అందుకే వీలునామాలో తన పిల్లుల గురించి పేర్కొందన్నారు. హ్యూమన్ సొసైటీ ఆప్ టంపా బే ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ షెర్రీ సిల్క్ మాట్లాడుతూ.. నాన్సీ జీవించి ఉన్నంత కాలం తన పిల్లుల బాగోగుల కోసం చాలా డబ్బు చెల్లించందని తెలిపారు. తన మరణం తరువాత కూడా వాటి బాగోగుల కోసం ప్లాన్ చేసి వెళ్లిపోయారని అన్నారు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..