AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Massive Spider Web: ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో రోడ్డు.. చెట్టు..పుట్ట అన్నీ సాలెపురుగుల గూటి కిందే ఎక్కడంటే..

Massive Spider Web: సాలెపురుగు పెట్టె గూడు ఇంట్లో ఎక్కడో ఒక మూల చూస్తేనే అదోలా అనిపిస్తుంది. పాడుపడిన భవంతుల ప్రాంతంలో దట్టంగా ఉండే సాలె గూళ్ళను చూస్తే చికాకు పుడుతుంది.

Massive Spider Web: ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో రోడ్డు.. చెట్టు..పుట్ట అన్నీ సాలెపురుగుల గూటి కిందే ఎక్కడంటే..
Massive Spider Web
KVD Varma
|

Updated on: Jun 18, 2021 | 2:20 PM

Share

Massive Spider Web: సాలెపురుగు పెట్టె గూడు ఇంట్లో ఎక్కడో ఒక మూల చూస్తేనే అదోలా అనిపిస్తుంది. పాడుపడిన భవంతుల ప్రాంతంలో దట్టంగా ఉండే సాలె గూళ్ళను చూస్తే చికాకు పుడుతుంది. అటువంటిది ఎనిమిది కిలోమీటర్ల ప్రాంతంలో మొత్తం సాలెపురుగుల గూళ్ళు అల్లుకుపోతే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇటువంటి బీభత్సమే ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా లోని ఆగ్నేయ రాష్ట్రమైన విక్టోరియాలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఆ తరువాత అక్కడి పరిస్థితి విచిత్రంగా మారిపోయింది. లక్షలాది సాలెపురుగులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించేశాయి. రోడ్లు.. చెట్లు.. సైన్ బోర్డులు ఇలా మొత్తం ఆ ప్రాంతం పై ఓ పెద్ద గూడును అల్లేశాయి. భారీ ”గోసమార్” షీట్లను సృష్టించాయి. రాష్ట్రంలోని గిప్స్‌ల్యాండ్ ప్రాంతంలో, తీవ్రమైన వర్షపాతం ఉన్న రోజులు “బెలూనింగ్” అని పిలువబడే మనుగడ వ్యూహాన్ని ఉపయోగించి సాలెపురుగులు భూమిపైకి వెళ్ళే ప్రయత్నంలో ఇలా చేశాయి. లక్షలాది సాలీళ్ళు ఒకేసారి తమ గూడును అల్లే పట్టును వదలడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

అసలేం జరిగింది?

గతవారంలో విక్తోరియాలో అకస్మాత్తుగా బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురిశాయి. ఇవి ఆ ప్రాంతంలో భారీ ఆస్తి నష్టాన్ని కలిగించాయి. ఈ సమయంలో ఈ సాలె పురుగుల విన్యాసం ఏర్పడింది. భూమి పైన నివాసం ఉండే సాలెపురుగులు వర్షం నుంచి తప్పించుకోవడం కోసం భూమి నుంచి పైకి ఎక్కే ప్రయత్నం చేశాయి. దీనికోసం సమీపంలో ఉన్న చెట్లకు తమ సాలె పట్టును విసిరాయి. లక్షలాది పురుగులు ఇలా ఒకేసారి చేశాయి. ఎంతలా అంటే ఈ ప్రాంతంలో సేల్ నుంచి లంగ్ఫోర్డ్ పట్టణాల మధ్య ఉన్న 8 కిలోమీటర్ల దూరం పూర్తిగా ఈ సాలెపురుగుల పట్టు తో నిండిపోయింది. దీనిని ”గోసమర్” షీట్ అంటారు. గిప్స్ లాండ్స్ ప్రాంతంలో అయితే ఒక స్పైడర్ వెబ్ ఇటువంటి షీట్ ఒక రోడ్డు వెంబడి దాదాపు కిలో మీటరు దూరం ఈ షీట్ ఏర్పడింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

విక్టోరియా రాష్ట్రం సాధారణంగా శీతాకాలంలో ఇటువంటి పరిస్థితి తరచూ చూస్తుంది. ఇక్కడ ఆ సమయంలో వర్షం ఎక్కువగా వస్తుంది. ఇది జరిగినప్పుడు, ఈ సాలెపురుగులు, అనేక రకాలైన పట్టులను ఉత్పత్తి చేయగలవు. ఈ రకమైన వెబ్‌ను చాలా సన్నగా మరియు సున్నితమైనవిగా ఉత్పత్తి చేస్తాయి. ఇవి తేలికగా ఉండడంతో గాలితో దూరంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయి. ఎంత అంటే అవకాశం దొరికితే కొన్నిసార్లు 100 కి.మీ. దూరం కూడా ఈ సాలెపురుగు వెబ్ వెళ్ళిపోతుంది. ఈ బెలూనింగ్ పట్టు గాలి కంటే తేలికైనది. అందుకే, ఇది చెట్ల టాప్స్, పొడవైన గడ్డి, రహదారి చిహ్నాలు వంటి వస్తువులతో జతకూడతాయి. ఈ వెబ్ ద్వారా సాలెపురుగులు పైకి ఎక్కడానికి వీలు కలుగుతుంది.

గార్డియన్‌ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, అటువంటి వెబ్‌లను ఉంచే సాలెపురుగులను “అస్థిర వేటగాళ్ళు” అని పిలుస్తారు. ఇవి సాధారణంగా భూమిపై నివసిస్తాయి. ఇవి సాధారణ సాలేపురుగుల్లా వెబ్‌ను నిర్మించవు. వరదల తర్వాత బెలూన్ చేస్తున్నప్పుడు కూడా, ప్రతి సాలీడు ఒక థ్రెడ్‌ను మాత్రమే విసురుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో కనబడిన భారీ వెబ్ దుప్పటిలోని ప్రతి పంక్తి ఒక్కో క్రిమి తయారు చేసింది. ఈ లెక్కన చూస్తే అక్కడ మిలియన్ల సంఖ్యలో సాలెపురుగులు ఉన్నాయని అంచనా.

ఆస్ట్రేలియాలోని అరాక్నిడ్లు తరచుగా ఇంటర్నెట్ సంచలనాలుగా మారాయి. బెలూనింగ్ సాలెపురుగులు మానవులకు ప్రమాదకరం కావు. అయినప్పటికీ.. 2000 మరియు 2013 మధ్య, కొన్ని జాతుల స్పైడర్ కాటు కారణంగా దాదాపు 12,600 మంది ఆసుపత్రిలో చేరారు.

Also Read: Terrorism: ఉగ్రవాదుల వార్నింగ్ తో..ప్రజలకు పోలియో వ్యాక్సిన్ ఇవ్వలేని స్థితిలో పాకిస్తాన్!

Stanley Hotel: రాత్రి భూతాలు, దెయ్యాలు కోసం వెదికేందుకు అక్కడ హోటల్ కు క్యూ కడుతున్న టూరిస్టులు మోస్ట్ హంటెడ్ హోటల్ గా ఖ్యాతి