AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIRAL VIDEO : కేరళలో ఒక్కడే బావిని తవ్వేశాడు..! నెటిజన్లు అతడిని వన్ మ్యాన్ ఆర్మీ అని పిలుస్తున్నారు..

VIRAL VIDEO : హార్డ్ వర్క్ చేసేవారు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. అది కచ్చితంగా విజయతీరాలకు చేరుస్తుంది. కేరళలో

VIRAL VIDEO : కేరళలో ఒక్కడే బావిని తవ్వేశాడు..! నెటిజన్లు అతడిని వన్ మ్యాన్ ఆర్మీ అని పిలుస్తున్నారు..
Kerala Man Digs A Well
uppula Raju
|

Updated on: Jun 18, 2021 | 2:00 PM

Share

VIRAL VIDEO : హార్డ్ వర్క్ చేసేవారు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. అది కచ్చితంగా విజయతీరాలకు చేరుస్తుంది. కేరళలో ఓ వ్యక్తి ఒంటరిగా బావి తవ్విన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. అప్పటి నుంచి అతడు ఆన్‌లైన్‌లో ప్రశంసలు అందుకుంటున్నాడు. చాలామంది అతన్ని “వన్ మ్యాన్ ఆర్మీ” అని కూడా పిలుస్తున్నారు. ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన తర్వాత అతని వీడియో వైరల్ అయింది. ఈ వీడియో క్యాప్షన్‌తో పోస్ట్ చేయబడింది. “ఒక యువకుడు ఒంటరిగా బావిని తవ్వుతాడు ఇందులో మట్టిని ఎత్తడం, ఒక వైపు పడవేయడం అద్భుతమైన ప్రక్రియ అని క్యాప్షన్ పోస్ట్ చేశారు”

సగం తవ్విన బావి లోపల నిలబడి మరింత త్రవ్వటానికి ఒక స్పేడ్ ఉపయోగించి, పొడవైన తాడు, బకెట్ ఉపయోగించి ఈ ప్రక్రియలో అతను తవ్విన అదనపు మట్టిని బయట పడేయడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఈ వీడియో 11 కే వీక్షణలు, వందలాది లైకులు, కామెంట్స్‌ను సంపాదించింది. చాలా మంది వినియోగదారులు “అమేజింగ్ ఇంజనీరింగ్”, “చాలా బాగుంది.. అది చాలా ఆశ్చర్యంగా ఉంది, అతను చాలా కష్టపడి పనిచేస్తున్నాడు.. ఈ వ్యక్తి అక్కడ ఉన్న యువతీ యువకులందరికీ ప్రేరణ, ఆత్మీనిర్భర్ భారత్ ” అంటూ కామెంట్స్ చేశారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహించిన స్వావలంబన అని కొంతమంది పొగిడారు. ఏది ఏమైనప్పటికి అతడు ఒంటరిగా బావి తవ్వడం అనేది చాలా పెద్ద విషయం. మనిషి తలుచుకుంటే ఏదైనా చేస్తాడనే దానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

Jandhan Account : జన్‌ధన్ ఖాతా‌ను పొదుపు ఖాతాగా మార్చుకోవచ్చా..! జన్‌ధన్ వల్ల లాభమేంటి.. నష్టమేంటి..?

Fake 2K Currecy: 2 వేల నోటును కలర్ జిరాక్స్ తీసి తీసి చెలామణి చేస్తున్న యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Mud-puddling: మడ్‌ పడ్లింగ్ చేస్తోన్న సీతాకోక‌చిలుక‌లు.. దీన్ని చూడండి అచ్చం ఆకులాగే ఉంది..