AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage at 95: అవును వాళ్ళిద్దరూ ఒకటయ్యారు.. నమ్ముతారా..వారి వయసు జస్ట్ 95 ఏళ్లు అంతే..!

Marriage at 95: జీవితం చాలా చిన్నది. మనకు రాసిపెట్టి ఉన్నదే వందేళ్ళు. మరి ఈ వందేళ్ళూ మన ఇష్టం వచ్చినట్టు బ్రతికే అవకాశం మనలో ఎవరికీ దాదాపుగా ఉండదు. ఎక్కడో అక్కడ రాజీపడుతూ బ్రతకాల్సిందే.

Marriage at 95: అవును వాళ్ళిద్దరూ ఒకటయ్యారు.. నమ్ముతారా..వారి వయసు జస్ట్ 95 ఏళ్లు అంతే..!
Marriage At 95
KVD Varma
|

Updated on: Jun 09, 2021 | 2:22 PM

Share

Marriage at 95: జీవితం చాలా చిన్నది. మనకు రాసిపెట్టి ఉన్నదే వందేళ్ళు. మరి ఈ వందేళ్ళూ మన ఇష్టం వచ్చినట్టు బ్రతికే అవకాశం మనలో ఎవరికీ దాదాపుగా ఉండదు. ఎక్కడో అక్కడ రాజీపడుతూ బ్రతకాల్సిందే. ఇక మన జీవితానికి అది ఆడ అయినా మగ అయినా తోడు తప్పనిసరి. మనకి ఎవరో ఒకరు తోడు లేకుండా జీవిత పయనం సాగదు. అందుకే కదా ఈ వివాహ వ్యవస్థ. ఎదో శారీరక అవసరాల కోసం పుట్టిన వ్యవస్థ కాదది. కలకాలం ఒకరికి ఒకరు తోడుగా కష్టంలో.. సుఖంలో పెనవేసుకునే బంధంగా ఉండాలనేది దాని అర్ధం. మరి యుక్త వయసులోనే ఒకరికి ఒకరి తోడు అవసరం అవుతుందా? కానేకాదు. నిజానికి నిజమైన తోడు ఉండాల్సింది వయసు మళ్ళిన తరువాతే. కాకపొతే దురదృష్టవశాత్తూ చాలా మంది వృద్ధాప్యం దగ్గరకొచ్చేసరికి వారి సహచరులను కోల్పోయి ఒంటరి అయిపోతారు. ఇదిగో 95 ఏళ్ల వయసులో ఒంటరిగా మిగిలిన ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. వారెవరో.. ఎక్కడున్నారో.. తెలుసుకుందాం రండి..

జాయ్ మోరో నాల్టన్ (95) నిత్యం డైరీ రాస్తుంది. కాని న్యూయార్క్‌లో జాన్ షుల్ట్జ్ జూనియర్‌తో కలిసి ఆమె మొదటి భోజన తేదీని ఇప్పటికీ ఆమె గుర్తుంచుకోలేదు. అయితే, ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉన్నారు. మే 22 న వారిద్దరికీ వివాహం జరిగింది. ఆ పెద్ద వరుడు తన పుట్టినరోజును కూడా అదే రోజు జరుపుకున్నాడు. ఈ వయసులో పెళ్లి ఏమిటీ.. అని బుగ్గలు నొక్కుకునే వారికి ‘మాకు 5 సంవత్సరాలు మిగిలి ఉంటే, ఈ సమయాన్ని ఎందుకు కలిసి గడపకూడదు’ అని జాయ్ చెప్పిన సమాధానం ఆలోచింప చేసేదిగానే ఉంటుంది.

జాయ్ కొడుకు జాన్ మోరో, ‘ఇద్దరూ కలిసి అందంగా కనిపిస్తారు’ అని చెప్పడం అతని విశాల హృదయాన్ని ప్రదర్శిస్తుంది. జాయ్, షుల్ట్జ్ ఇద్దరూ మే 1926 లో జన్మించారు. 60 సంవత్సరాల వివాహం గడిపిన తరువాత, వారిద్దరూ సహచరులను కోల్పోయారు. ఇప్పటివరకూ ఇద్దరూ తమ ఇళ్లలో ఒంటరిగా నివసించారు. తాజాగా శ్రీమతిగా మారిన జాయ్ మోరో న్యూయార్క్‌లోని టిల్సన్‌లో నివసిస్తుండగా, ఆమె శ్రీవారు షుల్టెస్ సమీపంలోని హర్లీలో నివసిస్తున్నారు.

షుల్ట్జ్ 2020 లో ఒక వ్యవస్థాపకుడిగా పదవీ విరమణ చేశారు. జాయ్ ఇలా అంటారు “మేమిద్దరం ఒకరినొకరు చాలా కాలంగా తెలుసు. తరచూ బహిరంగ ప్రదేశాల్లో కలుసుకునేవాళ్ళం. జాన్ ఉల్లాసంగా ఉంటాడు అలాగే అతనికి ఇతరులను ఎలా ఆకట్టుకోవాలో తెలుసు.” అంటూ తన భర్త గురించి చెప్పారు.

మరోవైపు, షుల్ట్జ్, ”ఆమె చాలా అందమైనది, తెలివైనది. ఆమె హాస్య భావన అద్భుతమైనది. నేను వివాహం గురించి ఆమెతో మాట్లాడినప్పుడు, ఆమె నవ్వింది.” అంటూ మెరిసిపోతున్న కళ్ళతో జాయ్ గురించి చెప్పుకొచ్చారు. జాయ్, జాన్ షుల్ట్జ్ పునరేకీకరణతో వారి కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంది. మోరో ముగ్గురు మనవరాళ్ళు, ఐదుగురు మునుమనవళ్లను కలిగి ఉన్నారు. షుల్ట్జ్ కు 10 మంది మనవరాళ్ళు, ఐదుగురు మునుమనవళ్ళు ఉన్నారు.

ఆనందంగా బ్రతకాలి అనుకోవాలే కానీ, దానికి వయసు అడ్డంకి కాదు కదా. ఇటువంటి కథలు మనిషిలోని పాజితివిటీ పెంచుతాయి. జీవితం మరణించే వరకూ సాగుతూనే ఉంటుంది. దానిని ఎలా ఉంచాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది.

Also Read: World Record: రికార్డు బ్రేక్‌.. ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.. ఆశ్యర్యపోయిన వైద్యులు

Aliens Update: గ్రహాంతర వాసులు కాదు.. సముద్రగర్భ జీవులు! ఏలియన్స్ పై సరికొత్త షాకింగ్ విషయాలు!!