AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aliens Update: గ్రహాంతర వాసులు కాదు.. సముద్రగర్భ జీవులు! ఏలియన్స్ పై సరికొత్త షాకింగ్ విషయాలు!!

Aliens Update: ఈ విశ్వంలో మన లాంటి జీవులు ఎక్కడైనా ఉంటారా? అనేది ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోతోంది. విశ్వంలో మనలాంటి జీవుల గురించి మానవుల అన్వేషణ ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.

Aliens Update: గ్రహాంతర వాసులు కాదు.. సముద్రగర్భ జీవులు! ఏలియన్స్ పై సరికొత్త షాకింగ్ విషయాలు!!
Aliens
KVD Varma
|

Updated on: Jun 08, 2021 | 7:11 PM

Share

Aliens Update: ఈ విశ్వంలో మన లాంటి జీవులు ఎక్కడైనా ఉంటారా? అనేది ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోతోంది. విశ్వంలో మనలాంటి జీవుల గురించి మానవుల అన్వేషణ ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. విశ్వ రహస్యాలను చేదించుకుంటూ.. అంతరిక్షంలోకి రివ్వున ఎగిరిన మానవుడు.. మిగిలిన గ్రహాలను చుట్టేసి చూసి వచ్చే ప్రయత్నంలో ఎదిగిపోయాడు. పరిశోధనలు ఆ గ్రహాల చుట్టూ వేగంగా తిరుగుతున్నాయి. కానీ, ఎక్కడా ఇప్పటివరకూ మరో జీవరాశి జాడ కనిపించలేదు. ఈ లోపు ఎగిరే పళ్ళాలు అనీ.. ఎలియన్స్ అనీ ఎక్కడో ఒకచోట ఎదో హడావుడి కనిపిస్తోనే ఉంది. ఎలియన్స్ ఉన్నారంటూ ఇటీవలి కాలంలో అమెరికా పరిశోధకులు స్పష్టంగా చెప్పారు. దీంతో ఇప్పుడు ఎలియన్స్ అనబడే జీవుల గురించిన సమాచారం కోసం అందరూ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు ఎలియన్స్ కు సంబంధించి కొత్త విషయం తెలుస్తోంది. ఇంతవరకూ ఎలియన్స్ మన విశ్వంలోనే ఎక్కడో ఎదో గ్రహం మీద ఉంటారని భావిస్తూ వస్తున్న మనకి ఇది కొంత షాకింగ్ విషయంగానే కనిపిస్తోంది. ఎలియన్స్ ఉన్నారనీ.. అయితే, వాళ్ళు సముద్ర గర్భంలో ఉన్నారని కొత్త వాదన తెరమీదకు వచ్చింది.

ఈ వాదనలపై ఇంటర్నేషనల్ కోయిలేషన్ ఫర్ ఎక్సట్రా టెర్రస్ట్రీయల్ రీసెర్చ్ (ఐసీఈఆర్‌) ఉపాధ్యక్షుడు గేరీ హసెల్‌టినెవ్‌ వివరణ ఇచ్చారు. ఎలియన్స్ స్పేస్ నుంచి రావు.. సముద్ర గర్భం నుంచి వస్తాయని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. దీనికి ఆయన కొన్ని ఉదంతాలు ఉదాహరణగా చెబుతున్నారు. ఈయన చెబుతున్న దాని ప్రకారం ఎలియన్స్ సముద్ర గర్భంలోని పర్వత లోయలోని చీలికల్లో ఏలియన్స్ ఉండే అవకాశం అవకాశం ఉంది. అదేవిధంగా ఇవి మానవులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇప్పటివరకూ ఫ్లయింగ్ సాసర్లు సముద్రం పైనే ఎగురుతూ ఎక్కువగా కనిపించాయని చెబుతున్నారు. అంతేకాదు.. మనకు మన మధ్యలోనే ఉన్న సముద్రం గురించి 5 శాతం మాత్రమే తెలుసు. సుదూరంలో ఉన్న అంతరిక్షం గురించి ఎంతో తెలుసు. మన దృష్టి అంతా అంతరిక్షంపైనే ఉంది. కానీ, ఎలియన్స్ మాత్రం సముద్రగర్భంలోనే ఉన్నారు. అంటూ ఘంటాపధంగా టినేవ్ చెబుతున్నారు.

తన వాదన బలపరుచుకుంటూ ఈయన.. ఇప్పటికే యూఎస్‌ నేవీ యూఎఫ్‌ఓలకు సంబంధించిన 7 వీడియోలను విడుదల చేసింది. ఇవన్నీ సముద్రంపైన కనిపించినవే అంటూ ఉదాహరణ చెబుతున్నారు. “UFO లు తరచూ నీటిలో మరియు వెలుపల వస్తూ కనిపిస్తాయి కాబట్టి మన లోతైన మహాసముద్రాలు మరియు కందకాలలో మనకు గ్రహాంతర స్థావరాలు ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఇది వెర్రి అనిపిస్తుంది కాని మీరు దాని గురించి ఆలోచిస్తే మనకు 5 శాతం మహాసముద్రం మాత్రమే తెలుసు, మన స్వంత మహాసముద్రాల కంటే చంద్రుడు లేదా అంగారక గ్రహం యొక్క ఉపరితలం గురించి మనకు ఎక్కువ తెలుసు – అందువల్ల UFO లు క్రమం తప్పకుండా లోపలికి మరియు బయటికి రావడం నిజమే అనిపిస్తుంది నాకు. ” అని హసెల్‌టినెవ్‌ చెప్పారు.

ఇటీవల, 50 ఏళ్ల బ్రిటిష్ మహిళ తన జీవితంలో 52 కన్నా ఎక్కువ సార్లు గ్రహాంతరవాసులచే అపహరించబడిందని పేర్కొంది! మిర్రర్ యుకె ప్రకారం, పౌలా స్మిత్ తన మొదటి గ్రహాంతర అనుభవం 6 సంవత్సరాల వయసులో జరిగిందని, అప్పటి నుండి ఆమె 50 కన్నా ఎక్కువ సార్లు అపహరించబడిందని చెప్పారు. ఇవన్నీ నిజమో కాదో తెలీదు కానీ, ఇటీవలి కాలంలో మాత్రం ఎలియన్స్ పై ఎక్కువగా ప్రపంచం దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, ట్రంప్ ఎలియన్స్ ఉన్నాయనే పరిశోధనల్లో తేలిన విషయాన్ని పరోక్షంగా బయటపెట్టారు. అంతేకాదు..కొన్ని విషయాలను బయటపెట్టలేమంటూ ఈ సందర్భంగా వీరు వ్యాఖ్యానించాడమూ ఎలియన్స్ విషయంలో ప్రపంచానికి తెలియని ఎదో అంశం దీనిపై పరిశోధనలు చేస్తున్న 27 దేశాలకు తెలిసి ఉండవచ్చనే అనుమానాలు బలపరుస్తోంది.

ఇప్పడు కొత్తగా వచ్చిన సముద్రం నుంచే ఎలియన్స్ వస్తున్నాయనే వాదన కూడా నిజానికి దగ్గరగా ఉన్నట్టుగా పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. హసెల్‌టినెవ్‌ చెప్పినట్టు.. మనకు మన పక్కనే ఉన్న సముద్రం గురించి నిజంగానే ఏమీ తెలీదు. మొత్తమ్మీద ఈ కొత్త ఎలియన్స్ కి సంబంధించిన కథనాలు మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read: Electric Cycle: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 కి.మీ నడిచే ఎలక్రిక్ సైకిల్స్ లాంచ్.. సామాన్యులకు అందుబాటులో ధరలు

Stars Counted: ‘నాసా’ ప్రయోగం.. ఆకాశంలో చుక్కలు లెక్కించేందుకు విశ్వంలోకి రాకెట్‌.. ఎలా లెక్కిస్తుంది..?