AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stars Counted: ‘నాసా’ ప్రయోగం.. ఆకాశంలో చుక్కలు లెక్కించేందుకు విశ్వంలోకి రాకెట్‌.. ఎలా లెక్కిస్తుంది..?

Stars Counted: రాత్రి సమయాల్లో ఆకాశంలో చూస్తే చంద్రుడు, చుక్కలు కనిపిస్తుంటాయి. ఇక చంద్రుని విషయం అలా ఉంచితే.. మరి చుక్కల సంగతేంటి. కనుచూపుమేర చూస్తే..

Stars Counted: 'నాసా' ప్రయోగం.. ఆకాశంలో చుక్కలు లెక్కించేందుకు విశ్వంలోకి రాకెట్‌.. ఎలా లెక్కిస్తుంది..?
Subhash Goud
|

Updated on: Jun 07, 2021 | 8:07 PM

Share

Stars Counted: రాత్రి సమయాల్లో ఆకాశంలో చూస్తే చంద్రుడు, చుక్కలు కనిపిస్తుంటాయి. ఇక చంద్రుని విషయం అలా ఉంచితే.. మరి చుక్కల సంగతేంటి. కనుచూపుమేర చూస్తే ఆకాశంలో చుక్కలు కనిపిస్తూనే ఉంటాయి. అసలు చుక్కలు ఎన్ని ఉన్నాయి? అవి ఎంత దూరంలో ఉంటాయి అనే అనుమానాలు చాలా మందికే వస్తుంటుంది. అయితే దీనికి సరైన సమాధానం ఎవరి దగ్గరా లేదు. శాస్త్రవేత్తలు గతంలో ఒకసారి ఒక్కో గెలాక్సీలో 100 మిలియన్ల చుక్కలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరోసారి లెక్కించడానికి సిద్ధమవుతున్నారు శాస్త్రవేత్తలు. దాని కోసం ఓ రాకెట్‌ను కూడా స్పేస్‌లోకి పంపిస్తున్నారు. అసలు అదేంటి… ఎలా లెక్కిస్తుందో తెలుసుకుందాం..!

చుక్కలు లెక్కించేందుకు నాసా ప్రయోగం..

ఆకాశంలో చుక్కలు లెక్కించడానికి నాసాకి చెందిన ఓ రాకెట్‌ అమెరికాలోని న్యూ మెక్సికోలో త్వరలో బయలుదేరనుంది. వీటిని లెక్కించడానికి శాస్త్రవేత్తలు సిద్ధం చేసిన సైబర్‌ -2 అనే ఇన్‌స్ట్రుమెంట్‌ నింగిలోకి ప్రయాణించనుంది. గతంలోనూ నాసా ఇలాంటి ప్రయత్నం చేసింది. అప్పుడు లెక్కించిన దానికి అప్‌డేషన్‌ కోసం ఇప్పుడు మరోమారు ప్రయత్నం చేస్తోంది. గతంలో తీసిన లెక్కల ప్రకారం ఒక్కో గెలాక్సీలో 100 మిలియన్ల చుక్కలు ఉన్నాయి. నాసా ప్రకారం విశ్వంలో ఉన్న రెండు ట్రిలియన్‌ గెలాక్సీలు ఉన్నాయి. అంటే వంద క్వింటిలియన్ చుక్కలు ఉన్నట్లు.

అయితే గతంలో చుక్కల్ని లెక్కించినప్పుడు అవన్నీ గెలాక్సీలో ఉన్నట్లుగా భావించి ప్రక్రియ పూర్తి చేశారు. అయితే గెలాక్సీ బయట కూడా కొన్ని చుక్కలు ఉన్నాయని.. వాటి సంగతేంటి సైబర్‌ 2 ఇన్‌స్ట్రుమెంట్‌ లెక్కిస్తుందని చెబుతున్నారు. అయితే యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) మాత్రం పాలపుంతలో 100 వేల మిలియన్ల చుక్కలు ఉన్నాయని చెబుతోంది.

ఇక సైబర్‌ 2 గురించి.. ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ భూ వాతావరణం నుండి దాటగానే పని మొదలుపెడుతుంది. గెలాక్సీల క్లస్టర్లు ఉన్న ప్యాచ్‌ను సర్వే చేస్తుంది. సైబర్‌ 2 ఇన్‌స్ట్రుమెంట్‌ నేరుగా చుక్కలను లెక్కించదట. గెలాక్సీలోని ఎక్స్‌ట్రా గేలటిక్‌ బ్యాగ్రౌండ్‌ లైట్‌ను గుర్తిస్తుందట. అందులో చుక్కల నుండి వచ్చే కాస్మిక్‌ ఇన్‌ఫ్రారెడ్‌ బ్యాగ్రౌండ్‌పై సైబర్‌ 2 ఇన్‌స్ట్రుమెంట్ ‌ఫోకస్‌ చేస్తుందట. ఆ బ్యాగ్రౌండ్‌ లైట్‌ ఎంత బ్రైట్‌గా ఉందనేది గుర్తించి.. దాని ఆధారంగా అక్కడ ఎన్ని చుక్కలు ఉన్నాయనేది గుర్తిస్తారట.

ఇవీ కూడా చదవండి:

Moon Importance: ఆకాశంలో చంద్రుడు లేకపోతే భూమికి ఏమి జరుగుతుంది?.. ఆసక్తికర విశేషాలు మీకోసం..

Big Bang: విశ్వం పుట్టుక గురించి సరికొత్త విషయాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు