Electric Cycle: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 కి.మీ నడిచే ఎలక్రిక్ సైకిల్స్ లాంచ్.. సామాన్యులకు అందుబాటులో ధరలు
GoZero’s Electric Cycle: రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. కొంతమంది అయితే సొంత వాహనాలను పక్కన పెట్టి..
GoZero’s Electric Cycle: రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. కొంతమంది అయితే సొంత వాహనాలను పక్కన పెట్టి.. కొంతమంది బస్సులను ఆశ్రయిస్తున్నారు. మరొకొందరు ఎలక్రికల్ వాహనాలవైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు ఎలక్రికల్ కార్లు, మోటార్ సైకిల్స్ తో పాటు సైకిల్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా బ్రిటన్ చెందిన గో జీరో సంస్థ ఎలక్రికల్ సైకిల్స్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
గో జీరో సంస్థ భారత్ లో మూడు రకాల ఎలక్రిక్ సైకిల్స్ ను రిలీజ్ చేసింది. ఈ సైకిల్ బ్యాటరీలను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఛార్జ్ చేయడం చాలా సులభం. ఇక ఛార్జింగ్ కోసం తీసుకునే సమయం కూడా చాలా తక్కువ. అంతేకాదు ఈ సైకిల్స్ కు రిజిస్ట్రేషన్ వంటి ఈ ఎలక్రిక్ సైకిల్ కు అవసరం లేదు.
ఈ కంపీనీ మూడు సైకిల్స్ ను రిలీజ్ చేయగా.. వాటి ధరలు కూడా వివిధ రకాలుగా ఉన్నాయి.
స్కెల్లింగ్ రూ.19,999, స్కెల్లింగ్ లైట్ రూ.24,999, స్కెల్లింగ్ ప్రో రూ.34,999. ఈ సైకిళ్లను వాటర్ ప్రూఫ్ గా రూపొందించారు. దీంతో వర్షం తడిసిన ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక ఈ సైకిళ్లలో 250 వాట్ బీఎల్ డీసీ మోటర్ అమర్చారు. ఇది 32 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. 300 డబ్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ సెట్ చేశారు. ఈ సైకులను కావాలనుకునేవారు నవంబర్ వరకూ ఆగాల్సిందే.. ఎందుకంటే
నవంబర్ 8 నుంచి ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభిస్తామని సంస్థ ప్రకటించింది. నవంబర్ 25 నుంచి సైకిళ్ల డెలివరీ చేయనున్నారు. అమెజాన్ లో కూడా ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను అందుబాటులో ఉండనున్నాయి. ఈ సైకిళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ వెబ్‌సైట్ https://gozeromake.fit లో అందుబాటులో ఉంది.
Also Read: డిగ్రీ అర్హత ఉన్నవారికి మంచి అవకాశం మంచి వేతనంతో జాబ్ నోటిఫికేషన్..