AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiss Facts: ఎవరినైనా ముద్దుపెట్టుకుంటే ఎన్ని కండరాల్లో కదలిక వస్తుందో తెలుసా.. శరీరంలో జరిగే మార్పులపై సైన్స్ ఏమంటుందంటే..

Science behind Kiss: ముద్దును మీరు భావోద్వేగ చర్యగా పరిగణించవచ్చు. కానీ మీరు ముద్దు పెట్టుకున్నప్పుడు అది శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా...

Kiss Facts: ఎవరినైనా ముద్దుపెట్టుకుంటే ఎన్ని కండరాల్లో కదలిక వస్తుందో తెలుసా.. శరీరంలో జరిగే మార్పులపై సైన్స్ ఏమంటుందంటే..
Kiss
Sanjay Kasula
|

Updated on: Jun 12, 2023 | 1:33 PM

Share

ముద్దు అనేది ఎవరికైనా ప్రేమను వ్యక్తపరచడానికి సంకేతం. అది ప్రియురాలు-ప్రియుడి మధ్య అయినా.. తల్లి తన పిల్లలకు మధ్య అయినా. ముద్దు లేదా చుంబనం ఒక విధమైన ప్రేమను వ్యక్తం చేసే పద్ధతి. ముద్దు పెట్టుకునే వ్యక్తి తన రెండు పెదవులతో మరొకరి శరీరంలో వివిధ భాగాల్ని సున్నితంగా స్పృశిస్తారు. అయితే వివిధ సంస్కృతులలో అనురాగం, గౌరవం, స్వాగతం, వీడ్కోలు మొదలైన ఇతర భావాలతో కూడా ముద్దు పెట్టుకుంటారు. ఇలా చేసేటప్పుడు కొంచెం శబ్దం కూడా వస్తుంది. దీని ద్వారా ఇద్దరు వ్యక్తులు కనెక్ట్ అయ్యారని భావిస్తారు. మీరు దానితో మానసికంగా అనుబంధించబడడమే కాకుండా.. శరీరంలోని అనేక కండరాలు ఈ ప్రక్రియలో పాల్గొంటాయి. అందుకే ముద్దుల ఆట పెదవులకే పరిమితం కాదు. మెదడు నుంచి శరీరంలోని అనేక భాగాలను ఇందులో ఉపయోగించుకుని ఆ తర్వాత ముద్దులా సాగిస్తున్నారు.

యూనివర్శిటీ ఆఫ్ అల్బానీకి చెందిన సైకాలజీ వైద్యులు గోర్డాన్ గాలప్ అందించిన నివేదిక ప్రకారం, ముద్దులో ముఖం  అనేక కండరాలు ఉంటాయి. బలంగా కూడా మారుతాయి. ముద్దు ప్రక్రియలో 34 ముఖ కండరాలు, 112 భంగిమ కండరాలు ఉంటాయి. ఎవరైనా ముద్దు పెట్టుకుంటే అతని శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి.. శరీరం ఎలా స్పందిస్తుందో ఇప్పుడు సామాన్యులకు అర్థమవుతుంది. చాలా వృత్తాకార కండరాలు ఇందులో పాల్గొంటాయి.

పురుషుల కంటే మహిళలకు కిస్ టెస్ట్ చాలా ముఖ్యమైనదని కూడా ఆయన తన నివేదికలో వివరించారు. ముద్దుల సమయంలో వచ్చే వాసన కూడా చాలా ముఖ్యమని పెన్సిల్వేనియా యూనివర్సిటీ ఉద్యోగులు చెబుతున్నారు.

ముద్దుల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముద్దు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవాలని అనుకుంటే.. ముందుగా ఇది హైపర్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. యాంటీబాడీలను అభివృద్ధి చేస్తుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది కాకుండా, ముద్దు తర్వాత హ్యాపీ హార్మోన్లు కూడా విడుదలవుతాయి.  ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది. ఇది కాకుండా ముఖ కండరాలు గొప్పగా ప్రయోజనం పొందుతాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం