AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiring Story: ఈ లోకాన్ని వీడే అనాథ శవాలకు అన్నీ ఆమె.. కరోనాతో మొదలు పెట్టిన సేవ నేటికీ కొనసాగింపు

వర్షా వర్మ (44) ఈ ప్రపంచాన్ని వీడి వెళ్తున్న అనాథ శవాలకు అన్నీ తానై గౌరవప్రదంగా అంత్యక్రియలు  నిర్వహిస్తున్నారు. కరోనా తో మొదలు పెట్టిన శవ దహన కార్యక్రమాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.  కొన్ని వందల అనాథ శవాలకు వర్షా సాంప్రదాయంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. 

Inspiring Story: ఈ లోకాన్ని వీడే అనాథ శవాలకు అన్నీ ఆమె.. కరోనాతో మొదలు పెట్టిన సేవ నేటికీ కొనసాగింపు
Varsha Verma
Surya Kala
|

Updated on: Jun 12, 2023 | 1:52 PM

Share

మానవ జీవితం కరోనాకు ముందు.. కరోనా తర్వాత అని చెప్పవచ్చు.. ఎవరూ లేరు అనుకున్న సమయంలో నేనున్నానంటూ నిలబడిన కొందరు వ్యక్తులు మానవత్వం ఇంకా బతికే ఉందని సాటి చెప్పారు. అంతేకాదు కొందరు అప్పుడు మొదలు పెట్టిన సాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన రచయిత జూడో ప్లేయర్ అయిన వర్షా వర్మ. వర్షా వర్మ (44) ఈ ప్రపంచాన్ని వీడి వెళ్తున్న అనాథ శవాలకు అన్నీ తానై గౌరవప్రదంగా అంత్యక్రియలు  నిర్వహిస్తున్నారు. కరోనా తో మొదలు పెట్టిన శవ దహన కార్యక్రమాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.  కొన్ని వందల అనాథ శవాలకు వర్షా సాంప్రదాయంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

వర్ష స్నేహితుల్లో ఒకరు సమయంలో మరణించారు. అప్పుడు ఆ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరకు అతని మృతదేహాన్ని స్మశానానికి తరలించడానికి ఆసుపత్రిలో వాహనం దొరకడం కష్టమని చెప్పారు. కొందరు వాహన యజమానులు అధిక ఛార్జీలు వసూలు చేస్తుండడంతో వర్ష ఇది అమానుష ఘటన అని ఆలోచించారు. అప్పుడు తన స్నేహితుడి అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు తీసుకెళ్లడానికి కారును అద్దెకు తీసుకుని వెళ్ళింది. అలా మొదలు పెట్టిన శవ దహన కార్యక్రమాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. అప్పుడు ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించాలని ఆలోచించింది వర్ష.. ఆ సర్వీసుని నేటికీ కొనసాగిస్తోంది. పేదలను ఆసుపత్రులకు తరలించడం, అనాథ శవాలను స్మశానానికి తరలించడం ఈ అంబులెన్స్ పని.

కరోనాతో మొదలు పెట్టిన సామాజిక సేవను తన హబీగా మార్చుకున్న హర్ష “ఏక్‌ కోషిష్‌ అయిసీ భీ” అనే స్వచ్ఛందసంస్థను నడుపుతున్నారు. అనాథశవాలు మార్చురీకి వచ్చిన తర్వాత మూడు రోజులు అనంతరం ఆస్పత్రి సిబ్బంది వర్షకు చెబుతారు. అప్పుడు ఆ అనాథ మృతదేహాలకు దహన కార్యక్రమాలను జరిపిస్తారు. ఒక్క సంఘటనతో మొదలు పెట్టిన శవ దహన కార్యక్రమం ఇప్పడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. అదే కూడా ఈ సేవలన్నీ ఉచితంగానే అందిస్తోంది వర్ష. అంతేకాదు తనకు ఎప్పుడైనా డబ్బులకు ఇబ్బంది ఏర్పడితే.. ఆర్ధిక సాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తోంది. తనకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉంటారని వర్ష వర్మ చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..