AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాములకు ఇది లక్ష్మణరేఖ.. ఇంటి చుట్టూ చల్లితే చాలు.. ఎంతటి విషసర్పమైనా పరార్..!

పాములు ఇళ్లలోకి దూరకుండా చేసేందుకు ప్రజలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ సందు దొరికితే చాలు పాములు ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది.. అటువంటి పరిస్థితులలో పాములు మీ ఇంటి పరిసరాల్లోకి రాకుండా ఉంచే కెమికల్స్‌, స్ప్రేలు కొన్ని ఉన్నాయి. అవి పాముల పాలిట లక్ష్మణరేఖగా పనిచేస్తాయి. వాటిని ఉపయోగించినట్టయితే,

పాములకు ఇది లక్ష్మణరేఖ.. ఇంటి చుట్టూ చల్లితే చాలు.. ఎంతటి విషసర్పమైనా పరార్..!
Laxman Rekha For Snakes
Jyothi Gadda
|

Updated on: Jul 19, 2024 | 4:04 PM

Share

వర్షాకాలంలో పాములు, తేళ్లు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వరదల కారణంగా పాములు వెచ్చని ప్రదేశాలను వెతుక్కుంటూ జనావాసాల్లోకి చేరుతుంటాయి. షూ రాక్‌లు, కోళ్ల గూళ్లు, ఇంటి సందులు, బాత్‌రూమ్‌లలో దూరి నక్కి ఉంటాయి. ఇలా పాములు ఇళ్లలోకి దూరకుండా చేసేందుకు ప్రజలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ సందు దొరికితే చాలు పాములు ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది.. అటువంటి పరిస్థితులలో పాములు మీ ఇంటి పరిసరాల్లోకి రాకుండా ఉంచే కెమికల్స్‌, స్ప్రేలు కొన్ని ఉన్నాయి. అవి పాముల పాలిట లక్ష్మణరేఖగా పనిచేస్తాయి. వాటిని ఉపయోగించినట్టయితే, పాములు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటాయి.

వాస్తవానికి, వర్షాల సమయంలో, పాముల పుట్టలు, రంధ్రాలు నీటితో నిండిపోతాయి. దీని కారణంగా పాములు రక్షణ కోసం పరిగెడుతుంటాయి. పొడి ప్రదేశంలో దాక్కుంటారు. మీ ఇంటి చుట్టుపక్కల రంద్రాలు, చిదూ, పాములు దూరేందుకు అనుకూలంగా ఉండే ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు ఫినాయిల్‌ ద్రవాన్ని చల్లుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఇంట్లోని మూలలు, కోళ్లగూడు, పశువుల పాకలు, బాత్‌రూమ్‌ వంటి ప్రదేశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అప్పుడప్పుడు ఫినాయిల్‌ పిచికారీ చేస్తే పాములు ప్రవేశించవు. ఎందుకంటే, ఇందులో కార్బోలిక్ యాసిడ్ ఉంటుంది. దీని వాసన వల్ల పాములు, తేళ్లు, క్రిములు ఇంట్లోకి రావు. ఇంట్లోని స్టోర్ రూమ్, చెత్త ఏరియాని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇంటి చుట్టూ కార్బోలిక్ యాసిడ్ చల్లితే పాములు రావు.

మీరు బహిరంగ ప్రదేశంలో ఫినాయిల్‌ పిచికారీ చేస్తే, వర్షం పడినప్పుడు వర్షం నీటితో పాటు కొట్టుకుపోతుంది. అందువల్ల, మీరు మీ ఇంటి చుట్టూ ఒరిజినల్ కార్బోలిక్ యాసిడ్‌ను పిచికారీ చేయాలి. దాని ప్రభావం ఒక వారం పాటు ఉంటుంది. వాసన వస్తూనే ఉంటుంది. దీని కారణంగా పాము ఇంట్లోకి ప్రవేశించదు. వర్షాకాలంలో ప్రతి వారం ఈ పనిని చేస్తూ ఉండండి. ఇది మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

వందే భారత్ రైళ్లపై మరో కీలక అప్డేట్
వందే భారత్ రైళ్లపై మరో కీలక అప్డేట్
మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్
మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్
రైళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు ఇస్తారో తెలుసా..? ఆ రహస్యం..
రైళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు ఇస్తారో తెలుసా..? ఆ రహస్యం..
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?