హాస్యం.. ఒక నవ్వు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. ఒక నవ్వు ఆనందాన్ని పంచుతుంది..!

నవ్వడం ఒక 'భోగం'.. నవ్వించడం ఒక 'యోగం'.. నవ్వలేకపోవడం ఒక 'రోగం'.. అన్నారు హాస్య బ్రహ్మ జంధ్యాల. భాషతో పనిలేకుండా ప్రతి మనిషి పలకరింపు నవ్వు. అందుకే నవ్వు సార్వత్రిక భాషగా యూనివర్సల్‌గా భావిస్తుంటారు. నవ్వుతో ఆనందంతోపాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుంది.

హాస్యం.. ఒక నవ్వు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. ఒక నవ్వు ఆనందాన్ని పంచుతుంది..!
Laugh
Follow us

|

Updated on: Jul 18, 2024 | 10:11 AM

నవ్వడం ఒక ‘భోగం’.. నవ్వించడం ఒక ‘యోగం’.. నవ్వలేకపోవడం ఒక ‘రోగం’.. అన్నారు హాస్య బ్రహ్మ జంధ్యాల. భాషతో పనిలేకుండా ప్రతి మనిషి పలకరింపు నవ్వు. అందుకే నవ్వు సార్వత్రిక భాషగా యూనివర్సల్‌గా భావిస్తుంటారు. నవ్వుతో ఆనందంతోపాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుంది. నవ్వు ఒక మంచి అనుభూతినిస్తుంది. అలాగే నవ్వు ఆరోగ్యాన్ని మెరుగు పరిచే మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. నవ్వడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం కూడా.. ఒత్తిడి తగ్గించి, శారీరక, మానసిక బాధలకు ఉపశమనం కల్పిస్తుంది.

మనిషి జీవితంలో చాలా సమస్యలకు ఒక చిరునవ్వే సమాధానం చెబుతుంది. నవ్వడం ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు వైద్యులు. శరీరానికి మంచి వ్యాయామంలాంటదని సూచిస్తున్నారు మానసిక వైద్యులు. ప్రతిరోజు నవ్వే వ్యక్తులు ఉల్లాసంగా, ఉత్సాహగా ఉంటారంటున్నారు. ఒకప్పుడు నవ్వడం నాలుగు విధాలుగా చేటు అనేవారు.. కానీ ఇది నిజం కాదు. నవ్వు ఆక్సిజన్ అందించే అమృతం. మనస్ఫూర్తిగా నవ్వితే శరీరంలో ఉన్న రోగాలన్ని మటు మాయమవుతాయని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే చాలా మంది లాఫింగ్ థెరపీ పాటిస్తున్నారు. గుంపులు గుంపులుగా ఒకే చోట చేరి నవ్వుతూ, మానసికంగా ఉపశమనం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక దేశంలో ఏకంగా చట్టమే తీసుకువచ్చారు.

నవ్వాలంటూ ప్రత్యేక చట్టం

ప్రజల ఆరోగ్యం కోసం జపాన్‌ దేశంలో ప్రత్యేక చట్టం తీసుకువచ్చారు. ప్రతిరోజూ అందరూ నవ్వాలంటూ ప్రత్యేక చట్టం చేసింది ఆ దేశ సర్కార్. యమగట ప్రిఫెక్చర్‌ స్థానిక ప్రభుత్వం ప్రతిరోజూ అందరూ నవ్వాలంటూ చట్టం తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరిలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏకంగా ఆర్డినెన్స్‌ జారీ చేశారు అధికారులు. అలాగే అయా సంస్థు, కంపెనీలు నవ్వుల వాతావరణాన్ని ప్రోత్సహించాలని ఆదేశించింది. ఇందుకోసం ఏకంగా తేదీని సైతం ఖరారు చేసింది. ప్రతినెలా ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని అధికారులు సూచించారు.

శరీరానికి నవ్వు ఒక ఆక్సిజన్

నవ్వు మన జీవితంలో ఆనంద క్షణాలను తీసుకువస్తుంది. అలాగే ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నవ్వు మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు నవ్వు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నవ్వడం లేదా సంతోషంగా ఉండటం అనేది ఆరోగ్యానికి చికిత్స వంటిదే అంటారు వైద్య నిపుణులు. మనం టీవీలో కార్టూన్లు చూస్తూ, జోకులు చదివినా, ఫన్నీ యాక్టివిటీని చూసి, సరదా జోకులు వేసుకుంటూ నవ్వుతూనే ఉంటాం. నవ్వడం వల్ల ఒత్తిడిని తగ్గించి, కండరాలను 45 నిమిషాల పాటు రిలాక్స్ చేస్తుంది.

నవ్వుల దినోత్సవం చరిత్ర

నవ్వు అనేది ప్రపంచంలోనే ఉత్తమమైన దివ్యాఔషధంగా పరిగణించడం జరుగుతుంది. ఇది నిజమని వైద్య నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. వ్యక్తుల మధ్య కనెక్ట్ చేయడంతోపాటు వారి మధ్య సత్సంబంధాలను పెంపొందిస్తుంది. తాజాగా ఉల్లాసంగా ఉంచడమే కాకుండా, నవ్వు మానసిక సమస్యలకు మంచి విరుగుడుగా కూడా పనిచేస్తుంది. అసలు ప్రపంచవ్యాప్తంగా నవ్వుల చరిత్ర మొదలైందే మన భారత దేశం నుంచే..! ముంబైలో ఒక చిన్న సమూహంతో మొదలై ప్రపంచవ్యాప్తంగా 5,000 లాఫింగ్ క్లబ్‌లు ఏర్పడటానికి కారణమైంది. నవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు ఏకంగా ప్రపంచ నవ్వుల దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. 1998లో డాక్టర్ మదన్ కటారియా ప్రపంచవ్యాప్తంగా నవ్వు కూడా ఒక యోగా వంటిదే అంటూ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా మే మొదటి ఆదివారం రోజున ప్రపంచ నవ్వుల దినోత్సవం జరుపుకుంటారు. దీన్నే దాదాపు 70కి పైగా దేశాల్లో పాటిస్తున్నారు.

1995లో డాక్టర్ మదన్ లాఫ్టర్ యోగా ఉద్యమాన్ని ప్రారంభించారు. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల జనానికి అవగాహన కల్పిస్తున్నారు. మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల ముఖకవళికలు, భావోద్వేగాల వ్యక్తమవుతాయి. నవ్వు ద్వారా అందరం సమానం అనే భావనను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలన్నది డాక్టర్ మదన్ చేపట్టిన లాఫింగ్ యోగా ముఖ్య ఉద్ధేశ్యం. మొదటిసారి మన దేశానికి వెలుపల మొదటి నవ్వుల దినోత్సవం డెన్మార్క్‌లో జరిగింది. 2000 సంవత్సరం HAPPY-DEMIC పేరుతో కోపెన్హాగన్ లోని టౌన్ హాల్ స్క్వైర్ లో లాఫింగ్ యోగాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 10,000 మందికి పైగా ప్రజలు ఒకచోట చేరి నవ్వులు పూయించారు. అనంతరం నవ్వుల దినోత్సవం విశ్వవ్యాప్తం అయ్యింది. ప్రస్తుతం దాదాపు 70కి పైగా దేశాల్లో ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

లాఫ్టర్ క్లబ్‌లోకి స్టాండప్ కమెడియన్ల కామెడీ షోలు, కామెడి సినిమాలు కూడా వస్తాయి. స్టాండప్ కమెడియన్ గా టాలెంట్ పెంచుకునేందుకు అవసరమయ్యే క్లాసులు కూడా ఈ లాఫ్టర్ క్లబ్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా జోకులు పంచుకోడం, స్నేహితులతో కలిసి కామెడి సినిమాలు చూడవచ్చు. పార్కుల్లో సమావేశమై నవ్వుల యోగాభ్యాసం కూడా చేస్తుంటారు.

నవరసాలలో మనషి ఆరోగ్యాన్ని, సంతోషానిచ్చేది మాత్రం హాస్యరసమే. అలాంటి హాస్యం మన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు మానసిక నిపుణులు. చిన్నతనంలో ఏ కల్మషం లేకుండా ఎలాగైతే నవ్వుతుంటామో, పెరిగి పెద్దయ్యాక మనస్ఫూర్తిగా నవ్వుతుంటే మన ఆయుష్షు పెరుగుతుందంటున్నారు. నవ్వడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ, ముసిముసి నవ్వులు, నవ్వుల నుండి కాకిల్స్ వరకు, మనం నిత్యం చూసే సంఘటన వల్ల కూడా నవ్వుతాం. వాటిలో కొన్ని కొన్ని రకాల నవ్వుల గురించి తెలుసుకుందాం.

మర్యాద నవ్వు

మనం పెద్ద వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు, వాళ్ళు చెప్పే ప్రతిదానికీ నవ్వుతుంటారు. దీన్నే మర్యాద నవ్వు అంటారు. ఎదుటి వారు చెప్పి విషయం నచ్చకపోయినా, ఇతరులతో కలిసిపోవడానికి నవ్వుతూ ఉంటారు. కొత్త వ్యక్తులు కనిపించినప్పుడు పరిచయం కోసం ముఖంపై వచ్చే నవ్వే మర్యాద నవ్వు.

అంటు నవ్వు (అనుకరణ నవ్వు)

స్నేహితుల బృందంతో కలిసి ఉన్నప్పుడు ఎవరో ఒక జోక్ చెప్పి ఒక వ్యక్తిని నవ్విస్తారు. అది రెండో వ్యక్తిని నవ్విస్తుంది. ఇలా మొదలైన నవ్వు అక్కడున్న వారందరినీ నవ్వేలా చేస్తుంది. దీన్నే అంటు నవ్వు అంటారు. తోటి వారు నవ్వుతుంటారు కాబట్టి మనం కూడా నవ్వేస్తుంటాం. నలుగురితో కలిసి నవ్వడం వల్ల మనిషికి ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది.

నాడీ నవ్వు (నకిలీ నవ్వు)

ముఖ్య వ్యక్తులకు విషయాలు చెప్పాల్సిన సమయంలో లేదా విషాద సంఘటనల సమయంలో మనం గౌరవం పాటించాల్సి ఉంటుంది. మనకు మనం నియంత్రణను ప్రదర్శించాల్సిన సందర్భాలు ఉంటాయి. దురదృష్టవశాత్తూ, అదుపులేని నరాల నవ్వు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా నవ్వును లోపల దాచుకుని నవ్వడాన్నే నాడీ నవ్వు అంటారు. బయటకు కనిపించకుండా లోలోపల నవ్వుకోవడం అన్నమాట. ఇది ఆందోళన సమయంలో ఒత్తిడిని తగ్గించడానికి, ప్రశాంతంగా ఉండటానికి, ఉపచేతన ప్రయత్నంలో మనం తరచుగా నవ్వుతాం. అయితే ఇది సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలిగిస్తుంది. మన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తుంది.

బొడ్డు నవ్వు (కడుపుబ్బా నవ్వు)

బొడ్డు నవ్వు చాలా నిజాయితీ గల నవ్వుగా పరిగణిస్తారు. మనస్ఫూర్తిగా నవ్వుకోవడం. అనంద సమయాలను అనుభవించడానికి కష్టతరమైన రకం కూడా కావచ్చు. ఎందుకంటే మన పొట్టలు పట్టుకుని గాలి పీల్చుకునే నవ్వకోవడం. ఇలా నవ్వడం వల్ల మనిషికి ఉల్లాసంగా మారుతుంది. వారంలో ఒక్కసారైనా బిగ్గరగా నవ్వాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే గుండె సమస్యలు ఎక్కువగా వచ్చా అవకాశముందంటున్నారు. ఒకటి కంటే ఎక్కువసార్లు బిగ్గరగా నవ్వినవారికి గుండె సమస్యలు తక్కువగా వచ్చినట్టు, రోజూ బిగ్గరగా నవ్వేవారికి గుండె సమస్యలు పెద్దగా ఎదురుకాలేదని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. బిగ్గరగా నవ్వితే, శరీరంలోని నాడీలు, కండరాలు ఉత్తేజితమవుతాయి. రక్త ప్రసరణ చురుగ్గా సాగుతుంది. మానసిక-శారీరక ప్రశాంతత కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

నిశ్శబ్ద నవ్వు

మనలో ఓపెన్ ఆఫీస్ సెట్టింగ్‌లలో పనిచేసే వారు జోక్ ఏదైనా గుర్తుకు వచ్చినప్పుడు నిశ్శబ్దంగా నవ్వడం అనేది ఒక కళ. నిశ్శబ్ద నవ్వు వల్ల నిజమైన ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. ఎందుకంటే ఇది కడుపుబ్బా నవ్వుతో వచ్చే దానికంటే లోతైన ఆనందాన్ని అందించే నవ్వులా ఉంటుంది. సైలెంట్ నవ్వును నవ్వు యోగా, నవ్వు చికిత్సలో కూడా అభ్యసిస్తారు. ఇక్కడ దీనిని తరచుగా జోకర్స్ నవ్వు అని పిలుస్తారు. మీ స్వంతంగా ప్రయత్నించడానికి, జోకర్ ఆఫ్ బ్యాట్‌మ్యాన్ ఫేమ్ లాగా మీ ముఖాన్ని చిరునవ్వుతో స్తంభింపజేస్తుంది. ఆపై మీరు బిగ్గరగా నవ్వుతున్నట్లుగా గాలిని లోపలికి, బయటకి నెట్టే శ్వాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది.

ఒత్తిడిని తగ్గించే నవ్వు

ఒత్తిడి మానవ శరీరంలో ఉద్రిక్తతను పెంచుతుంది. దాంతో ఒక్కోసారి డిప్రెషన్‌లోకి వెళ్తుంటాం. ఒత్తిడి వల్ల డయాబెటీస్ నుండి గుండె జబ్బుల వరకూ, తలనొప్పి నుండి అల్జైమర్స్ వరకూ ఎన్నో వ్యాధులు దాడి చేసేందుకు రెడీగా ఉంటాయి. అలాగని ఉద్యోగానికి వెళ్ళకుండా ఉండలేం. బంధువులకి దూరం కాలేం. ఒత్తిడి కలిగించే పరిస్థితులకి దూరంగా ఉండడం సాధ్యపడదు. కాబట్టి ఒత్తిడికి మనం రెస్పాండ్ అయ్యే పద్ధతి మార్చుకోవాలి. అలాగే తరుచూ నవ్వుతూ ఆందోళనను తగ్గించుకోవచ్చు. మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. నవ్వొచ్చే టీవీ షో చూడడం కానీ, సరదాగా ఫ్రెండ్స్ తో సమయం గడపడం కానీ చేస్తే రిలాక్సేషన్ దొరుకుంది.

పావురం నవ్వు

పావురం నవ్వు అంటే నోరు తెరవకుండా ముఖ్యం మూసుకుని నవ్వడం. మీ పెదవులను మూసి ఉంచడం ద్వారా వచ్చే నవ్వు పావురం శబ్దాల వలె హమ్మింగ్ ధ్వని వినిపిస్తుంది. ఏదైనా అశ్చర్యకర ఘటన కళ్ళ ముందు జరిగినప్పుడు ఈ నవ్వు వస్తుంది. ఎదుటి వారు ఏమనుకుంటారో అనుకుని చేతులు నోటికి అడ్డుపెట్టుకుని నవ్వడం. ఇది మనస్సుకు ఎంతో సంతోషాన్ని ఉల్లాసాన్ని ఇస్తుందంటున్నా నిపుణులు.

గురకపెట్టే నవ్వు

మీరు నిశ్శబ్దంగా నవ్వినప్పుడు కొంత శబ్దం వచ్చే అవకాశం ఉంది. అందరిలో కనిపించకుండా నవ్వాలనుకున్నప్పుడు అనుకోకుండా కొన్ని శబ్ధాలు వస్తుంటాయి. దీన్నే గురక నవ్వుగా భావిస్తుంటారు. ఇది ఎక్కువగా ముక్కు మూసుకుని నవ్వడం వల్ల వస్తుంది. అయితే దాదాపు 25 శాతం మంది స్త్రీలలో, 33 శాతం మంది పురుషులలో ఈ లక్షణాలు ఉంటాయి.

డబ్బా నవ్వు

దీన్నే తయారుగా ఉన్న నవ్వు అంటారు. సాధారణంగా దీన్ని నిజమైన నవ్వుగా భావిస్తారు. ఇది కేవలం ఒక టెలివిజన్ షో, కామెడీ సినిమాలు చూస్తున్నప్పుడు వచ్చే నవ్వు. ఏదైనా దృశ్యాన్ని చూస్తూ నవ్వుకోవడం. ఒంటరిగా ఉన్నా, ఇతరులతో ఉన్నా తృప్తిగా నవ్వుకోవడం. ఇది శరీరానికి ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుందంటున్నారు నిపుణులు. మన భావోద్వేగాలను మార్చటానికి ఉపయోగపడతాయి. ఒక వ్యక్తి తన ఆనందాన్ని హృదయపూర్వకంగా వ్యక్తీకరించే అత్యంత నిజమైనది నవ్వు.

క్రూరమైన నవ్వు

క్రూరమైన నవ్వు అనేది సున్నితత్వమైనది. స్పృశించనిదిగా మనం భావించవచ్చు, కానీ ఇది చాలా కాలంగా సమాజంలో భాగంగా ఉంది. ఎదుటి వ్యక్తిని అవమానించేలా ఉంటుంది. మనం నవ్వడం వల్ల ఎదుటి వ్యక్తిని బాధ కలిగించేలా ఉంటుంది. ఒకరి కష్టాన్ని చూసి నవ్వుకోవటం. ఈ నవ్వు ఇతరులకు నష్టాన్ని కలిగించేలా ఉంటుంది.

ఆరోగ్యానికి చక్కటి మార్గం నవ్వు..

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, నవ్వు అనేది ఒత్తిడిని తగ్గించడానికి, ఆరోగ్యకరమైన మార్గం. వ్యాయామం చేసే సమయంలో నవ్వుతూ చేయడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గంచి, ఏకాగ్రతతో ఉంచడంలో సహాయపడుతుంది. గతంలో రాజులు తమ ఆస్థానంలో హాస్య కవులకు సైతం ప్రాధాన్యత ఇచ్చేశారు. అంతేందుకు ఇటీవల కాలంలో విడుదలవుతున్న సినిమాల్లో కామెడియన్ లేకుండా సీన్‌లు లేవంటే అతిశయోక్తి కాదు. మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల శరీరంలో స్ట్రెస్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. ఇది శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలకు మేలు చేస్తుంది. నవ్వడం వల్ల గుండెనున ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి మానసిక సమస్యలను దూరం చేస్తుంది. తద్వారా గుండె తోపాటు అనేక ఇతర వ్యాధుల నుండి కాపాడుతుంది. దీంతో ఉల్లాసంగా, యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు నవ్వడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు గుతెలుసుకుందాం.

నవ్వు చికిత్సః

నొప్పి, ఒత్తిడిని తగ్గించడానికి, ఒక వ్యక్తి శ్రేయస్సును మెరుగుపరచడానికి హాస్యాన్ని ఉపయోగించే ఒక రకమైన చికిత్స. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధిని ఎదుర్కోవడంలో ప్రజలకు సహాయపడటానికి ఇది ఉపయోగపడుతోంది. నవ్వు చికిత్సలో నవ్వు వ్యాయామాలు, కామెడియన్లు, హాస్య చిత్రాలు, పుస్తకాలు, ఆటలు, పజిల్స్ ఉండవచ్చు. ఇది ఒక రకమైన కాంప్లిమెంటరీ థెరపీ. హ్యూమర్ థెరపీ అని కూడా అంటారు.

నవ్వు చికిత్స ప్రయోజనాలుః

* నవ్వు కూడా వ్యాధులపై పోరాడే శక్తిని పెంచుతుందంటున్నారు వైద్య నిపుణులు * శరీరంలో శ్వాస సంబంధిత వ్యాయామం చేయడానికి నవ్వు చాలా అవసరమంటున్నారు నిపుణులు. *నవ్వినప్పుడు, ఊపిరితిత్తులలో ఆక్సిజన్ తీసుకోవడం పెరుగుతుంది. ఊపిరితిత్తులు మెరుగ్గా పని చేస్తాయి. * నవ్వడం వల్ల మన శరీరానికి ఆక్సిజన్‌ను అందిస్తుంది. 108 కండరాలు రిలాక్స్ అవుతాయి. * నవ్వడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. రోజంతా మనల్ని యాక్టివ్‌గా ఉంచుతుంది. * నవ్వని వారితో పోలిస్తే నవ్వే వారు ఉత్సాహంగా ఉంటారని నిపుణుల చెబుతున్నారు. * ఎప్పుడూ బహిరంగంగా నవ్వడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. * నవ్వడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. * నవ్వు శరీరం యాంటీవైరల్, ఇన్ఫెక్షన్-నిరోధక కణాలను పెంచుతుంది. * లాఫింగ్ థెరపీ వల్ల నొప్పిని తగ్గించవచ్చు. 10 నిమిషాల పాటు చిరునవ్వుతో ఉంటే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. * నవ్వడం ద్వారా శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేసి మానసిక స్థితిని రిఫ్రెష్ చేస్తుంది. * సామాజిక సంబంధాలు బలపడతాయి. జీవితంలో సమతుల్యతను కల్పిస్తుంది. * గట్టిగా నవ్వే వారిలో బీపీ అదుపులో ఉంటుంది. * ప్రతిరోజు 15 నిమిషాలు నవ్వితే సుమారు 40 కేలరీలు కరిగిపోతాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించినవి మాత్రమే. పేక్షకులకు సమాచారాన్ని, అవగాహన కల్పించేందుకు ఇక్కడ యథావిధిగా అందించాం. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..
అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..
కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!
కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!
సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..
సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..
కృష్ణదాస్ కీర్తనలకు డాన్స్ చేస్తూ సందడి చేసిన కింగ్ కోహ్లీ అనుష్క
కృష్ణదాస్ కీర్తనలకు డాన్స్ చేస్తూ సందడి చేసిన కింగ్ కోహ్లీ అనుష్క
కల్కి Vs యానిమల్ నాగి షాకింగ్ ట్వీట్ | బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.
కల్కి Vs యానిమల్ నాగి షాకింగ్ ట్వీట్ | బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష