సృష్టిలో చిత్రం అంటే ఇదే.. 3 అడుగుల వ్యక్తికి 7 అడుగుల పొడవైన ప్రేమికురాలు.. డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్

కొంతమంది మాత్రం, పొడవు, పొట్టి, నలుపు తెలుపు ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎన్నుకుంటారు. అలాంటి ఓ జంట ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఎందుకంటే ఓ వ్యక్తీ కేవలం మూడు అడుగులు మాత్రమే ఉన్నాడు. అతని ప్రేమికురాలు అతనికంటే రెంట్టింపు ఎత్తు ఉంది. తన గర్ల్ ఫ్రెండ్ ను చూసి తాను చాలా సంతోషంగా ఉన్నానని చెబుతున్నాడు.

సృష్టిలో చిత్రం అంటే ఇదే.. 3 అడుగుల వ్యక్తికి 7 అడుగుల పొడవైన ప్రేమికురాలు.. డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్
Unique Love
Follow us
Surya Kala

|

Updated on: Jul 19, 2024 | 1:10 PM

భగవంతుని సృష్టి చాలా విచిత్రమైనది. దానిని అర్థం చేసుకునే శక్తి మానవులకు లేదు. కొంతమంది ఊహించిన దానికంటే పొడవుగా ఎదగడం. మరి కొందరు చిన్నపిల్లల వలె చాలా పొట్టిగా ఉండటం మీరు గమనించాలి. ఇప్పుడు అలాంటి వ్యక్తులు తమకు నచ్చిన జీవిత భాగస్వామిని వెతకడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం, పొడవు, పొట్టి, నలుపు తెలుపు ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎన్నుకుంటారు. అలాంటి ఓ జంట ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఎందుకంటే ఓ వ్యక్తీ కేవలం మూడు అడుగులు మాత్రమే ఉన్నాడు. అతని ప్రేమికురాలు అతనికంటే రెంట్టింపు ఎత్తు ఉంది. తన గర్ల్ ఫ్రెండ్ ను చూసి తాను చాలా సంతోషంగా ఉన్నానని చెబుతున్నాడు.

ఈ వ్యక్తి పేరు గాబ్రియేల్ పిమెంటల్. సోషల్ మీడియాలో అతనిని ‘కింగ్’ అని పిలుస్తారు. అతని స్నేహితురాలు పేరు మేరీ టెమరా. ఈ అపురూప జంట సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కింగ్ తరచుగా సోషల్ మీడియాలో మేరీతో తన సంబంధాన్ని తెలియజేస్తూ రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. అతను మేరీని ‘క్వీన్’ అని పిలుస్తాడు. ఈ జంట ఎత్తులో చాలా తేడా ఉండొచ్చు . వీరిని చూస్తుంటే మాత్రం వీరి రిలేషన్ షిప్ లో తేడా ఉన్నట్లు అనిపించదు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో గాబ్రియేల్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

View this post on Instagram

A post shared by Gabriel Pimentel (@gpwiz)

ఈ వీడియో gpwiz అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 3 మిలియన్ల (30 లక్షల కంటే ఎక్కువ) వ్యూస్ ను సొంతం చేసుకుంది. అదే సమయంలో ఈ జంటకి చెందిన వీడియోకు 40 వేల మందికి పైగా లైక్ చేసారు. వివిధ రకాల రియాక్షన్‌లను కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

డబ్బు కోసం అమ్మాయి గాబ్రియేల్‌తో సంబంధం పెట్టుకుందని కొందరు కామెంట్ చేస్తుండగా… మరికొంత మంది గాబ్రియేల్‌ను అదృష్టవంతుడిగా అభివర్ణించారు. అదే సమయంలో, కొంతమంది వినియోగదారులు గాబ్రియేల్‌ను ‘మినీ విన్ డీజిల్’ అని పిలుస్తున్నారు. ఎందుకంటే అతని రూపం కొంతవరకు హాలీవుడ్ నటుడు విన్ డీజిల్‌ను పోలి ఉంటుంది. అయితే కొంతమంది నెటిజన్లు గాబ్రియేల్, మేరీ మధ్య ప్రేమ ఉందని.. వీరిద్దరూ సంబంధంలో ఉన్నారంటే నమ్మరు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!