Chicken Soup recipe: మీరు నాన్ వెజ్ ప్రియులా.. ఈ సీజన్ లో వేడి వేడిగా చికెన్ సూప్ ని ట్రై చేయండి.. రెసిపీ మీ కోసం..

చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఏదైనా తినాలని కోరుకునే వారు కూడా ఎక్కువగానే ఉంటారు. బజ్జీలు, పకోడీలు, మొక్క జొన్న తో పాటు వివిధ రకాల సూప్ లను కూడా తాగుతారు. నాన్ వెజ్ ప్రియులు అయితే చికెన్ సూప్ ని ఇష్టపడతారు. ఇది శరీరానికి శ‌క్తిని, పోష‌ణ‌ అందిస్తుంది. ఈ సీజ‌న్‌లో చికెన్ సూప్ తాగడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇంట్లోనే చాలా ఈజీ చికెన్ సూప్ ను త‌యారు చేసుకోవచ్చు. ఈ రోజు చికెన్ సూప్ రెసిపీ గురించి తెలుసుకుందాం.

Chicken Soup recipe: మీరు నాన్ వెజ్ ప్రియులా.. ఈ సీజన్ లో వేడి వేడిగా చికెన్ సూప్ ని ట్రై చేయండి.. రెసిపీ మీ కోసం..
Chicken Soup
Follow us
Surya Kala

|

Updated on: Jul 19, 2024 | 12:00 PM

వర్షాకాలం వచ్చిందంటే చాలు పచ్చదనంతో నిండిన ప్రకృతి కనులకు విందు చేస్తే .. మేమున్నామంటూ సీజనల్ వ్యాధులు తీవ్ర ఇబ్బందులను కలగజేస్తాయి. ఎప్పుడు కురుస్తుందో తెలియని వానలో తడవడంతో జలుబు, దగ్గు బారిన తరచుగా పడుతూ ఉంటారు. అంతేకాదు రోగ నిరోధ‌క శ‌క్తి తగ్గడంతో జ్వరం వంటి సమస్యలు వస్తాయి. కనుక ఈ సీజన్ లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఇక చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఏదైనా తినాలని కోరుకునే వారు కూడా ఎక్కువగానే ఉంటారు. బజ్జీలు, పకోడీలు, మొక్క జొన్న తో పాటు వివిధ రకాల సూప్ లను కూడా తాగుతారు. నాన్ వెజ్ ప్రియులు అయితే చికెన్ సూప్ ని ఇష్టపడతారు. ఇది శరీరానికి శ‌క్తిని, పోష‌ణ‌ అందిస్తుంది. ఈ సీజ‌న్‌లో చికెన్ సూప్ తాగడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇంట్లోనే చాలా ఈజీ చికెన్ సూప్ ను త‌యారు చేసుకోవచ్చు. ఈ రోజు చికెన్ సూప్ రెసిపీ గురించి తెలుసుకుందాం.

త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు

  1. బోన్‌లెస్ చికెన్ – పావుకిలో
  2. మిరియాల పొడి – చిటికెడు
  3. వెల్లుల్లి రెబ్బలు – చిన్నగా కట్ చేసిన ముక్కలు
  4. పచ్చి మిర్చి – చిన్నగా కట్ చేసిన ముక్కలు
  5. కార్న్ ప్లోర్ – ఒక టీ స్పూన్
  6. ఉల్లికాడలు – చిన్న కట్ చేసిన ముక్కలు
  7. క్యారెట్ – చిన్నగా కట్ చేసిన లేదా కోరుకున్న క్యారెట్
  8. పాల కూర – చిన్నగా కట్ చేసిన ముక్కలు ఒక కప్పు
  9. బీన్స్ – చిన్నగా కట్ చేసిన ముక్కలు
  10. పంచదార లేదా పటిక బెల్లం పొడి- 1 టీస్పూన్
  11. నూనె – ఒక టీస్పూన్
  12. ఉప్పు – రుచికి సరిపడా
  13. కొత్తిమీర తరుగు కొంచెం

చికెన్ సూప్ తయారీ విధానం: ముందుగా బోన్ లెస్ చికెన్ ను తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గిన్నె వేసుకోవాలి. తర్వాత చికెన్ మునిగేలా నీరు పోసి.. ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి చికెన్ ముక్కలను బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద బాణలి లేదా మందపాటి గిన్నెను పెట్టి వెలిగించి నూనె వెయ్యాలి. నూనే వేడి ఎక్కిన తర్వాత పచ్చి మిర్చి తరగు, క్యారెట్, బీన్స్, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత అందులో ఉడికించి పక్కకు పెట్టుకున్న చికెన్ ను వేసి చికెన్ లోని నీరుని కూడా పోయాలి. ఇప్పుడు కొంచెం పంచదార, ఉల్లి కాడల ముక్కలు, పాలకూర తరుగు, మిరియాల పొడి.. ఉండలు కట్టడాకుండా కార్న్ ఫ్లోర్‌ వేసి చికెన్ సహా నీటిని బాగా కలపాలి. ఇపుడు 15 నిమిషాల నుంచి 18 నిమిషాల సేపు ఉడికించాలి.  తర్వాత కట్ చేసిన కొత్తిమీరను వేయలి.  అంతే వర్షాకాలంలో వేడినిచ్చే చికెన్ సూప్ రెడీ. వేడివేడిగా తాగడం వలన ఆరోగ్య ప్రయోజన్లు ఎన్నో అందిస్తుంది చికెన్ సూప్.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌