Job Astrology: 5 గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారి ఉద్యోగ జీవితంలో భారీ మార్పులు పక్కా..!

ప్రస్తుతం శని, శుక్ర, బుధులు ఎవరి స్థానాల్లో వారు ఉండడంతో పాటు, రవి, గురువులు కూడా మిత్ర క్షేత్రాల్లో సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశుల మీద వీటి ప్రభావం అనేక విధాలుగా కనిపి స్తుంది. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వీటి ప్రభావం వచ్చే నెల 17 వరకూ కొనసాగే అవకాశం ఉంది.

Job Astrology: 5 గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారి ఉద్యోగ జీవితంలో భారీ మార్పులు పక్కా..!
Job Astrology 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 07, 2024 | 1:12 PM

ప్రస్తుతం శని, శుక్ర, బుధులు ఎవరి స్థానాల్లో వారు ఉండడంతో పాటు, రవి, గురువులు కూడా మిత్ర క్షేత్రాల్లో సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశుల మీద వీటి ప్రభావం అనేక విధాలుగా కనిపి స్తుంది. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వీటి ప్రభావం వచ్చే నెల 17 వరకూ కొనసాగే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలున్నాయి.

  1. మేషం: ఈ రాశికి దశమ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు లాభ స్థానంలో వక్రించినందువల్ల మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కూడా పరిస్థితులు పదోన్నతికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. బాధ్యతలు తరచూ మారిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది.
  2. వృషభం: ఈ రాశివారికి దశమ స్థానంలో దశమాధిపతి శనీశ్వరుడి సంచారం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభి స్తుంది. ఉద్యోగం మారాల్సిన అవసరం కలగకపోవచ్చు. పదోన్నతికి, అధికార యోగానికి బాగా అవకాశాలున్నాయి. బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అధికారులు అలవికాని లక్ష్యా లను అప్పగించినప్పటికీ వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఉద్యోగులకు డిమాండ్ పెరగడంతో పాటు కొత్త అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది.
  3. సింహం: ఈ రాశికి దశమ స్థానంలో గురు గ్రహ సంచారం వల్ల ఉద్యోగంలో తప్పకుండా ప్రాధాన్యం పెరుగు తుంది. శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా నిర్వహించి అధికారులకు సంతృప్తిని కలిగిస్తారు. ఉద్యోగపరంగా ఆదాయం కూడా గణనీయంగా వృద్ధి చెందుతుంది. మరింతగా జీతభత్యాలు, అధికారం లభించే సంస్థలోకి మారడా నికి అవకాశం ఉంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. ఉద్యోగ జీవితం సంతృప్తి కలిగిస్తుంది.
  4. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో బలమైన కుజుడి సంచారం వల్ల తప్పకుండా పదోన్నతులు లభి స్తాయి. ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు, ఒత్తిడి ఎక్కువగానే ఉన్నప్పటికీ, వాటిని సమర్థ వంతంగా, సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. ఉద్యోగంలో ఆశించిన స్థాయి స్థిరత్వం లభిస్తుంది. ప్రాధా న్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. గౌరవమర్యాదలకు లోటుండదు.
  5. ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో దశమాధిపతి బుధుడు, భాగ్యాధిపతి రవి కలిసి ఉన్నందువల్ల ఉద్యో గంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. అనేక విధాలుగా జీతభత్యాలు, ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. ఇష్టమైన ప్రాంతాలకు పదోన్నతి మీద బదిలీ అయ్యే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. అధికారులకు మీ పని తీరు బాగా సంతృప్తి కలిగిస్తుంది. డిమాండ్ బాగా పెరుగుతుంది.
  6. మకరం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో రవి, బుధులు, ఉద్యోగ స్థానంలో దశమాధిపతి శుక్రుడు సంచారం చేయడం వల్ల ఉద్యోగపరంగా రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలకు, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగు లకు, నిరుద్యోగులకు అనేక కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగం లోకి మారడానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి.

ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే..
బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే..
నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి
మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి
ఒక్క సినిమాతో హీరోయిన్స్ కుళ్లుకునేలా చేసిన వయ్యారి..
ఒక్క సినిమాతో హీరోయిన్స్ కుళ్లుకునేలా చేసిన వయ్యారి..