AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ఫ్రెండ్ స్ఫూర్తితో వ్యవసాయం బాటపట్టిన మెకానిక్.. ఏడాదికి 12 లక్షల సంపాదన..

కూరగాయల సాగు వల్ల రైతుల ఆదాయం చాలా రెట్లు పెరిగింది. వేలల్లో సంపాదించే రైతులు ఇప్పుడు కూరగాయలు అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. కూరగాయల సాగుతో అదృష్టాన్ని మార్చుకున్న అలాంటి రైతును ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాం. కూరగాయలు అమ్ముతూ ఏటా 10 నుంచి 12  లక్షల రూపాయలను సంపాదిస్తున్న అన్నదాత గురించి ఈ రోజు తెలుసుకుందాం.. 

Success Story: ఫ్రెండ్ స్ఫూర్తితో వ్యవసాయం బాటపట్టిన మెకానిక్.. ఏడాదికి 12 లక్షల సంపాదన..
Vegetable Farming
Surya Kala
|

Updated on: May 08, 2023 | 8:39 AM

Share

అన్నదాత వ్యవసాయాన్ని దండగ కాదు పండగ అనే విధంగా సాంప్రదాయ సాగు వరి-గోధుమలను మాత్రమే కాదు.. ఆధునిక పద్ధతిలో ఇతర పంటలను సాగు చేస్తున్నారు. దీంతో రైతుల తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. విశేషమేమిటంటే హార్టికల్చర్ తర్వాత రైతులు ఎక్కువగా కూరగాయల సాగువైపు దృష్టి సారించారు. కూరగాయల సాగు వల్ల రైతుల ఆదాయం చాలా రెట్లు పెరిగింది. వేలల్లో సంపాదించే రైతులు ఇప్పుడు కూరగాయలు అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. కూరగాయల సాగుతో అదృష్టాన్ని మార్చుకున్న అలాంటి రైతును ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాం. కూరగాయలు అమ్ముతూ ఏటా 10 నుంచి 12  లక్షల రూపాయలను సంపాదిస్తున్న అన్నదాత గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఆజ్ తక్ కథనం ప్రకారం.. రాజస్థాన్‌లోని భిల్వారాలో నివసిస్తున్న రామేశ్వర్ సుతార్ అనే రైతు కూరగాయలు సాగు చేస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలిచాడు. అయితే రామేశ్వర్ సుతార్ పెద్దగా చదువుకోలేదు.    హయ్యర్ సెకండరీ వరకు మాత్రమే చదివాడు. మొదట్లో ఎలక్ట్రిక్ మోటార్ రివైండింగ్ పని చేసేవాడు. అయితే  మోటార్ రివైండింగ్ పని చేయడానికి పెద్దగా ఆసక్తి కలగలేదు. అదే సమయంలో మహారాష్ట్రకు చెందిన ప్రగతిశీల రైతు ఉమేష్ గాడేతో పరిచయం ఏర్పడింది. రామేశ్వర్‌ సుతార్‌కి ఉమేష్‌ గాడే దగ్గర నుంచి  వ్యవసాయం చేయడంలో మెలకువలు నేర్చుకున్నాడు.

6 బిఘాల భూమిలో రకరకాల కూరగాయలు పండిస్తున్నారు

రామేశ్వర్ సుతార్ తన గ్రామంలో ఉమేష్ గాడేకు 65 బిగాల భూమిని 5 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చాడు. ఈ భూమిలో ఉమేష్ స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నాడు. దీంతో లక్షల్లో ఆదాయం వస్తోంది. ఉమేష్ గాడే సంపాదన చూసి రామేశ్వర్ సుతార్ కూడా వ్యవసాయం చేయాలని భావించాడు. అనంతరం గ్రామంలో కూరగాయల సాగు ప్రారంభించారు. ఆరు బిగాల భూమిలో అనేక రకాల కూరగాయలు పండిస్తున్నాడు. ప్రస్తుతం అతని పొలంలో టమాటా, క్యాప్సికమ్‌, పికాడార్‌ మిరప, పసుపు పంటలు వేశారు. అంతేకాదు క్యాబేజీని కూడా సాగు చేస్తున్నాడు. ఈ కూరగాయల సాగుతో లాభాలను ఆర్జిస్తున్నాడు.

డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిపారుదల 

విశేషమేమిటంటే.. రైతు రామేశ్వర్ సుతార్ స్వయంగా టమోటా గ్రేడిండ్ యంత్రాన్ని తయారు చేశారు. ఈ యంత్రంతో వివిధ పరిమాణాల టమోటాలు వేరు చేస్తారు. ప్యాకేజీ పూర్తయిన తర్వాత అమ్మకానికి మండీలకు పంపిస్తారు. ప్రస్తుతం పంటలపై పురుగుమందులు పిచికారీ చేసేందుకు పిచికారీ యంత్రాలను కూడా తయారు చేస్తున్నాడు. రైతు రామేశ్వర్ సుతార్ మాట్లాడుతూ బిందు సేద్యం ద్వారా పంటలకు నీరందిస్తున్నామన్నారు. ఇలా చేయడం వలన నీరు ఆదా అవుతుందని చెప్పారు. మొక్కల మూలాలకు నీరు బాగా చేరుతుంది. ప్రస్తుతం కూరగాయలు అమ్ముతూ ఏడాదికి రూ.10 నుంచి 12 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. రామేశ్వర్ సుతార్ కూరగాయలతో పాటు 6 బిగాల భూమిలో ఇతర పంటలను కూడా సాగు చేస్తూ.. కూరగాయ పంటలతో లాభాలను పండించవచ్చు అని నిరూపించాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..