AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharajas Express: మహారాజులా ప్రయాణం చేయాలనుకుంటే ఈ ట్రైన్ ఎక్కాల్సిందే.. సౌకర్యాలు చూస్తే దిమ్మతిరిగిపొద్ది.. కానీ..

రైలు ప్రయాణమంటే తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దూర ప్రాంతాలకు.. అదీ ఏసీ బోగీలో అయితే ఐదువేలు సరిపోతుంది. మరి ఈ ట్రైన్‌ టికెట్టే లక్షల్లో ఉందంటే అంటే నమ్మగలరా? అదీ మన భారత్‌లోనే.? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! అదేంటో చూడండి.

Maharajas Express: మహారాజులా ప్రయాణం చేయాలనుకుంటే ఈ ట్రైన్ ఎక్కాల్సిందే.. సౌకర్యాలు చూస్తే దిమ్మతిరిగిపొద్ది.. కానీ..
Maharajas Express
Shaik Madar Saheb
|

Updated on: Dec 18, 2022 | 9:26 AM

Share

IRCTC Maharajas Express: జీవితంలో ఏదో ఒక సందర్భంలో రైలు ప్రయాణం చేస్తూనే ఉంటాము. రైల్వేస్టేషన్​, ప్లాట్​ఫామ్​, రైళ్లల్లో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ రద్దీని చూసిన కొందరు.. ఈ జీవితంలో ఒక్కసారైనా ప్రశాంతంగా, ఖాళీగా, విలాసవంతంగా రైలు ప్రయాణం చేయాలి అనుకుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఇండియన్ రైల్వే.. మహారాజాస్​ఎక్స్‌ప్రెస్‌ను తీసుకొచ్చింది. రైల్వే ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని కల్పించటం కోసం IRCTC మహారాజాస్ ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఇందులో ప్రయాణించాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. పేరుకు తగ్గట్టే ప్రయాణం కూడా. మహారాజా అనుభూతి పంచడం ఖాయం అని చెబుతోంది ఐఆర్‌సీటీసీ.

ఐఆర్‌సీటీసీ మహారాజాస్​ఎక్స్‌ప్రెస్‌ లో నాలుగు రకాల టూర్‌ ప్యాకేజీలు, వివిధ శ్రేణుల్లో కేబిన్లు అందుబాటులోఉంటాయి. 7 రోజుల ప్రయాణానికి ఎంచుకున్న శ్రేణిని బట్టి టికెట్‌ ధర ఉంటుంది. ప్రముఖ దర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రాంతాలు ఈ ప్యాకేజీలో చూడొచ్చు. అక్టోబర్‌- ఏప్రిల్‌ మధ్య వివిధ తేదీల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఖర్చు అధికంగా ఉన్నా మర్యాదకు ఏమాత్రం కొదవ ఉండదని మహారాజాస్ ఎక్స్‌ప్రెస్‌ అధికారిక వెబ్‌సైట్లో ఐఆర్‌సీటీసీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

తాజాగా కుశాగ్రత్యాల్‌ అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మహారాజా ఎక్స్‌ప్రెస్‌లో ఉచిత వైఫై కనెక్షన్, లైవ్‌ టెలివిజన్‌, చిన్నతరహా బార్‌, బాత్​రూమ్, షవర్​, లివింగ్​రూమ్‌, డైనింగ్​రూమ్, మాస్టర్​రూమ్.. ఇలా ఈ ట్రైన్​లో.. ఎన్నో సౌకర్యాలను, అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఇంకా మరెన్నో ఆశ్చర్యం కలిగించే వసతులు ఉన్నాయని ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే, టికెట్‌ ధర 19 లక్షల పైమాటేనని వివరించారు.

వీడియో చూడండి..

ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ మహారాజాస్​ఎక్స్‌ప్రెస్‌ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం..

ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ..?
టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ..?
హైదరాబాద్‌లో స్విస్ మాల్.. ప్రపంచంలోనే తొలిసారిగా..
హైదరాబాద్‌లో స్విస్ మాల్.. ప్రపంచంలోనే తొలిసారిగా..