Covid 19: ఆకస్మిక మరణాలకు వ్యాక్సినే కారణమా.? ICMR అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

మార్చురీలు వందలాది శవాలతో నిండిపోయాయి. స్మశాన వాటికల ముందు శవాలను లైన్‌లో పెట్టే దుస్థితి వచ్చింది. చరిత్ర ఎన్నడూ చూడని ఘోరమైన పరిస్థితులకు కారణంగా నిలిచిన కరోనా మహమ్మారి.. ఆరోగ్యాలపై కూడా తీవ్ర దుష్ఫ్రభావాలను చూపింది. ఇక కోవిడ్‌ 19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా కేసులు నమోదు కావడం లేదు కానీ..

Covid 19: ఆకస్మిక మరణాలకు వ్యాక్సినే కారణమా.? ICMR అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
ICMR
Follow us

|

Updated on: Nov 21, 2023 | 12:31 PM

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి అగ్ర రాజ్యాలను గడగడలాడించింది. ఆర్థికంగా శక్తివంతమైన దేశాలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రతీ రంగంలో కరోనా కారణంగా నష్టాలు వచ్చాయి. ఇక కరోనా కారణంగా ఎంత మంది మరణించారో లెక్కలు కూడా. ప్రపంచవ్యాప్తంగా ప్రజుల పిట్టల్లా రాలిపోయారు.

మార్చురీలు వందలాది శవాలతో నిండిపోయాయి. స్మశాన వాటికల ముందు శవాలను లైన్‌లో పెట్టే దుస్థితి వచ్చింది. చరిత్ర ఎన్నడూ చూడని ఘోరమైన పరిస్థితులకు కారణంగా నిలిచిన కరోనా మహమ్మారి.. ఆరోగ్యాలపై కూడా తీవ్ర దుష్ఫ్రభావాలను చూపింది. ఇక కోవిడ్‌ 19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా కేసులు నమోదు కావడం లేదు కానీ.. ఇటీవల భారత్‌లో జరుగుతోన్న కొన్ని ఆకస్మిక మరణాలు మరోసారి ఆందోళన కలిగించింది.

గత కొన్ని రోజుల నుంచి దేశంలో యువత పెద్ద ఎత్తున మరణిస్తుండడం నిపుణులును సైతం ఆందోళనకు గురి చేసింది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వ్యక్తి ఒక్కసారి కుప్పకూలిన సంఘటనలు వైరల్‌గా మారాయి. యువత గుండెపోటుతో మరణించిన వీడియోలు సైతం నెట్టింట ట్రెండ్‌ అయ్యాయి. ఇదిలా ఉంటే కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ వల్లే ఈ ఆకస్మిక మరణాలు సంభవించాయని కొందరు ప్రచారం చేయడం మొదలు పెట్టారు.

అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందన్న విషయంపై ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎమ్‌ఆర్‌) ఓ అధ్యయనం నిర్వహించింది. యువకుల్లో ఆకస్మిక మరణాలకు, కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఈ అధ్యయంలో ఏతలింది. ఆసుపత్రిలో చేరే స్థాయిలో కరోనా సోకడం, కుటుంబ చరిత్రతో పాటు జీవనశైలిలో మార్పులే యువకుల్లో ఆకస్మిక మరణాలకు కారణమని ఐసీఎమ్‌ఆర్‌ పేర్కొంది. దీంతో ఆకస్మిక మరణాలకు, వ్యాక్సినేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని పరిశోధకులు చెబుతున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లాహిరి లాహిరిలో.. అంటూ విహరిస్తున్న వయ్యారి భామ అదా శర్మ
లాహిరి లాహిరిలో.. అంటూ విహరిస్తున్న వయ్యారి భామ అదా శర్మ
రాధిక బర్త్‌డే అంటే అట్లుంటది మల్లా.! నేహాశెట్టి బర్త్ డే వైరల్.
రాధిక బర్త్‌డే అంటే అట్లుంటది మల్లా.! నేహాశెట్టి బర్త్ డే వైరల్.
కవ్వించే కళ్లతో ఆకట్టుకుంటున్న క్యూట్ బ్యూటీ.. అవికా గోర్
కవ్వించే కళ్లతో ఆకట్టుకుంటున్న క్యూట్ బ్యూటీ.. అవికా గోర్
మాంసం ప్రియులకు పండగే.. భారీగా తగ్గిన చికెన్ ధరలు..ఏకంగా రూ.100కే
మాంసం ప్రియులకు పండగే.. భారీగా తగ్గిన చికెన్ ధరలు..ఏకంగా రూ.100కే
పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
ఎర్రని మందారంలాంటి సోయగం ఈ కుర్రదాని సొంతం.. మృణాళిని రవి ఫొటోస్
ఎర్రని మందారంలాంటి సోయగం ఈ కుర్రదాని సొంతం.. మృణాళిని రవి ఫొటోస్
సినిమాలు నిల్లు.. గ్లామర్ షో మాత్రం ఫుల్లు.. రకుల్ అందాలు అదుర్స్
సినిమాలు నిల్లు.. గ్లామర్ షో మాత్రం ఫుల్లు.. రకుల్ అందాలు అదుర్స్
మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన తాజా సీఎం రేవంత్
మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన తాజా సీఎం రేవంత్
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
పోలీసులకే సవాల్ విసిరిన దొంగలు.. దిశ ఎస్సై ఇంట్లో దొంగతనం
పోలీసులకే సవాల్ విసిరిన దొంగలు.. దిశ ఎస్సై ఇంట్లో దొంగతనం