Masked Aadhaar: ఆధార్ ఇప్పుడు మరింత సురక్షితంగా.. మీ ‘మాస్క్ ఆధార్’ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!

Masked Aadhaar: ఇప్పుడు మన దేశంలో ఏ పనికైనా ఆధార్ కార్డ్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. దాదాపుగా ప్రతి ప్రభుత్వ పథకంలోనూ ఆధార్ కార్డ్ కచ్చితంగా అడుగుతున్నారు.

Masked Aadhaar: ఆధార్ ఇప్పుడు మరింత సురక్షితంగా.. మీ 'మాస్క్ ఆధార్' డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!
Masked Aadhaar
Follow us
KVD Varma

|

Updated on: Jun 26, 2021 | 6:31 PM

Masked Aadhaar: ఇప్పుడు మన దేశంలో ఏ పనికైనా ఆధార్ కార్డ్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. దాదాపుగా ప్రతి ప్రభుత్వ పథకంలోనూ ఆధార్ కార్డ్ కచ్చితంగా అడుగుతున్నారు. ఇక ఆధార్ కార్డ్ లో ఏదైనా తప్పులు దొర్లితే ఇంతకుముందు ఆధార్ సెంటర్ కు వెళ్లి సరిచేసుకోవాల్సి వచ్చేది. చిరునామా, పుట్టిన తేదీ, లింగం ఇటువంటివి మార్చుకోవాల్సి వస్తే ఇబ్బందులు ఎదుర్కొనే వారు. కానీ, ఇప్పుడు యుఐడిఎఐ (UIDAI) వీటన్నిటినీ సులభతరం చేసింది. ఆన్‌లైన్‌లోనే అన్నీ మార్చుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో తాజాగా మరో ఫీచర్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది యుఐడిఎఐ (UIDAI). దీనిని మాస్క్ ఆధార్ అని చెబుతున్నారు. అంటే, మన ఆధార్ నెంబర్ కార్డ్ పై పూర్తిగా కనిపించదు. చివరి నాలుగు అంకెలు మాత్రమె కనిపిస్తాయి. మన ఆధార్ లో కనిపించే 12 అంకెల నంబర్ లో మొదటి ఎనిమిది అంకెలూ “xxxx-xxxx” గా కనిపిస్తాయి. తరువాత నాలుగు అంకెలు మాత్రమె అంకెల రూపంలో కనిపిస్తాయి. ఇది కార్డును మరింత సురక్షితంగా మారుస్తుంది.

ఇప్పుడు ఈ సురక్షితమైన ఆధార్ కార్డును మీరు ఆన్‌లైన్‌ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా ఇచ్చింది యుఐడిఎఐ (UIDAI). మీరు ఈ ముసుగు కార్డ్ లేదా మాస్క్ కార్డ్ తీసుకుంటే మీ నెంబర్ మాత్రమె మాస్క్ చేసి కనిపిస్తుంది. మిగిలిన వివరాలు అంటే..పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, క్యూఆర్ కోడ్ వంటివి మామూలుగానే కనిపిస్తాయి. మరి ఈ మాస్క్ ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేయడం ఎలా? మాస్క్ ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేయడానికి, యుఐడిఎఐ ప్రత్యక్ష లింక్‌ను వెల్లడించింది. ఇదీ ఆ లింక్ https: //eaadhaar.uidai.gov.in. ఇప్పుడు ఈ లింక్ ఉపయోగించి మీ మాస్క్ ఆధార్ కార్డ్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవచ్చో చూద్దాం..

  • https://uidai.gov.in/ ని ఓపెన్ చేయండి. అందులో ని   ‘ఆధార్ నమోదు’ విభాగం కింద, ‘నేను – ఆధార్ డౌన్‌లోడ్’ పై క్లిక్ చేయండి.
  • నమోదు ID ఎంపికను ఎంచుకోండి.
  • ఇప్పుడు ‘మీ ప్రాధాన్యతను ఎంచుకోండి’ విభాగం కింద “మాస్క్డ్ ఆధార్” ఎంపికను ఎంచుకోండి.
  • ఇప్పుడు మీ నమోదు ID / ఆధార్ సంఖ్య / VID, పూర్తి పేరు, పిన్ కోడ్ మరియు భద్రతా కోడ్‌ను నమోదు చేయండి.
  • ఇప్పుడు నిబంధనలు, షరతులను అంగీకరించి, “నేను అంగీకరిస్తున్నాను” పై క్లిక్ చేయండి
  • ఇప్పుడు మీ ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్‌లో మీకు వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) లభిస్తుంది.
  • అందుకున్న OTP ని అవసరమైన స్థలంలో ఎంటర్ చేసి, “డౌన్‌లోడ్ ఆధార్” పై క్లిక్ చేయండి.
  • విజయవంతమైన ధృవీకరణ తర్వాత, మీ ముసుగు ఆధార్ కార్డ్ పిడిఎఫ్ ఆకృతిలో డౌన్‌లోడ్ అవుతుంది.
  • మీ పేరు లోని మొదటి నాలుగు అక్షరాలను, మీరు పుట్టిన సంవత్సరాన్ని నమోదు చేయడం ద్వారా మీరు పాస్‌వర్డ్-రక్షిత మాస్క్  ఆధార్ కార్డును తెరవవచ్చు.

మాస్క్ ఆధార్ వివరాలు చెబుతూ యూఐడీఏఐ చేసిన ట్వీట్ ఇదే..

Also Read: Cryptocurrency: క్రిప్టోకరెన్సీ పై వచ్చే ఆదాయానికి టాక్స్ కట్టాలా? ఎంత పన్ను ఈ ఆదాయం మీద చెల్లించాలి? తెలుసుకోండి!

ఏలియన్స్‌ ఉంటే కచ్చితంగా మనల్ని చూస్తూనే ఉంటారు!లీసా కాల్టేనెగర్‌ వివరణ :Aliens

ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!