- Telugu News Photo Gallery Viral photos Viral photos the language of the people of this village is whistling everyone whistles and talks
Viral Photos : ఈ గ్రామ ప్రజల భాష ఈల..! అందరు ఈలలు వేస్తూ మాట్లాడుకుంటారు.. ఈ వింత గ్రామం ఎక్కడుందో తెలుసా..?
Viral Photos : మనం ఎవరితోనైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు అతడిని పేరుతో పిలుస్తాం. అనంతరం సంభాషిస్తాం. కానీ భారతదేశంలోని ఓ గ్రామంలో పేర్లు ఉండవు. అన్నీ ఈలల ద్వారానే..
Updated on: Jun 26, 2021 | 7:11 PM

భారతదేశాన్ని అద్భుతాల దేశం అని పిలుస్తారు. ఇక్కడ విభిన్న రకాల ప్రజలు జీవిస్తారు. వారి ఆహార శైలి, సంప్రదాయాలు అన్నీ వేర్వేరుగా ఉంటాయి. అయితే దేశంలోని ఒక గ్రామంలో మాత్రం ఈల ద్వారా మాట్లాడుకోవడం వింతగా అనిపిస్తుంది.

ఈ గ్రామం ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉంది. ఈ గ్రామం పేరు కాంగ్‌తాంగ్. కానీ విజిల్ ప్రత్యేకత వల్ల ఈ గ్రామాన్ని విస్లింగ్ విలేజ్ అని పిలుస్తారు. రాష్ట్రంలోని ఖాసీ తెగకు చెందిన వారు సాధారణ భాషకు బదులుగా విజిల్‌ను ఉపయోగిస్తున్నారు.

ఇక్కడ ప్రతి వ్యక్తికి రెండు పేర్లు ఉంటాయి. ఒకటి సాధారణ పేరు మరొకటి ఈల పేరు. ఇక్కడ నివసించే ప్రజలందరి పేర్లు భిన్నంగా ఉంటాయి. ట్యూన్లతోనే గ్రామం మొత్తం ఒకరినొకరు పిలుచుకుంటారు.

ఒకప్పుడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి శత్రువులను తప్పించుకోవడానికి చెట్టు ఎక్కాడు. సహాయం కోసం తన స్నేహితులను పిలవడానికి అతను అడవి గొంతును ఉపయోగించాడు. తద్వారా అతడిని శత్రువు గుర్తించలేకపోయాడు. ఈ సంఘటన తరువాత ఈల భాష వెలుగులోకి వచ్చింది.

సమాచారం ప్రకారం ఈ గ్రామంలో వందకు పైగా కుటుంబాలు ఉన్నాయి. వీరి సభ్యుల పేరు వేర్వేరు ట్యూన్ల ప్రకారం ఉంటాయి. కొత్త ట్యూన్లు రూపొందించడానికి కుటుంబ సభ్యులు అడవికి వెళ్తారు.





























