వాషింగ్ మెషిన్ శుభ్రం చేయడం ఎలా ? ఈ సింపుల్ ఇంటి చిట్కాలు మీకోసం
వాషింగ్ మెషిన్ ను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ఇది మన బట్టలు శుభ్రంగా ఉతికేలా చేస్తుంది. నిమ్మకాయ, బేకింగ్ సోడా వంటి సహజ పదార్థాలతో వాషింగ్ మెషిన్ ను శుభ్రం చేయడం సులభం. నిమ్మకాయలోని యాసిడ్ వాషింగ్ మెషిన్ లోని చెత్తను తొలగిస్తుంది. బేకింగ్ సోడా డ్రమ్‌లోని మచ్చలు, వాసనలను తొలగిస్తుంది. వాషింగ్ మెషిన్ డోర్‌ను సున్నితంగా శుభ్రం చేసి తడి ఆరేంత వరకు ఓపెన్ చేసి పెట్టాలి. ఈ విధంగా చేస్తే వాషింగ్ మెషిన్ ఎక్కువ కాలం పనిచేస్తుంది.
ప్రస్తుత కాలంలో కొంత మందికి తప్ప అందరికీ వాషింగ్ మెషిన్లు ఉన్నాయి. అందరం కూడా ప్రతిరోజూ ఉపయోగిస్తుంటాం. కానీ మనం దీన్ని మెయింటనెన్స్ చేయడం మాత్రం టైం ఉండక ఎలా చేయడం తెలియక చేయలేకపోతున్నాం. కానీ వాషింగ్ మెషిన్ ను క్లీన్ చేసి నీట్ గా ఉంచడం మాత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మన బట్టలు ఉతకడం వల్ల దీంట్లో దమ్ము, దూళి, వెంట్రుకలు వంటివి మిషన్ లో ఉంటాయి. మనం దీన్ని క్లీన్ చేస్తేనే మెషిన్ లైఫ్ టైమ్ బాగుంటుంది. మరి ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
నిమ్మకాయతో శుభ్రం చేయండిలా !
నిమ్మకాయను వాషింగ్ మెషిన్ శుభ్రం చేయడానికి ఉపయోగించి చూడండి మంచి ఫలితం ఉంటుంది. నిమ్మకాయలోని సహజమైన యాసిడ్ మీ వాషింగ్ మిషన్ ను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. ఒక నిమ్మకాయ తీసుకుని దాన్ని రెండు భాగాలుగా కట్ చేయండి. ఇప్పుడు ఆ నిమ్మకాయ లోపలి గుజ్జుని తీసుకుని కొంచెం నీటితో కలిపి వాషింగ్ మెషిన్ లో వేయండి. ఆ తర్వాత మెషిన్ ను ఆన్ చేయండి. కొంత సమయం తర్వాత వాషింగ్ మెషిన్ ను ఆపి నీళ్లతో శుభ్రం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మెషిన్ లో ఉన్న చెత్త అంతా తొలగించవచ్చు.
బేకింగ్ సోడాతోనూ క్లీనింగ్
బేకింగ్ సోడా కూడా వాషింగ్ మెషిన్ శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. ఇది లోపల డ్రంమ్ కి ఉన్న మరకలు, వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడా తీసుకొని దీన్ని డిటర్జెంట్ వేసే దాంట్లో వేయండి. ఆ తర్వాత మెషిన్ లో ఒక స్పిన్ ఆప్షన్ పెట్టండి. ఈ విధంగా చేస్తే డ్రంమ్ నీట్ గా క్లీన్ అవుతుంది.
వాషింగ్ మెషిన్ డోర్ క్లీనింగ్ కూడా ముఖ్యమే
మీ వాషింగ్ మెషిన్ డోర్ కూడా శుభ్రంగా ఉంచాలి. ఇది క్లీన్ చేయడం కూడా ముఖ్యమే. కానీ డోర్ ను మాత్రం సున్నితంగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత డోర్ కాసేపు తీసి ఉంచండి. దీని వల్ల లోపల వాటర్ తడి ఏమైన ఉన్న ఆరిపోవడం వల్ల స్మెల్ రాదు. ఇలా మీ మెషిన్ ను నెలలో ఒకటి లేదా రెండు సార్లూ లేదంటే మెషిన్ మీకు డ్రంబ్ క్లీనింగ్ ఆప్షన్ చూపినప్పుడు క్లీన్ చేయండి. ఇలా మీ మెషిన్ ను క్లీన్ చేయడం వల్ల ఎక్కువ కాలం పని చేస్తుంది.