AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బట్టలను డిటర్జెంట్‌లో ఎన్ని నిమిషాలు నానబెట్టాలో తెలుసా.. ఇందులో చల్లని నీటికి ఓ లెక్క.. వేడి నీటికి మరో లెక్క..

బట్టలు ఉతికినప్పుడల్లా.. బట్టలు ఎంతసేపు నీటిలో నానబెట్టాలి..? ఇలాంటి ప్రశ్న మీకు వచ్చి ఉంటుంది. దుస్తులను డిటర్జెంట్‌లో ఎన్ని నిమిషాలు నానబెట్టాలో ఓ సారి తెలుసుకుందాం..

బట్టలను డిటర్జెంట్‌లో ఎన్ని నిమిషాలు నానబెట్టాలో తెలుసా.. ఇందులో చల్లని నీటికి ఓ లెక్క.. వేడి నీటికి మరో లెక్క..
Soaking Clothes In Surf
Sanjay Kasula
|

Updated on: Mar 01, 2023 | 9:44 PM

Share

బట్టలు ఉతికిన తర్వాత మరక మిగిలిపోయిందని లేదా గుడ్డలు సరిగా శుభ్రం చేయలేదని తరచుగా ఫిర్యాదులు వస్తుంటాయి. బట్టలు సరిగ్గా శుభ్రం చేయడానికి, మొదట వాటిని డిటర్జెంట్‌లో నానబెట్టి, ఆపై వాటిని శుభ్రం చేస్తారు. కానీ, కొందరు దానిని కొన్ని నిమిషాలు నానబెట్టి, మరికొందరు బట్టలను రాత్రంతా నానబెట్టి వదిలేస్తారు. ఇలాంటి సమయంలో బట్టలు ఎప్పుడు ఉతికినా.. బట్టలు ఎంతసేపు నీటిలో నానబెట్టాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. వాస్తవానికి ఈ ప్రశ్నకు మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.

బట్టలు ఎంతసేపు నానబెట్టాలి అనేది ఆ వస్త్రంపై ఆధారపడి ఉంటుంది. అది ఎంత సమయం నానబెట్టాలి.. ఎంత నీటిని పోయాలి.. ఎంత డిటర్జెంట్ వేయాలి. ఇందుకు సగటుగా బట్టలను డిటర్జెంట్ నీటిలో 15 నుంచి 60 నిమిషాలు మాత్రమే నానబెట్టాలి. బట్టలను కొన్ని నిమిషాల పాటు నానబెట్టడం వల్ల బట్టలు శుభ్రంగా మారుతాయి.

కొత్త బట్టలు ఎంతసేపు నానబెట్టాలి?

చేతితో కడుక్కోగలిగే ఏదైనా హ్యాండ్ వాష్. మీ కొత్త దుస్తులను 10 నిమిషాలు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత అందులో నుంచి నీటిని తీసివేసి, మీ బట్టలు చల్లటి నీటిలో ఉతకండి.

తెల్లని దుస్తులను డిటర్జెంట్‌లో ఎంతసేపు నానబెట్టాలి?

పెర్సిల్ వంటి ¼ కప్ డిటర్జెంట్ పౌడర్‌ని గోరువెచ్చని నీటితో నిండిన బకెట్‌లో కలపండి. మీ తెల్లని దుస్తులను సాధారణ ఉతకడానికి ముందు రెండు గంటల పాటు నాననివ్వండి. ఆపై వాటిని శుభ్రం చేసే పనికి వెళ్లండి.

బట్టలను చల్లటి నీటిలో ఎంతసేపు నానబెట్టాలి?

బట్టలను పదినిమిషాల పాటు నానబెట్టిన తర్వాత కూడా మరకలను శుభ్రం చేయడానికి చల్లని నీరు సహాయపడుతుంది. మరకలు చల్లటి నీటిలో బాగా వదలుతాయి. ఎలాంటి మరకు లేకుండా చేస్తాయి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం