Karra Billa: కర్రా బిల్లా.. క్రికెట్‌ను మించి కిక్కిచ్చే గేమ్! ఎలా ఆడాలో తెలుసా? ఇదిగో ఇవే రూల్స్!
ఇప్పుడంటే.. అందరం ఫ్యూచర్ వెంట పరుగులు తీస్తూ.. బిజీ లైఫ్‌లో కంప్యూటర్ల ముందు గడుపుతున్నాం. కానీ ఒక్కసారి మన బాల్యాన్ని గుర్తుతెచ్చుకోండి.. అప్పట్లో మనం ఆడే ఆటలు, చేసే అలర్లు ఎంత సరదాగా ఉండేవో.. కానీ ఇప్పుడు సిటీ గోలలో పడి.. బాల్యాన్ని అందరూ మర్చిపోతున్నారు. అలాంటి వాటిని గుర్తు చేస్తూ.. మన చిన్ననాటి ఆటలకు ఊపిరపోయమే ఈ చిన్న ప్రయత్నం.

మీకు గుర్తుందా.. చిన్నప్పుడు ఓ గేమ్‌కు ఇప్పుటి క్రికెట్‌కు మించిన క్రేజ్ ఉండేది.. అదే కర్రా బిల్లా.. కొన్ని ప్రాంతాల్లో దీన్నే గిల్లి దండా అని కూడా పిలుస్తారు. ఈ గేమ్ రూల్స్ మీకు ఇంకా గుర్తున్నాయా? ఎవరైనా మర్చిపోయి ఉంటే.. ఇక్కడ తెలుసుకుందాం. కర్రా బిల్లా అనేది రెండు కర్రలతో ఆడే సంప్రదాయ ఆట. ప్రాంతాన్ని బట్టి ఈ ఆటలో రూల్స్ కొంచెం మారుతాయి. సాధారణంగా ఈ ఆటలో ఒక పొడవైన కర్ర, ఒక చిన్న కర్ర( దినినే బిల్లా) అని ఉంటాయి.
ఆట కావాల్సిన జట్టు సభ్యులు.. రూల్స్ ఇవే
ఈ ఆట ఆడాలంటే 2 టీమ్స్ ఉండాలి.. టీమ్ A, టీమ్ B. రెండు టీమ్‌లలో ప్లేయర్స్ సమానంగా ఉండాలి. టాస్ వేసి బ్యాటింగ్, ఫీల్డింగ్ నిర్ణయించాలి
ఆట ఎలా స్టార్ట్ అవుతుంది?
నేలపై ఒక చిన్న గీత లేదా గుంతను బేస్గా ఉంచాలి. మీ దగ్గర ఉన్న చిన్న కర్రను బేస్ దగ్గర ఉంచాలి. పెద్ద కర్రతో బిల్లా ఒక సైడ్‌పై కొట్టి గాల్లోకి లేపాలి అది గాల్లో ఉన్నప్పుడు పెద్ద కర్ర సహాయంతో దూరంగా కొట్టాలి.
అవుట్ రూల్స్
ప్రత్యర్థి టీమ్ ఫీల్డర్ బిల్లాను గాల్లోనే క్యాచ్ పట్టుకుంటే బ్యాటర్ ఔట్ అయినట్టు అర్థం. బిల్లా కొట్టడంలో నిర్ణయించిన ప్రయత్నాలు విఫలమైనా, బిల్లా తిరిగి బేస్‌కి విసిరినప్పుడు అది నిర్ణయించిన నియమం ప్రకారం బేస్‌ను తాకితే బ్యాటర్ అవుట్ అయినట్టే.
స్కోరింగ్ విధానం
బిల్లా పడిన చోటు నుంచి బేస్ వరకు దూరాన్ని పెద్ద కర్రతో కొలవాలి. ఒక పెద్ద కర్ర పొడవు = 1 పాయింట్ అనుకుంటే.. 12 కర్రల దూరం ఉంటే 12 పాయింట్లు. ప్రతి రౌండ్‌లో వచ్చిన పాయింట్లను టీమ్ స్కోర్‌లో కలపాలి.
జట్టు విజయం
ఉదాహరణకు టీమ్ Aలోని ఆటగాళ్లు ఒక్కొక్కరుగా బ్యాటింగ్ చేస్తారు. నిర్ణయించిన రూల్ ప్రకారం అందరూ అవుట్ అయిన తర్వాత టీమ్ B బ్యాటింగ్ చేస్తుంది. రెండు టీమ్స్‌కు సమాన అవకాశాలు ఇచ్చిన తర్వాత మొత్తం స్కోర్ లెక్కించాలి. ఎక్కువ పాయింట్లు సాధించిన టీమ్ విజేత అవుతుంది.
కొన్ని ప్రాంతాల్లో ఇలా
అయితే రెండు తెలుగురాష్ట్రాల్లో ఈ ఆటను ఆడుతున్నప్పటికి కొన్ని ప్రాంతాల్లో మాత్రం రూల్స్ వేరుగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో బిల్లాను మూడు సార్లు కొట్టడం, ప్రత్యర్థి బిల్లాను తిరిగి గుంతలోకి విసరడం వంటి అదనపు రూల్స్ కూడా ఉంటాయి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
