AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరా గిఫ్ట్.. ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రభుత్వం!

దసరా పండగ ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. మహర్నవమి సందర్భంగా అక్టోబర్ 19న సెలవు ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా నాలుగు రోజుల పాటు సెలవులు లభించాయి. అయితే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు మాత్రం ఈ సెలవులు వర్తించవని పేర్కొంది.

దసరా గిఫ్ట్.. ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రభుత్వం!
Good News For Ap Govt Employees
Anand T
|

Updated on: Oct 17, 2026 | 8:10 AM

Share

ఎన్నికల విధుల్లో లేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మహర్నవమి సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ సోమవారాన్ని సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా శని, ఆదివారాలు సెలవులు కావడంతో పాటు సోమవారం సాధారణ సెలవు, మంగళవారం దసరా సెలవు కలిసి రావడంతో ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అక్టోబర్ 19న ఇచ్చిన సెలవుకు బదులుగా నవంబర్ 14 రెండో శనివారాన్ని పని దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది మాత్రం యథావిధిగా విధులకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది.

అయితే ఈ సెలవులు ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించవని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పా్ట్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ విధుల్లో ఉన్న ఉద్యోగులు.. వారికి కేటాయించిన విధులకు యదావిదిగా హాజరవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us