అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత!
Horoscope Today (October 17, 2026): శనివారం 12 రాశుల వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి? మేషం నుంచి మీనం వరకు ఏయే రాశుల వారికి ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో లాభాలు, ఆర్థిక పురోగతి లభిస్తాయి? మరికొన్ని రాశుల వారికి గ్రహాల సంచారం ఎలాంటి ఫలితాలను సూచిస్తోంది? నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.

దిన ఫలాలు (అక్టోబర్ 17, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో అంచనాల్ని మించి లాభాలు అందుకుంటారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయడం జరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవు తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో అంచనాల్ని మించి లాభాలు అందుకుంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సహాయాన్ని కూడా తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. పిల్లలకు సంబంధించి శుభవార్త వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అధికారులతో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఆస్తి వ్యవ హారాలు నిదానంగా చక్కబడతాయి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలున్నా ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అధికారులు అప్పగించిన బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో మరింత మెరుగైన పరిస్థితులుంటాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగులకు కొద్దిగా అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభవార్తలు అందుతాయి. ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది కలి గిస్తాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబసమేతంగా ఆలయాలు సంద ర్శిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందు తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ పెద్దలతో సవ్యంగా, సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహ కరంగా సాగుతాయి. ఇష్టమైన మిత్రులతో కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక రుణ సమస్యలు తగ్గు తాయి. గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్త వుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక లావాదేవీలు లాభాలనిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరిగి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆదాయా నికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడవచ్చు. కుటుంబ జీవితంలో కొన్ని చికాకులు తప్పవు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కాస్తంత ఉప శమనం లభిస్తుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా పురోగమిస్తాయి. వ్యాపారంలో కొత్త వ్యూహాలు, ఆలోచ నలు అమలు చేస్తారు. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించి ఆలోచనలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో పెద్దల పరిచయాలు విస్తృతం అవుతాయి. పిల్లలకు చదువులకు సంబంధించి కొత్త అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
రోజంతా మీకు అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుం టారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువుల నుంచి ఆశించిన శుభ వార్త వింటారు. తల్లితండ్రుల సహాయంతో తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబంతో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంటి విషయాల్లో కొన్ని ఆలోచనలు స్థిరంగా ఉండకపోవచ్చు. బంధువులు విమర్శలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.



