AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రాన్ని చుట్టుముట్టిన కరువు మేఘాలు..! ప్రకృతి శాపమా? మానవ తప్పిదమా?

మొత్తం 100 దేశాల్లో ఎల్‌నినో విరుచుకుపడుతుందని ఐక్యరాజ్యసమితి స్టేట్‌మెంట్ ఇచ్చింది. దేశంలో 60 శాతం రాష్ట్రాలకు గొంతు ఎండిపోతుందని కేంద్రప్రభుత్వం అంచనా వేసింది. తెలంగాణ మాత్రం ఎల్‌నినో ప్రభావాన్ని ప్రత్యక్షంగానే చవిచూస్తోంది. రాష్ట్రంలో 11.18 లక్షల ఎకరాలపై కరువు ప్రభావం పడుతోంది.. క్రాప్ హాలిడే తప్ప మరో మార్గం లేదు, నిండుకున్న రిజర్వాయర్లు, ఆగిన విద్యుదుత్పత్తి, డిసెంబర్‌ తర్వాత హైదరాబాద్‌ నల్లాల్లో నో నీళ్లు.. ప్రభుత్వానికి అధికారులిచ్చిన నివేదిక సారాంశం ఇది. అటు, ఐదు లక్షల ఎకరాల్లో పంటలకు తెగుళ్ల బెడద పట్టుకోబోతోంది అని మరో చావుకబురు చల్లగా చెబుతున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. తెలంగాణలో రైతు నెత్తిన పడ్డ మరో పిడుగుపాటు ఇది. సో.. ఊరూవాడా, పల్లేపట్నం మొత్తం రాష్ట్రమే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మరి, ప్రభుత్వం ఏం చేస్తోంది.. ప్రతిపక్షం ఏం ఆలోచిస్తోంది.. దీంతో కరువు చుట్టూ కీచులాట మొదలైంది..!

రాష్ట్రాన్ని చుట్టుముట్టిన కరువు మేఘాలు..! ప్రకృతి శాపమా? మానవ తప్పిదమా?
El Nino Effect Telangana
Balaraju Goud
|

Updated on: Oct 16, 2026 | 9:50 PM

Share

>>లోటు వర్షపాతంతో 11.18 లక్షల ఎకరాల్లో పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. >>కావల్సినన్ని నీళ్లు లేక ఇప్పటికే 10 లక్షల ఎకరాల్లో పత్తి, వరి చేలు నాశనమయ్యాయి. >>కృష్ణా నదిపై ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 270 టీఎంసీలైతే, ఇప్పటికున్నది 78.5 టీఎంసీలే. అంటే, 70 శాతం లోటున్నట్టు. >>గోదావరి బేసిన్‌ రిజర్వాయర్లలో 96 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. ఇది 34 శాతం లోటు. >>29.91 టీఎంసీల నీళ్లుండాల్సిన సింగూరు డ్యామ్‌లో 4 టీఎంసీలే ఉన్నాయి. అవి కూడా డిసెంబరు వరకే..! >>రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో పావు వంతు కన్నా తక్కువ నీరే ఉంది..! >>నీటి సంక్షోభం అంచుకు చేరింది భాగ్యనగరం..! ఇప్పుడు 14.5 లక్షల నల్లా కనెక్షన్ల నుంచి కోటీ 30 లక్షల మందికి నీళ్లిస్తోంది జల మండలి. కానీ, భవిష్యత్తులో 4 లక్షల నల్లాల్లో నీళ్లే రాకపోవచ్చు. అంటే మూడో వంతు హైదరాబాద్‌కు నీళ్ల కటకట తప్పదు. ఇదీ క్లుప్తంగా రాష్ట్రంలో కరవు పరిస్థితి. సంబంధిత మంత్రిత్వ శాఖలన్నీ కలిసి మండలాలనుంచి రిపోర్ట్ తెప్పించుకుని పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చి ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాయి. సమస్య ఇదీ, పరిష్కారం మాత్రం కనుచూపు మేరలో లేదని తేల్చేశాయి. గురువారం రివ్యూ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనల్ వార్నింగ్ ఇవ్వడంతో అన్ని డిపార్ట్‌మెంట్లూ ఎటెన్షన్‌లోకి వచ్చాయి. వాటర్ బోర్డు ఎమ్‌డీతో, హైదరాబాద్ కలెక్టర్‌తో కలిసి నీళ్ల స్థితిగతులపై రిపోర్ట్ తీసుకున్నారు స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్. >>ప్రజలు 20శాతమైనా నీళ్ళ వాడకం తగ్గించుకోవాలి.. >>ఎట్టి పరిస్థితుల్లో చెట్లకు...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి