రాత పరీక్ష లేకుండానే రిజర్వ్ బ్యాంక్లో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే జాబ్ మీదే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముంబయి ప్రాంతీయ కార్యాలయంలో 22 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫార్మసీ డిప్లొమా లేదా B.Pharm అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎంపికైన వారికి గంటకు రూ.600 వేతనం చెల్లిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 3, 2026లోగా పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..

నిరుద్యోగులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తీపికబురు అందించింది. ముంబయి ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని వివిధ డిస్పెన్సరీల్లో ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ పోస్టులకు నవంబర్ 3, 2026లోగా పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి. కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జనరల్/అన్రిజర్వ్డ్ (GEN/UR) కేటగిరీలో పోస్టుల సంఖ్య: 13
- ఇతర వెనుకబడిన తరగతులు (OBC) కేటగిరీలో పోస్టుల సంఖ్య: 5
- ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS) కేటగిరీలో పోస్టుల సంఖ్య: 2
- షెడ్యూల్డ్ కులాలు (SC) కేటగిరీలో పోస్టుల సంఖ్య: 1
- షెడ్యూల్డ్ తెగలు (ST) కేటగిరీలో పోస్టుల సంఖ్య: 1
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత వైద్య విభాగంలో డిప్లొమా లేదా ఫార్మసీలో బ్యాచిలర్ డిగ్రీ (B.Pharm) ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 3, 2026వ తేదీలోగా తమ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి. ఎంపికైన అభ్యర్థులకు గంటకు రూ.600 చొప్పున వేతనం చెల్లిస్తారు. ఈ నియామకం పూర్తిస్థాయి శాశ్వత ఉద్యోగం కాకుండా, ఒప్పంద ప్రాతిపదికన ఉంటుంది. ఫార్మసీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు RBI అధికారిక నోటిఫికేషన్లో అర్హతలు, ఇతర నిబంధనలు, దరఖాస్తు విధానాన్ని పూర్తిగా పరిశీలించడం మంచిది.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా
రీజినల్ డైరెక్టర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, రిక్రూట్మెంట్ సెక్షన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబయి ప్రాంతీయ కార్యాలయం, షహీద్ భగత్ సింగ్ రోడ్, ఫోర్ట్, ముంబయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




