Tulsi Plant: పొరపాటున కూడా తులసి మొక్క దగ్గర ఈ వస్తువులను ఉంచకండి.. మహా పాపం.. జీవితంలో ఎదగలేరు!
Tulsi Plant: హిందూ సాంప్రదాయంలో తులసికి ప్రత్యేక స్థానముంది. ప్రతి ఒక్కరి ఇళ్లలో తులసికి పూజలు చేస్తుంటారు. తులసి పూజలందుకోవడమే కాదు.. అందులో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. కానీ తులసి చెట్టును పవిత్రంగా భావిస్తారు. కానీ కొన్ని పొరాపట్లు చేస్తే జీవితంలో ఎదగలేరు. అంతేకాదు ఎన్నో వివాదాలు, అరిష్టం, డబ్బు నష్టం వంటివి జరుగుతుంటాయి..

Tulsi Plant: తులసిని మతపరమైన దృక్కోణం నుండి పవిత్రమైనదిగా పరిగణించడమే కాకుండా ఆరోగ్యం, సానుకూల శక్తికి మూలంగా కూడా పరిగణిస్తారు. ఇంట్లో తులసి మొక్క ఉండటం వల్ల పర్యావరణం శుద్ధి అవుతుందని చెబుతుంటారు. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కొనసాగుతుంది. అందుకే పొరపాటున కూడా ఈ వస్తువులను తులసి దగ్గర ఉంచకూడదని, లేకుంటే మీరు పేదవారు కావచ్చని పండితులు చెబుతున్నారు.
- చెత్త లేదా ధూళి: తులసి దగ్గర మురికి లేదా చెత్త ఉంచడం అశుభకరం. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని వ్యాపింపజేస్తుంది. అలాగే డబ్బు నష్టానికి దారితీస్తుంది.
- బూట్లు, చెప్పులు: తులసి మొక్క దగ్గర బూట్లు, చెప్పులు ఉంచడం వల్ల లక్ష్మిదేవి అక్కడ ఉండటానికి ఇష్టపడదట. ఇది అపవిత్రంగా పరిగణిస్తారు. మతపరమైన కోణం నుండి కూడా నిషేధించారు.
- ఇనుప వస్తువులు: తులసి మొక్క దగ్గర ఇనుప వస్తువులను ఉంచడం వల్ల సానుకూల శక్తి నశిస్తుంది. గ్రంథాల ప్రకారం.. ఇది ఇంటి శ్రేయస్సును తగ్గిస్తుంది.
- ఎండిన చెట్లు, మొక్కలు: తులసి దగ్గర ముళ్ళు లేదా ఎండిన మొక్కలను ఉంచడం వల్ల దురదృష్టం. అలాగే అశాంతి పెరుగుతాయి. తులసిని ఎల్లప్పుడూ పచ్చని వాతావరణంలో ఉంచాలి.
- మాంసాహారం: తులసి దగ్గర మాంసాహారం ఉంచడం పెద్ద పాపంగా పరిగణిస్తారు. ఇది మత విశ్వాసానికి విరుద్ధం. అలాగే అశుభ ప్రభావాన్ని చూపుతుంది.
- మత్తు పదార్థాలు: తులసి దగ్గర మద్యం లేదా మత్తు పదార్థాలు ఉంచుకోవడం లక్ష్మీ దేవిని అవమానించడమే. దీనివల్ల ఇంట్లో పేదరికం, విభేదాలు పెరుగుతాయి.
- పూజలో ఉపయోగించే విరిగిన వస్తువులు: తులసి దగ్గర విరిగిన విగ్రహాలు, దీపాలు లేదా ఇతర పూజా సామగ్రిని ఉంచడం కూడా అశుభకరం. ఇది ఇంట్లో శ్రేయస్సును తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: Mahindra: ఇదేం క్రేజ్ బ్రో.. కేవలం 135 సెకన్లలో 999 కార్లు సేల్.. 682కి.మీ రేంజ్.. అంత ప్రత్యేకత ఏంటి?




