Guru Vakri: వక్ర గురువు ప్రభావం.. ఆ రాశుల వారికి కష్టాల నుంచి విముక్తి పక్కా..!

ఈ నెల 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 5 వరకు గురువు వృషభ రాశిలో వక్రగతి చెందుతున్నాడు. గురువు స్థితి కారణంగా ఇంతవరకు ప్రతికూల ఫలితాలను అనుభవిస్తున్న కొన్నిరాశుల వారు ఈ వక్ర గతి వల్ల సానుకూల ఫలితాలను పొందడం ప్రారంభం అవుతుంది. దీంతో కొన్ని రాశుల వారు ఆర్థిక సంబంధమైన కష్టనష్టాల నుంచి, ఉద్యోగ పరమైన సమస్యల నుంచి, కొన్ని ఒత్తిళ్ల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది.

Guru Vakri: వక్ర గురువు ప్రభావం.. ఆ రాశుల వారికి కష్టాల నుంచి విముక్తి పక్కా..!
Guru Vakri 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 03, 2024 | 7:05 PM

ఈ నెల 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 5 వరకు గురువు వృషభ రాశిలో వక్రగతి చెందుతున్నాడు. గురువు స్థితి కారణంగా ఇంతవరకు ప్రతికూల ఫలితాలను అనుభవిస్తున్న కొన్నిరాశుల వారు ఈ వక్ర గతి వల్ల సానుకూల ఫలితాలను పొందడం ప్రారంభం అవుతుంది. మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారు ఆర్థిక సంబంధమైన కష్టనష్టాల నుంచి, ఉద్యోగ పరమైన సమస్యల నుంచి, కొన్ని ఒత్తిళ్ల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది. ఈ రాశుల వారు గురువు వక్రగతిలో ఉన్నంత వరకు దత్తాత్రేయ స్తోత్నాన్ని నిత్యం పఠించడం వల్ల మరింతగా సుఖ సంతోషాలను అనుభవించడం జరుగుతుంది.

  1. మిథునం: ధన, కుటుంబ, గృహ, శుభ కార్యాలకు సంబంధించిన కారకత్వాలు కలిగి ఉన్న గురువు ప్రస్తుతం ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్నందువల్ల కొన్ని సుఖ సంతోషాలు అనుభవంలోకి రాకపోవడం జరుగుతుంది. అయితే, గురువు వక్రించడం వల్ల ఈ చెడు ఫలితాలన్నీ తగ్గి ఆదాయం పెరగడం, పిల్లలు వృద్ధిలోకి రావడం, కుటుంబ పరిస్థితులు చక్కబడడం, ఇంట్లో శుభకార్యాలు జరగడం, ఆదాయం పెరగడం వంటివి జరగడం ప్రారంభం అవుతుంది. సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది.
  2. సింహం: ఈ రాశివారికి గురువు దశమ స్థాన సంచారం వల్ల పురోగతికి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతుంటాయి. అయితే, గురువు వక్ర గతి వల్ల ఉద్యోగంలో తప్పకుండా శీఘ్ర పురోగతి ఉంటుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవ కాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి.
  3. తుల: ఈ రాశికి గురువు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల రావలసిన డబ్బు చేతికి అందక పోవడం, డబ్బు తీసుకున్నవారు ముఖం చాటేయడం, పిల్లలతో సమస్యలు తలెత్తడం, సంతానం కలగకపోవడం, గృహ నిర్మాణాలు ఆగిపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. అయితే, గురుడి వక్రగతి వల్ల ఈ సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. సంతాన యోగం కలుగుతుంది. గృహ యోగం పడుతుంది.
  4. ధనుస్సు: ఈ రాశికి అధిపతి అయిన గురువు షష్ట స్థానంలో సంచరిస్తుండడం వల్ల ఉద్యోగంలో పురోగతికి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. రావలసిన సొమ్ము చేతికి అందక, ఆదాయం వృద్ధి చెందక, ఎంత కష్టపడ్డా ఆశించిన ప్రయోజనం సిద్ధించక ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. గురుడి వక్ర గమనంతో ఈ సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆదాయం దిన దినాభివృద్ది చెందుతుంది.
  5. మీనం: ఈ రాశికి అధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో సంచరిస్తున్నందువల్ల ప్రతి పనీ మంద కొడిగా సాగుతుంది. ఉద్యోగంలో పురోగతికి ఆటంకాలు ఉంటాయి. ధనాభివృద్ధికి అవకాశం లేక పోగా, కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంటుంది. గురువు వక్ర గమనంతో ఈ పరిస్థితుల నుంచి బయటపడడం జరుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి.