ఏటీఎం పిన్ నెంబర్‌కు ఎందుకు 4 అంకెలు మాత్రమే ఉంటాయి.? మీరెప్పుడైనా గమనించారా.!
ఒకప్పుడు బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే పెద్ద తలనొప్పిగా ఉండేది. బ్యాంక్‌కు వెళ్లడం.. విత్‌డ్రా ఫాం నింపడం..

ఒకప్పుడు బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే పెద్ద తలనొప్పిగా ఉండేది. బ్యాంక్‌కు వెళ్లడం.. విత్‌డ్రా ఫాం నింపడం.. టోకెన్ నెంబర్ తీసుకోవడం.. మీ నెంబర్ వచ్చేదాకా క్యూలైన్‌లో వెయిట్ చేయడం.. ఇలా చాలా పెద్ద ప్రాసెస్. కాని ఇప్పుడు అందరి దగ్గర ఏటీఎం కార్డులు ఉన్నాయి.
అత్యవసర సమయాల్లో డబ్బులు కావాలంటే.. పక్కనే ఉన్న ఏటీఎం మిషిన్ దగ్గరకు వెళ్లడం.. పిన్ నెంబర్ నొక్కితే చాలు.. నిమిషాల్లో మనం అనుకున్నంత డబ్బు చేతుల్లో ఉంటుంది. అలాగే ఇటీవల ఆన్‌లైన్ లావాదేవీలు ఎక్కువైపోయాయి కాబట్టి.. చాలామంది ఇంటి దగ్గర నుంచే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి వాటిని వినియోగిస్తున్నారు. సరే ఇవన్నీ పక్కన పెట్టండి.. అసలు మీరెప్పుడైనా పిన్ నెంబర్‌కు ఎందుకు 4 అంకెలు ఉంటాయని ఆలోచించారా.?
1969వ సంవత్సరంలో స్కాటిష్ శాస్త్రవేత్త షెపర్డ్ బారన్ ఏటీఎంను కనుగొన్నారు. మొదటిలో ఏటీఎం పిన్ నెంబర్‌కు.. 6 అంకెలు ఉండేవి. అయితే చాలామంది పిన్ నెంబర్‌ను మర్చిపోయేవారట.. ఈ మేరకు అనేక ఫిర్యాదులు రావడంతో దాన్ని కాస్తా నాలుగు నెంబర్స్‌కు కుదించారట. కాని 6 నెంబర్స్ ఉండటం కొంతమేరకు మంచిదే. ఎవ్వరూ కూడా హ్యాక్ చేయలేరు. ఇదిలా ఉంటే.. ఏటీఎం సృష్టికర్త షెపర్డ్ బారన్ ఇండియాలోనే జన్మించిన విషయం చాలామందికి తెలియదు. ఆయన 1925వ సంవత్సరంలో మేఘాలయ షిల్లాంగ్‌లో జన్మించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..