నాగుపాముతో పరాచకాలా.? తలపై ముద్దుపెట్టాడు.. దెబ్బకు మడతెట్టేసింది..

మనిషికైనా, చిన్న కీటకానికైనా, క్రూర జంతువుకైనా ప్రాణభయం అనేది ఒకేలా ఉంటుంది. తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని..

నాగుపాముతో పరాచకాలా.? తలపై ముద్దుపెట్టాడు.. దెబ్బకు మడతెట్టేసింది..
Snake Viral Video
Ravi Kiran

|

Sep 30, 2022 | 12:50 PM

మనిషికైనా, చిన్న కీటకానికైనా, క్రూర జంతువుకైనా ప్రాణభయం అనేది ఒకేలా ఉంటుంది. తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని అనిపిస్తే.. కచ్చితంగా ఎదురుదాడికి దిగుతాయి. పాములకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది.

సాధారణంగా పాములను చూస్తే చాలు.. చాలామంది జనాలు ఠక్కున భయంతో పరుగులు పెడతారు. ఇక స్నేక్ క్యాచర్స్ అయితే.. ఎప్పుడూ పాములతోనే సావాసం చేస్తుంటారు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగిన వారి ప్రాణాలు పోయినట్లే. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో ఓ నాగుపాము కలకలం సృష్టించింది. దీంతో స్థానికులు అక్కడ దగ్గరలో ఉన్న స్నేక్ క్యాచర్ అలెక్స్‌కు సమాచారం అందించారు. అతడు నాగుపామును చాకచక్యంగా పట్టుకుని.. దాని తలపై ఓ ముద్దు పెడతాడు. అంతే! ఒక్కసారిగా విషసర్పం ఎదురుదాడికి దిగింది. నన్ను పట్టుకున్నదే కాకుండా ముద్దు కూడా పెడతావా.. అంటూ అతనిపై ఎటాక్‌ చేసింది. అతడి పెదవిపై కాటు వేసింది. మనోడు ఇంకేం చేస్తాడు.. ఆ పామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టి.. ఆ తర్వాత చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరుతాడు. కాగా, ప్రస్తుతం అలెక్స్ కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఈ  ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఎంత స్నేక్‌ క్యాచర్‌ అయినా పాములతో పరాచకాలు ప్రమాదం అంటున్నారు.

ఆ వైరల్ వీడియో ఇదే.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu