- Telugu News Photo Gallery Tooth Brush and Nausea: Do You have Nausea every time during Tooth Cleaning? Know the reason here
Tooth Brush and Nausea: బ్రష్ చేసేటప్పుడు మీకూ వాంతి అవుతుందా? ఇది దేనికి సంకేతమో తెలుసా
మన నిత్య జీవితంలో ఒక్కోసారి వివిధ కారణాల వల్ల వాంతులు సంభవిస్తుంటాయి. ఇదొక సాధారణ సమస్య. అయితే చాలా మంది పళ్ళు తోముకునేటప్పుడు కూడా వాంతులు చేసుకుంటారు. ఇది కేవలం ఒకటి రెండు రోజులు జరిగితే పెద్దగా సమస్యకాదు. బదులుగా పళ్ళు తోముకున్న..
Updated on: Mar 26, 2025 | 1:12 PM

వాంతులు వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. ఇదొక సాధారణ సమస్య. అయితే చాలా మంది పళ్ళు తోముకునేటప్పుడు కూడా వాంతులు చేసుకుంటారు. ఇది కేవలం ఒకటి రెండు రోజులు జరిగితే పెద్దగా సమస్యకాదు. బదులుగా పళ్ళు తోముకున్న ప్రతిసారీ ఈ సమస్య తలెత్తితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోకూడదు.

వాంతులు కారణంగా తరచుగా చికాకు కలిగిస్తుంది. ముఖ్యంగా తిన్న తర్వాత బ్రష్ చేసేటప్పుడు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీని నుండి బయటపడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. చాలా సందర్భాలలో పెద్ద బ్రష్‌ని ఉపయోగించడం వల్ల కూడా నోటి లోపల చాలా స్థలంలేక అది వాంతి చేసుకునే ధోరణిని పెంచుతుంది. అలాగే మృదువైన బ్రష్‌ని ఉపయోగించి బ్రష్ చేయాలి. బలవంతంగా కాకుండా నెమ్మదిగా దంతాలను బ్రష్ చేయాలి.

కొన్నిసార్లు టూత్‌పేస్ట్ కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. మీరు తక్కువ నురుగు వచ్చే టూత్‌పేస్ట్‌ని ఉపయోగించి బ్రష్ చేసుకోవాలి. అప్పుడు, నురుగు తక్కువగా ఉండటం వల్ల వాంతి చేసుకునే ధోరణి కూడా తగ్గవచ్చు.

బ్రష్ చేసే ముందు నీటితో శుభ్రం చేసుకుని పుక్కిలించి, ఆ తర్వాత బ్రష్ చేసుకోవాలి. ఇది వికారం సమస్యను పరిష్కరిస్తుంది.

ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది ప్రాథమికంగా దంతాలను తాకడం ద్వారా శుభ్రపరుస్తుంది. ఫలితంగా తక్కువ సమస్యలు ఉండవచ్చు. అలాగే వేర్వేరు సమయాల్లో బ్రష్ చేయడం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నింయాలి. సమస్య ఇంకా కొనసాగితే దంతవైద్యుడిని సంప్రదించాలి.





























