Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: పోటుగాడురా పంత్.! డకౌట్‌లోనూ డబ్బుల సంపాదనే.. మ్యాచ్‌కు ఎన్ని కోట్లంటే.?

లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్ మొదటి మ్యాచ్ లో ఓటమి పాలైంది. రిషభ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరించిన ఈ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. మొదటి మ్యాచ్ లో డకౌట్ అయినా.. రిషభ్ పంత్ ఒక్కో మ్యాచ్ సంపాదన ఎంతంటే..

IPL 2025: పోటుగాడురా పంత్.! డకౌట్‌లోనూ డబ్బుల సంపాదనే.. మ్యాచ్‌కు ఎన్ని కోట్లంటే.?
Pant
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 26, 2025 | 2:02 PM

IPL 2025 ప్రారంభ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిని చవిచూసింది. సీజన్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఒక వికెట్ తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ పంత్.. వికెట్ల వెనుక కూడా విఫలమయ్యాడు. అతడు చేసిన పొరపాట్లే ఈ మ్యాచ్‌లో LSG ఓటమికి ప్రధాన కారణమని పలువురు మాజీ క్రికెటర్లు చెబుతున్నారు.

ఇది చదవండి: సంతృప్తి కోసం ప్రైవేట్‌ పార్టులోకి.. నొప్పితో పరుగు పరుగున ఆస్పత్రికి.. ఎక్స్‌రే తీయగా

పంత్ డకౌట్, కానీ రూ. 2 కోట్ల సంపాదన..

ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పంత్.. మొదటి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఒక జట్టు ఐపీఎల్ సీజన్‌లో కనీసం 14 మ్యాచ్‌లు ఆడుతుంది. దీని ప్రాతిపదికన పంత్ మ్యాచ్ ఫీజు దాదాపు రూ. 2 కోట్లు. అంటే మొదటి మ్యాచ్ డకౌట్ అయినా.. అతడి సంపాదన రూ. 2 కోట్లు. ఈ తరుణంలో పంత్ ఆడిన 6 బంతులకు.. ఒక్కోదానికి రూ. 30 లక్షల చొప్పున సంపాదించాడన్న మాట.

మరోవైపు రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో విఫలం కావడమే కాదు.. వికెట్ కీపింగ్‌లోనూ ఫెయిల్ అయ్యాడు. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 15వ ఓవర్‌ను లక్నో బౌలర్ షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌ చేశారు. అప్పుడు ఢిల్లీ బ్యాటర్ అశుతోష్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను పంత్ జారవిడిచాడు. దీని తర్వాత, అశుతోష్ శర్మ మ్యాచ్‌ను ఒంటిచేత్తోతో గెలిపించాడు. పంత్ ఈ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ఇది మాత్రమే కాదు మ్యాచ్ చివరి ఓవర్లో పంత్ మరో తప్పు చేశాడు. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో మోహిత్ శర్మ స్టంపింగ్‌ను కూడా పంత్ మిస్ అయ్యాడు. పంత్ ఈ స్టంపింగ్ చేసి ఉంటే LSG మ్యాచ్ గెలిచి ఉండేది. ఎందుకంటే ఢిల్లీ అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఒకవేళ పంత్ స్టంపింగ్ చేసి ఉంటే.. కచ్చితంగా లక్నో గెలిచేది.

ఇక ఈ ఓటమి తర్వాత రిషబ్ పంత్ మాట్లాడుతూ, ‘మేము మంచి స్కోర్ చేశాం. నిజంగా మా జట్టు బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. మిడిల్ ఓవర్లలో మేము వికెట్లు కోల్పోయి ఉండొచ్చు. కానీ ఈ వికెట్‌పై మేము చేసింది మంచి స్కోర్. ఒక జట్టుగా మేము ప్రతి మ్యాచ్ నుంచి సానుకూల అంశాలను తీసుకొని దాని నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాం. ఇది టోర్నమెంట్ ప్రారంభం మాత్రమే.. మున్ముందు అద్భుతంగా రాణిస్తాం.’

ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..