వేయించిన శనగపప్పు మనలో చాలా మందికి మదుర జ్ఞాపకం. చిన్నతనంలో చొక్కా, లాగు జేబుల్లో కాసిన్ని పోసుకుని స్కూల్‌కి వెళ్లే వాళ్లం.. గుర్తుందా?
TV9 Telugu
శనగలు తినడానికి రుచికరంగా ఉండటమే కాదు.. మంచి చిరుతిండి కూడా. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. రోజూ వేయించిన శనగలు తింటే ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
పోషకాల స్టోర్ హౌస్‌గా పలిచి శనగల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, బి కాంప్లెక్స్ వంటి అనేక పోషకాలు వీటిల్లో అధికంగా ఉంటాయి
TV9 Telugu
రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే, అది మీ బరువును నియంత్రణలో ఉంచుతుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచి ఆకలిని నియంత్రిస్తుంది
TV9 Telugu
తద్వారా ఎక్కువ సమయం పాటు ఆకలిగా అనిపించదు. కొవ్వును కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజూ వేయించిన శనగలు తినడం వల్ల రక్తహీనత ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
శనగల్లో ఐరన్‌తోపాటు అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ వేయించిన శనగలు తింటే మీ ఎముకలు, కండరాలు కూడా బలంగా మారుతాయి
TV9 Telugu
రోజంతా శక్తిగా, ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. వేయించిన శనగలు గుండెకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది
TV9 Telugu
అలాగే రక్తంలో చక్కెరను నియంత్రించడంలోనూ ఇవి సహాయపడతాయి. అయితే వేయించిన శనగలు తిన్న తర్వాత పుష్కలంగా నీళ్లు తాగాలి. మలబద్ధకం సమస్య ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిది