ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాసింత అల్లం - వెల్లుల్లి కలిపి తిన్నారంటే..
26 March 2025
TV9 Telugu
TV9 Telugu
దాదాపు ప్రతి ఇంటి వంట గదిలో అల్లం, వెల్లుల్లి ఉంటుంది. ఇవి వంటలకు ప్రత్యేక రుచిని ఇవ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలకు కూడా దివ్యౌషధంలా పని చేస్తాయి
TV9 Telugu
వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి
TV9 Telugu
వెల్లుల్లి జీర్ణవ్యవస్థను సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం, చికాకును తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
అల్లం, వెల్లుల్లి ధమనులను శుభ్రపరచడంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
TV9 Telugu
అల్లం, వెల్లుల్లి టీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. జీవక్రియను పెంచుతాయి
TV9 Telugu
వీటితో తయారు చేసిన టీ జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అల్లం, వెల్లుల్లి కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది
TV9 Telugu
ముఖ్యంగా వీటిని ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి అధిక ప్రయోజనం చేకూరుస్తుంది. అల్లం, వెల్లుల్లిని పచ్చిగా కూడా తినవచ్చు. లేదంటే టీ, చట్నీ లేదా ఇతర వంటకాల్లోనూ తీసుకోవచ్చు
TV9 Telugu
ఎన్నో ఔషధ గుణాలున్న వీటిని హోమియోపతిలో కూడా ఉపయోగిస్తారు. కడుపు ఉబ్బరం, ఆహారం జీర్ణం కాకపోవటం వంటి సమస్యలున్న వాళ్లు నీళ్లలో అల్లం వేసి మరగబెట్టి తాగటం మంచిది