వేసవిలో పెరుగులో చియా గింజలు కలిపి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా
23 March 2025
TV9 Telugu
TV9 Telugu
వేసవి కాలంలో చాలా మంది పెరుగును తింటారు. ఇది కడుపును చల్లబరుస్తుంది. జీర్ణవ్యవస్థకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
TV9 Telugu
చియా గింజలు ప్రోటీన్ కి గొప్ప మూలం. ఎక్కువ మంది చియా విత్తనాలను స్మూతీలలో కలిపి తింటారు. అయితే వీటిని పెరుగులో నానబెట్టి కూడా తినవచ్చు.
TV9 Telugu
చియా గింజలు ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, వివిధ విటమిన్లు, ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. పెరుగుతో కలిపినప్పుడు..వాటి పోషక విలువలను పెంచుతాయి.
TV9 Telugu
పెరుగు, చియా గింజలు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పోషకాహార నిపుణురాలు న్మామి అగర్వాల్ అంటున్నారు. పెరుగులో వేసి కొంత సమయం తర్వాత తినండి.
TV9 Telugu
ప్రతిరోజూ పెరుగులో నానబెట్టిన చియా గింజలను తింటే.. అది మీ ఎముకలను బలపరుస్తుంది. కండరాలు కూడా వేగంగా పెరుగుతాయి
TV9 Telugu
చియా విత్తనాలలో ఐరెన్ పుష్కలంగా ఉంటుంది. మీ శరీరంలో ఐరెన్ లేదా రక్తం లోపం ఉంటే.. చియా విత్తనాలను పెరుగులో నానబెట్టి తీసుకోవచ్చు.
TV9 Telugu
పెరుగులో నానబెట్టిన చియా గింజలను తింటే కడుపు సమస్యలు తొలగిపోతాయి. ఇలా తినడం వలన మలబద్ధకం, గ్యాస్ , అసిడిటీ వంటి సమస్యలను నివారించవచ్చు.
TV9 Telugu
పెరుగులో నానబెట్టిన చియా విత్తనాలను క్రమం తప్పకుండా తినడం ద్వారా శరీరానికి తగినంత ప్రోటీన్, విటమిన్లు , ఖనిజాలు లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.