Mosquito: బ్లాక్‌ కలర్‌ దుస్తులను ధరించిన వారిని దోమలు ఎక్కువగా కుడుతాయి.. ఎందుకో తెలుసా.?

మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కడలేని దోమలు వస్తుంటాయి. కుప్పలుకుప్పులుగా వస్తుంటాయి. అయితే దోమలు మనల్ని అటాక్‌ చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మనిషిని కుట్టేవి కేవలం ఆడ దోమలే. దీనికి కారణం ఆడ దోమల సంతానోత్పత్తికి అవసరమయ్యే ప్రోటీన్లు మనిషి రక్తంలో ఉంటాయి. దోమలు మనిషిని కుట్టడానికి ప్రధాన కారణం ఇదే....

Mosquito: బ్లాక్‌ కలర్‌ దుస్తులను ధరించిన వారిని దోమలు ఎక్కువగా కుడుతాయి.. ఎందుకో తెలుసా.?
Mosquitoes
Follow us

|

Updated on: Jul 18, 2024 | 3:20 PM

కాలంతో సంబంధం లేకుండా దోమలు మనుషులపై దండయాత్ర చేస్తుంటాయి. కాస్త టైమ్‌ దొరికితే చాలు భరించలేని శబ్ధం చేస్తూ రక్తాన్ని పీల్చేస్తుంటాయి. ప్రశాంతంగా నిద్రపోదాంటే నిద్రపోనివ్వవు. అందుకే దోమలను తరిమికొట్టేందుకు ప్రజలు ఎన్నో రకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. కాయిల్స్‌, లిక్విడ్స్‌తో దోమలను తరిమికొడుతుంటారు.

మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కడలేని దోమలు వస్తుంటాయి. కుప్పలుకుప్పులుగా వస్తుంటాయి. అయితే దోమలు మనల్ని అటాక్‌ చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మనిషిని కుట్టేవి కేవలం ఆడ దోమలే. దీనికి కారణం ఆడ దోమల సంతానోత్పత్తికి అవసరమయ్యే ప్రోటీన్లు మనిషి రక్తంలో ఉంటాయి. దోమలు మనిషిని కుట్టడానికి ప్రధాన కారణం ఇదే.

ఇక మనిషి నుంచి వచ్చే వాసన, కార్బన్‌డైయాక్సైడ్‌ ద్వారా కూడా దోమలు కుడుతాయని నిపుణులు చెబుతుంటారు. అలాగే బ్లడ్ గ్రూప్‌ ఆధారంగా కూడా దోమలు కుడుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా ఏ గ్రూప్‌ బ్లడ్‌ ఉన్న వారిని దోమలు తక్కువగా కుడుతాయని, ఓ గ్రూప్‌ బ్లడ్ వారిని ఎక్కువగా కుడుతాయని పరిశోధనల్లో తేలింది. కాగా మొన్నటికి మొన్న నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలిన అంశం ప్రకారం.. బీర్‌ ఎక్కువగా తీసుకునే వారికి కూడా దోమలు కుడుతాయి. ఇదిలా ఉంటే మనం ధరించే డ్రస్‌ రంగు ఆధారంగా కూడా దోమలు అట్రాక్ట్ అవుతాయని మీకు తెలుసా.?

అవును నలుపు రంగు దుస్తులకు దోమలు ఎక్కువగా అట్రాక్ట్‌ అవుతుంటాయి. సాధారణంగా నలుపుతో పాటు ముదురు రంగు డ్రస్‌లు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. నలుపు రంగు త్వరగా వేడెక్కడానికి ఇదే కారణం. వేడి కారణంగా దోమలు కూడా దాని వైపు ఎక్కువగా ఆకర్షితులవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే సమ్మర్‌లో బ్లాక్‌ డ్రస్‌లను వేసుకోకూడదని నిపుణులు చెబుతుంటారు.

అందుకే దోమలు ఎక్కువగా కుట్టకూడదని అనుకుంటే బ్లాక్‌ కల్ డ్రస్‌లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దోమ కాటు వల్ల డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో ఇంట్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దీనివల్ల దోమల సంతానం పెరగకుండా అడ్డకట్ట వేయొచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో కేదారనాథ్ తరహా ఆలయ నిర్మాణం
తెలంగాణలో కేదారనాథ్ తరహా ఆలయ నిర్మాణం
ఇలాంటి దరిద్రపు ఫోటోషూట్స్ చేస్తే.. ఊరుకుంటారా.! గూబ గుయ్యామందిగా
ఇలాంటి దరిద్రపు ఫోటోషూట్స్ చేస్తే.. ఊరుకుంటారా.! గూబ గుయ్యామందిగా
సూపర్ హిట్ బూమర్ అంకుల్.. తెలుగులోకూ వస్తున్నాడు..
సూపర్ హిట్ బూమర్ అంకుల్.. తెలుగులోకూ వస్తున్నాడు..
నన్ను కూడా లైంగికంగా వేధించారు! క్యాస్టింగ్ కౌచ్ పై హీరో కామెంట్స
నన్ను కూడా లైంగికంగా వేధించారు! క్యాస్టింగ్ కౌచ్ పై హీరో కామెంట్స
ఇట్స్‌ అఫీషియల్.! హార్దిక్‌ను వదిలి అర్థరాత్రి వెళ్లి పోయిన భార్య
ఇట్స్‌ అఫీషియల్.! హార్దిక్‌ను వదిలి అర్థరాత్రి వెళ్లి పోయిన భార్య
హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై కత్తి పోట్లు.. వీడియో వైరల్..
హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై కత్తి పోట్లు.. వీడియో వైరల్..
అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..
అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..
కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!
కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!
సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..
సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..
కృష్ణదాస్ కీర్తనలకు డాన్స్ చేస్తూ సందడి చేసిన కింగ్ కోహ్లీ అనుష్క
కృష్ణదాస్ కీర్తనలకు డాన్స్ చేస్తూ సందడి చేసిన కింగ్ కోహ్లీ అనుష్క