knowledge: అన్ని పక్షులుండగా.. పావురాలతోనే ఉత్తరాలు ఎందుకు పంపేవారో తెలుసా.?
రాజుల కాలంలో సమాచార మార్పిడి కోసం ఉత్తరాలను పావురాల కాళ్లకు కట్టి పంపించే వారు. అలా పావురాలు వెళ్లి సమాచారాన్ని చేర వేశాయి. అయితే ఇప్పుడు కాలం మారింది మారిన టెక్నాలజీ కారణంగా క్షణాల్లో ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అవుతోంది. సోషల్ మీడియా, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్‌తో ఏకంగా వీడియో కాల్స్ మాట్లాడుకునే స్థాయికి ఎదిగిపోయాం. ఇదిలా ఉంటే పావురాలు నిర్ధేశించిన...
ప్రస్తుతం ఎవరికైనా సమాచారాన్ని అందించాలంటే క్షణాల్లో పని. ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారితోనైనా సెకండ్స్ వ్యవధిలో మాట్లాడుకుంటున్నాం. సమాచార మార్పిడి చేసుకుంటున్నాం. కానీ కొన్ని వందళ ఏళ్ల క్రితం మాత్రం సమాచార మార్పిడి కోసం పావురాలను ఉపయోగించే వారు.
రాజుల కాలంలో సమాచార మార్పిడి కోసం ఉత్తరాలను పావురాల కాళ్లకు కట్టి పంపించే వారు. అలా పావురాలు వెళ్లి సమాచారాన్ని చేర వేశాయి. అయితే ఇప్పుడు కాలం మారింది మారిన టెక్నాలజీ కారణంగా క్షణాల్లో ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అవుతోంది. సోషల్ మీడియా, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్‌తో ఏకంగా వీడియో కాల్స్ మాట్లాడుకునే స్థాయికి ఎదిగిపోయాం. ఇదిలా ఉంటే పావురాలు నిర్ధేశించిన ప్రాంతానికి సరిగ్గా ఉత్తరాలను ఎలా తీసుకెళ్లేవి.? దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పావురాలు ప్రయాణ మార్గాన్ని బాగా గుర్తుంచుకుంటాయి. ఒకసారి ప్రయణించిన మార్గాన్ని ఎప్పటికీ మరిచిపోవు. అందుకే ఉత్తరాలను పంపేందుకు వీటిని ఉపయోగించే వారు. పావురంలోని ఒక ప్రత్యేకమైన వ్యవస్థ, జీపీఎస్ మాదిరిగా పనిచేస్తుంది. దీని కారణంగానే పావురం తాను ప్రయణించిన మార్గాన్ని మరిచిపోదు. అలాగే పావురాలు కొత్త మార్గాన్ని అన్వేషించేందుకు మాగ్రెటోరిసెప్షన్ అనే పైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి.
ఓ నివేదక ఆధారంగా పావురం శరీరంలో 53 రకాల ప్రత్యేక కణాలు సమూహం ఉందని తేలింది. పావురం దిశను గుర్తించడంలో సహయపడేవి ఇవే. అచ్చంగా మనుషుల్లాగానే పావురాలు కూడా తమ దృష్టి ద్వారా దిశలను సులభంగా గుర్తిస్తాయి. పావురం కళ్లలోని రెటీనాలో ఒక ప్రత్యేక తరహా ప్రోటీన్ కారణంగానే దృష్టి బాగా ఉంటుంది. పావురాలను ఉత్తరాలు పంపించడానికి ఇవి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..