AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Study: సోషల్‌ మీడియా వాడకాన్ని తగ్గిస్తే.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..

అయితే కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు ప్రపంచాన్ని మార్చిన సోషల్‌ మీడియాతో అదే స్థాయిలో దుష్ఫ్రభావాలు కూడా ఉన్నాయి. సోషల్‌ మీడియా మనుషుల ఆలోచన విధానంపై కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో చేసే పోస్టులను చూడడం వల్ల ఆత్మన్యూనత, అభద్రత వంటి మానసిక సమస్యలు వస్తున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో స్పష్టమైంది. సోషల్‌ మీడియాలో ఉండేదంతా...

Study: సోషల్‌ మీడియా వాడకాన్ని తగ్గిస్తే.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..
Social Media
Narender Vaitla
| Edited By: |

Updated on: Dec 18, 2023 | 12:36 PM

Share

ప్రపంచ గమనాన్ని సోషల్‌ మీడియా ఒక్కసారిగా మార్చేసింది. పదేళ్ల చిన్నారి నుంచి 80 ఏళ్ల వారి వరకు ప్రతీ ఒక్కరికీ సోషల్‌ మీడియాలో అకౌంట్ ఉండడం సర్వసాధారణంగా మారిపోయింది. సోషల్‌ మీడియా రాకతో సమాచార విప్లవం కూడా పెరిగింది. ప్రపంచంలో ఏదో మూలన జరిగిన సంఘటన సైతం అందరికీ క్షణాల్లో తెలిసిపోతోంది.

అయితే కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు ప్రపంచాన్ని మార్చిన సోషల్‌ మీడియాతో అదే స్థాయిలో దుష్ఫ్రభావాలు కూడా ఉన్నాయి. సోషల్‌ మీడియా మనుషుల ఆలోచన విధానంపై కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో చేసే పోస్టులను చూడడం వల్ల ఆత్మన్యూనత, అభద్రత వంటి మానసిక సమస్యలు వస్తున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో స్పష్టమైంది. సోషల్‌ మీడియాలో ఉండేదంతా నిజమేనన్న భావనలో కొందరు తమను తాము తక్కువ చేసుకుంటున్నట్లు మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఇవే విషయాలు వెల్లడయ్యాయి. సోషల్‌ మీడియా వాడకాన్ని ఎంత తగ్గిస్తే, మానసిక ఆరోగ్యం అంత మెరుగుపడుతుందని అధ్యయంలో తేలింది. రోజులో కనీసం 30 నిమిషాలైనా సోషల్‌ మీడియా వాడకాన్ని తగ్గించుకోవాలని ఈ అధ్యయనం సూచిస్తోంది. దీనిద్వారా పనిపై ఏకాగ్రత పెరగడంతో పాటు, వృత్తిలో సంతృప్తి దక్కుతుందని పరిశోధకులు చెబుతున్నారు. జర్మన్‌ సెంటర్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌, రూర్‌ వర్సిటీకి చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

అధ్యయనంలో తేలిన వివరాలను ‘బిహేవియర్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ’ జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో భాగంగా మొత్తం 166 మందిని ఎంచుకున్నారు. వీరిని రెండు గ్రూపులుగా విడగొట్టారు. వీరిలో ఒక గ్రూప్‌కు చెందిన వారిని సోషల్‌ మీడియా వాడకాన్ని 30 నిమిషాలు తగ్గించమని చెప్పారు. మరో గ్రూప్‌ సభ్యులను యథావిధిగా సోషల్‌ మీడియా వాడకాన్ని కొనసాగించమని చెప్పారు. పరిశోధనకు ముందు, తర్వాత సభ్యులను కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు సేకరించారు. వీరిలో సోషల్‌ మీడియా వాడకాన్ని తగ్గించిన గ్రూప్‌ సభ్యులు తమ మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని, ఉద్యోగంలో సంతృప్తి ఉందని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌